అవమాన భారంతో బెంగళూరు యెలహంక ప్యాలెస్ కు జగన్ షిప్ట్

Publish Date:Aug 3, 2024

Advertisement

వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. దాదాపు నలభై రోజుల వ్యవధిలో ఆయన బెంగళూరుకు వెళ్లడం ఇది నాలుగోసారి. మాజీ సీఎం గత మంగళవారం బెంగళూరు నుంచి తిరిగి వచ్చారు. ఐదు రోజుల వ్యవధిలో తిరిగి వెళ్లారు. ఈ నెల 5న లేదా 6న ఆయన తాడేపల్లికి తిరిగి రానున్నారని సమాచారం.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ బెంగళూరులో ఎక్కువగా ఉంటున్నారు. ఇటీవల ఢిల్లీలో ధర్నాకు హాజరయ్యారు. ఇప్పటివరకూ రెండుసార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ తొలిరోజు మాత్రం హాజరై తిరిగి వెళ్లిపోయారు.ఎపిలో  వైకాపా ఘోర పరాజయం తర్వాత తెలుగు దేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలో వచ్చింది. కేవలం 11 సీట్లకే పరిమితమైన వైకాపా అవమానభారంతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ చేరుకుంటారని ప్రచారం అయితే జరిగింది కానీ జగన్  హైదరాబాద్ లోని తన లోటస్ పాండ్   గడపదొక్కలేదు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ మాజీ సిఎం కెసీఆర్ తుంటి ఎముక విరిగి యశోదాహస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలో జగన్ హైదరాబాద్ కు వచ్చారు. అప్పట్లో లోటస్ పాండ్ వెళతారని అందరు అనుకున్నారు. కానీ జగన్ అప్పుడు కూడా లోటస్ పాండ్ వెళ్లలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో కొనసాగుతుంది. హైదరాబాద్  సేప్ జోన్ కాదని జగన్ డిసైడైపోయారు. ఈ కారణంగానే బెంగుళూరు వెళుతున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన డికె శివకుమార్ కర్ణాటక డిప్యూటి సీఎం పదవిలో కొనసాగుతున్నారు.కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గరగా ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చని జగన్ భావిస్తున్నారు.  కాబట్టే బెంగుళూరుకు షిప్ట్ అయ్యే ఆలోచనలో  ఉన్నారు. వైకాపా తిరిగి అధికారంలోకి రావడం కల్ల అని జగన్ కు తెలిసి పోయింది. దీంతో ఆయన ఎక్కువగా బెంగుళూరులోని యెలహంక ప్యాలెస్ కు పరిమితమయ్యారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా కట్టిన  తాడేపల్లిలోని వైకాపా కార్యాలయాన్ని కూటమి ప్రభుత్వం కూల్చి వేసింది. ప్రస్తుతం తాడేపల్లిలో ఆయన నివాసానికి తాళం వేసే ఆలోచనలో ఉన్నారు. రాజకీయంగా అధోపాతాళానికి పడిపోయిన జగన్ మళ్లీ కోలుకునే అవకాశం లేదు. అవమానభారంతో కుమిలిపోతున్న  జగన్  మొహం చాటేయాలని డిసైడ్ అయ్యారు. తాను గత 20 ఏళ్ల క్రితం నిర్మించుకున్న యెలహంక ప్యాలెస్ కు గత పదేళ్లుగా దూరంగా ఉన్నారు.  బెంగుళూరు ఎయిర్ పోర్ట్ కు ఆనుకుని 30 ఎకరాల్లో యెలహంక ప్యాలెస్ ఉంది. వైకాపా పెట్టిన తర్వాత ఆయన తెలుగు రాష్ట్రాలకే పరిమితమయ్యారు. వైకాపా పెట్టిన తర్వాత హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించారు. ఎపిలో వైకాపా అధికారంలో వచ్చిన తర్వాత పూర్తిగా తాడేపల్లి నివాసానికి పరిమితమయ్యారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఓటమి తర్వాత జగన్ పార్టీని బలోపేతం చేసుకోలేకపోయారు. తెలుగు దేశం ప్రభుత్వాన్ని నిలువరించే సత్తా జగన్ కు లేకపోవడంతో బిస్తర్ ఎత్తేశాడని ప్రచారం  జరుగుతుంది.

By
en-us Political News

  
ప్రేమలో పడితే చాలా మంది పిచ్చి పనుల చేస్తుంటారు. నా కోసం ఏం చేస్తావని ప్రియురాలు అడిగితే.. ప్రాణమైనా ఇస్తానని లేదా ఆకాశంలోని చుక్కలైనా తెచ్చిస్తానని సినిమా డైలాగులు చెబుతుంటారు.
చిన్న రీఫండ్ కోసం ప్రయత్నించింది.. చివరకు భారీ మొత్తాన్ని పోగొట్టుకుంది.!
ఫ్రీ బస్సులో భార్య.. నవ్వులు పూయిస్తున్న భర్త ఆవేదన. !
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక మందన్నలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై వారి అధికారిక బృందం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
భాగ్యనగర ప్రయాణ ముఖచిత్రం మారనుందా? నగరంలో మెట్రో రైలు సేవలను శివారు ప్రాంతాలకు విస్తరించడంతో పాటు విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని కల్పించే దిశ
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన వంద కోట్ల రూపాయల ప్రైవేట్ పాఠశాలల అనుమతుల కుంభకోణంలో డీఎంకే సీనియర్ నేత
హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు మేక శవంతో డెత్ డ్రామా.!
దేశ రాజధాని దిల్లీలో ఎన్నికల సంఘం పనితీరును నిరసిస్తూ కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
నా చావుకే రూ.40 కోట్ల విలువనా? లేక నేను బతికి ఉండాలా అనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి! అంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు
ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనానికి బానిసైన ఓ యువకుడు తన విలాసవంతమైన జీవితం కోసం ఏకంగా కిడ్నాప్ నాటకానికి తెరలేపాడు.
ఉద్యోగాల ఆశ చూపించి విదేశీ మహిళలను భారత్‌కు రప్పించడం.. ఆపై వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించడంతో మాదాపూర్‌లో వెలుగుచూసిన ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.
సీఎం రేవంత్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ.. 152 మీటర్ల ఎత్తుపై ముందడుగు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.