అమ్మ అండ కోసం తహతహ.. గెంటేసిన సంగతి మరిచావా జగన్!

Publish Date:Mar 5, 2024

Advertisement

గత ఎన్నికల్లో  వైసీపీ   151 అసెంబ్లీ స్థానాలు, 23 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకొని ఘన విజయం సాధించడం వెనుక   జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల, బావ బ్రదర్ అనిల్, వైఎస్ ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులతో పాటు ఐ ప్యాక్ సంస్థ అధినేత ప్రశాంత్ కిషోర్ వరకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే ఐదేళ్లు గిర్రున తిరిగి మళ్లీ ఎన్నికలు సమీపించే సమయానికి  సీఎం జగన్ వెంట వీరెవరూ లేరు. వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి, అలాగే మేనత్త  విమలారెడ్డి మాత్రమే ఇప్పుడు జగన్ పక్కన నిలబడ్డారు. 2024 ఎన్నికలలో  2019 ఎన్నికలను మించిన విజయం సాధించి వరుసగా రెండో సారి అధికారంలోకి రావాలని భావిస్తున్న జగన్ కు సొంత వారెవరూ అండగా నిలబడకపోవడమే కాకుండా ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తుండటం ప్రత్యేకించి చెప్పుకోవాల్సి ఉంది.

సొంత చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసును.. ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ చొరవ తీసుకొని.. ఈ కేసు ఛేదించాల్సింది పోయి, ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న   వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిలను రక్షించడానికి తన అధికారాన్నంతా దుర్వినియోగం చేశారనీ, చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.   సొంత బాబాయ్ వైఎస్ వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి.. దేశ రాజధాని ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా ప్రెస్‌మీట్ పెట్టి.. తన తండ్రి హత్య కేసు ఛేదించడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. ఈ ప్రభుత్వానికి ఓటు వేయవద్దంటూ ఆంధ్ర ఓటర్లకు  ఆమె విజ్జప్తి చేశారు. అలాగే తన తండ్రి హత్య ఛేదించడంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఈ సందర్బంగా గట్టగానే ఎండగట్టారు.

ఇది చాలదన్నట్లు జగన్ సిట్టింగ్ ల మార్పు పార్టీలో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. పలువురు సిట్టింగులు, ఎంపీలూ జగన్ పార్టీని వీడి తమదారి తాము చూసుకున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం  జగన్ బయటకు మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తూనే లోలోపల ఓటమికి సిద్ధపడిపోయారన్న ప్రచారం పార్టీలోనే జరుగుతోంది.  అయితే వచ్చే ఎన్నికల్లో ఏపీ విజయం కోసం జగన్ చివరి ప్రయత్నంగా వైసీపీ మాజీ గౌరవధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను మళ్లీ రంగంలోకి దింపాలన్న యోచన చేస్తున్నారని పార్టీలోనే విస్తృతంగా చర్చ జరుగుతోంది.

వచ్చే ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేయాల్సిందిగా ఆమెను కోరుతున్నారని అంటున్నారు.  అదీకాక వైయస్ జగన్‌కు మద్దతుగా వైయస్ విజయమ్మ రంగంలోకి దిగి మళ్లీ ప్రచారం చేసేందుకు ప్రజల మధ్యకు వస్తే.. ఆమెకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలున్నాయని,  జగన్ గద్దెనెక్కిన ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పలు విధాలుగా ఇబ్బందులు పడ్డారని... అలాంటి సమయంలో.. వైఎస్ విజయమ్మ అటు వైపు తొంగి చూసిన దాఖలాలు లేవనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాంటి వేళ కుమారుడు వైఎస్ జగన్‌కు వరుసగా రెండో సారి అధికారం కట్టబెట్టడం కోసం  వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే.. ప్రజల నుంచి  సానుకూల స్పందన వచ్చే అవకాశం ఇసుమంతైనా లేదని అంటున్నారు. అదీ కాక పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఆమె చేత రాజీనామా చేయించి పక్కరాష్ట్రానికి తరిమేసిన సంగతిని ఇప్పుడు తన కన్వీనియెన్స్ కోసం జగన్ మరచిపోయినా, జనం మర్చిపోరనీ, మర్చిపోలేదనీ అంటున్నారు. ఆ విషయాన్ని మరచి కుమారుడి కోసం మళ్లీ ఏపీ రాజకీయాలలోకి విజయమ్మ అడుగుపెడతారా అన్నది కూడా అనుమానమే అంటున్నారు. 

By
en-us Political News

  
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.