వైసీపీలో జగన్ వర్సెస్ పెద్దిరెడ్డి?

Publish Date:Sep 20, 2025

Advertisement

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పార్టీలో అసంతృప్తి పేరుకుపోతున్న పరిస్థితులు ఉన్నాయని పార్టీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి. పార్టీ సీనియర్ నాయకులు జగన్ ఆదేశాలను ఇసుమంతైనా పట్టించుకోవడం లేదంటున్నారు. దీంతో పార్టీ పరిస్థితి బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉందనీ, జగన్ పై పార్టీలో తిరుగుబాటు వచ్చినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.  ముఖ్యంగా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ వైఖరితో విసిగిపోయారంటున్నారు వైసీపీ నేతలు. ఇటీవల పెద్దరెడ్డి తన అసమ్మతినీ, అసంతృప్తినీ బాహాటంగానే పార్టీ నేతల వద్దా, తన అనుచరుల వద్దా వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. 

వాస్తవానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో సీనియర్ నాయకుడు. అంతే కాకుండా వైఎస్ హయాం నుంచీ కూడా పెద్దిరెడ్డి ఆయన కుటుంబానికి విధేయంగా ఉంటూ వచ్చారు. వైఎస్ అనంతరం జగన్ తో కూడా అదే సాన్నిహిత్యం, విధేయతా ప్రదర్శిస్తూ వచ్చారు. అందుకే జగన్ ఆయనకు తన కేబినెట్ లో మంత్రిపదవి ఇవ్వడమే కాకుండా ఐదేళ్లూ మంత్రిగా కొనసాగనిచ్చారు. 

ఇక గత ఎన్నికలలో జగన్ పార్టీ అత్యంత ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో తన పట్టు నిలుపుకున్నారు. అలాగే ఆయన కుమారుడు కూడా రాజంపేట నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఇంత వరకూ బాగానే ఉంది.. కానీ ఎప్పుడైతే మద్యం కుంభకోణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డి అరెస్టయ్యారో అప్పటి నుంచీ పెద్దిరెడ్డిలో అసహనం మొదలైందంటున్నారు. మిథున్ రెడ్డి అరెస్టైన తరువాత ఇంత వరకూ జగన్ మిథున్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలిసి పరామర్శించకపోవడమే ఇందుకు కారణమంటున్నారు. కారణాలేమైనా ఒక్క మిథున్ రెడ్డి అనే కాదు..

మద్యం కుంభకోణంలో అరెస్టైన ఎవరినీ కూడా జగన్ రెడ్డి జైలుకు వెళ్లి పరామర్శించలేదు. ఆ విషయం అలా ఉండగా తాజాగా జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో  జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా జగన్  పెద్దిరెడ్డికి కీలక బాధ్యత అప్పగించారు. తాను అసెంబ్లీకి హాజరు కాకపోయినా.. పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరై పార్టీ వాయిస్ ను గట్టిగావినిపిచాలన్న జగన్  పెద్దిరెడ్డిని  ముందుండి పార్టీ సభ్యులను గైడ్ చేయాలని ఆదేశించారు. అయితే పెద్దిరెడ్డి ఆ ఆదేశాలను పాటించలేదు.. సరికదా తన వల్ల కాదని ముఖంముందే కుండబద్దలు కొట్టేశారు. అంతటితో ఆగకుండా పార్టీ అధినేత సభను బాయ్ కాట్ చేసి తనను వెళ్లమనడమేంటని పార్టీ  నేతలతో ఒకింత అసహనంతో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ విషయమే పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. పెద్దిరెడ్డి వంటి నేతే జగన్ ఆదేశాలను ఖాతరు చేయలేదంటే.. పార్టీపై జగన్ పట్టు సడలినట్టేనని అంటున్నారు.  సొంత పార్టీ నేతల విశ్వాసంపొందడంలోనే విఫలమైన జగన్ ను  జనం ఎలా నమ్ముతారని పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది.

By
en-us Political News

  
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.