వలంటీర్లపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచీ తెలుగు దేశం శ్రేణులు చెబుతున్న మాటలనే జ్యోతుల నెహ్రూ కార్యకర్తల సమావేశంలో చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం విజయం ఖాయమనీ, అయతే వలంటీర్ల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలనీ హెచ్చరించారు.
వచ్చే ఎన్నికలలో వలంటీర్ల దొంగ ఓట్లేస్తారు. తస్మాత్ జాగ్రత్త అని జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం కార్యకర్తలను హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో జరిగిన తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో ఆయమ మాట్లాడారు. జగన్ వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి వలంటీర్లను నియమించినదే ఓటర్లకు డబ్బు మద్యం పంపిణీ చేయడానికీ, వారితో దొంగ ఓట్లు వేయించుకోవడానికీ అని ఆరోపించారు.
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభంజనం మొదలైందన్న నెహ్రూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అయితే పార్టీ కార్యకర్తలు ఎవరూ అతి ధీమాతో ఉదాశీనంగా ఉండొద్దని హెచ్చరించారు. వలంటీర్లు దొంగ ఓట్లు వేయకుండా చూసుకోవాల్సి ఉందన్నారు. వలంటీర్లపై తెలుగుదేశం కార్యకర్తలు ఓకన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
వలంటీర్ల వ్యవస్థ ద్వారా జగన్ రాష్ట్రంలో ప్రజలందరిపై నిఘా ఉంచి, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసేవారిని ఓట్లేయనీయకుండా నిలువరించే ప్రయత్నం చేస్తున్నదని జ్యోతుల నెహ్రూ అన్నారు. వలంటీర్లతో దొంగ ఓట్లు వేయించే ప్రమాదం ఉందన్నారు. దీనిని అడ్డుకోవడానికి పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. అలాగే మరింత జోరుగా పార్టీ సభ్యత్వం చేయించాల్సిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-volunteers-for-only-for-rigging-says-jyothula-nehru-39-141295.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.