జగన్‌‌‌ వర్సెస్‌ పవన్‌... జనం ఎవరి పక్షం?

Publish Date:Aug 1, 2017

Advertisement

 

ఏపీలో అప్పుడే పొలిటికల్‌ వార్‌ మొదలైంది. సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైమున్నా... ఏపీ రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. కూల్ కూల్ గా సాగాల్సిన అక్టోబర్‌లో పొలిటికల్‌ హీట్‌ పుట్టించేందుకు ఒకవైపు జగన్‌.... మరోవైపు పవన్ రెడీ అవుతున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ఇద్దరూ అక్టోబర్‌ నెలనే ఎంచుకోవడంతో... రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. జగన్‌ పాదయాత్రలకు ప్రశాంత్ కిషోర్ స్కెచ్ వేస్తే... ఇకపై తన టైమ్ లో మూడో వంతు రాజకీయాలకే కేటాయిస్తానంటూ ఢంకా బజాయించి చెప్పారు పవన్.

 

జగన్ పాదయాత్రకు ముందు 60 రోజుల యాక్షన్ ప్లాన్  సిద్ధం చేసింది ప్రశాంత్ కిషోర్ టీమ్. పాదయాత్ర కోసం మూడు దశల్లో  కార్యక్రమాలను డిజైన్ చేశారు. సెప్టెంబర్ 2 నుంచి 9 వరకూ మరోసారి ఇంటింటికీ వైసీపీ కార్యక్రమం చేపడతారు. అలాగే 2019 ఎన్నికల కోసం సిద్ధం చేసిన 9 అంశాల మేనిఫెస్టోను నవరత్నాల పేరుతో ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లనున్నారు.సెప్టెంబర్ 22 నుంచి 25 వకూ విజయ శంఖారావం ఏర్పాటు చేశారు. జగన్ ఈ రేంజ్ లో పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోగా పవన్ కూడా అక్టోబర్ నుంచే జనం మధ్యకు వెళ్లనున్నారు. జగన్‌ మాదిరిగా పాదయాత్ర కాకపోయినా.. దాదాపు అలాంటి వ్యూహంతోనే పవన్ కూడా జనం మధ్య ఉండేందుకు స్కెచ్‌ రెడీ చేసుకుంటున్నారు. అయితే జగన్‌ పాదయాత్రపై పవన్‌ పరోక్షంగా సెటైర్లు కూడా వేశారు. పాదయాత్రతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావన్న పవన్..  తాను కారులో వెళ్లడానికే కష్టమవుతోందని... ఇక పాదయాత్ర చేస్తే అడుగు కూడా ముందుకు పడదంటూ తనకున్న క్రేజ్‌, స్టామినా ఏంటో చెప్పకనే చెప్పారు.

 

అయితే పవన్ ఇప్పుటికిప్పుడు తన ప్రణాళికను సిద్ధం చేసుకోవడం వెనక చంద్రబాబు కుట్ర ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. పవన్ కల్యాణ్‌ ....చంద్రబాబు వదిలిన బాణమేనని అందుకే బాబుతో మీటింగ్ తర్వాతే తన కార్యాచరణను ప్రకటించారని అంటోంది. అయితే టీడీపీకి రహస్య స్నేహితుడినన్న వైసీపీ ఆరోపణలపైనా పవన్‌ ఘాటుగా స్పందించారు. తానెవరికీ రహస్య స్నేహితుడిని కాదంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి జగన్‌, పవన్‌ ప్రకటనలు చూస్తుంటే... ఇఫ్పుడే ఎన్నికలు వచ్చేశాయేమోనన్న అనుమానం కలుగక మానదు. ఇక జగన్‌, పవన్‌ ఒకేసారి జనంలోకి వెళ్లనుండటంతో... ఏపీ రాజకీయాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరూ జనాదరణ కలిగిన నేతలే.. ఒకరిది స్టార్ పవర్... మరొకరిది ఛరిష్మా పవర్... ఈ రెండు పవర్లలో ఏ పపర్ మోస్ట్ పవర్ ఫుల్లో...ఎవరి బలం ఎంతో... జనం ఎవరి పక్షమో ...2019లోనే తేలనుంది.

By
en-us Political News

  
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.