Publish Date:Jan 23, 2026
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరయా అన్నట్లుగా ఉంది జగన్ తీరు. తన హయాంలో సర్వే రాళ్ల వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. స్థలాల సరిహద్దులను నిర్ణయిస్తూ ఏర్పాటు చేసే సర్వే రాళ్ల కోసం ఏకంగా రూ.700 కోట్లా వ్యయం చేయడం, ఖరీదైన గ్రానైట్ రాళ్లను వినియోగించడం అప్పట్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఆ రాళ్లపై జగన్ జగన్ ఫొటోలను ముద్రించడం కూడా పెను వివాదంగా మారింది. హైకోర్టు కూడా సర్వేరాళ్లపై జగన్ బొమ్మల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాగే భూముల రీ సర్వేకు సంబంధించి రైతులకు ఇచ్చిన పాస్ పుస్తకాలపై కూడా జగన్ బొమ్మ ఉండటంపై కూడా అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
కాగా 2024 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే భూముల రీసర్వేను పారదర్శకంగా చేపడతామనీ, అలాగే పట్టాదారు పాసుపుస్తకాలపై ఉన్న జగన్ బొమ్మలను తొలగిస్తామని అప్పటి విపక్ష నేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీ మేరకు ఖరీదైన సర్వే రాళ్లను తొలగించి సాధారణ రాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పాస్ పుస్తకాలపై జగన్ ఫొటోను తొలగించి ప్రభుత్వ రాజముద్రను ముద్రించారు పంపిణీ చేశారు. దీనిపై రైతులలో హర్షం వ్యక్తం అవుతోంది.
కానీ జగన్ మాత్రం తన తప్పులను తెలుగుదేశం ప్రభుత్వం సరిదిద్దడాన్ని సహించలేకపోతున్నారు. సరిహద్దురాళ్లు సరిగా లేవు, పాసుపుస్తకాలు కూడా తప్పుల తడకలా ఉన్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. గురువారం (జనవరి 22) తాడేపల్లి ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాదాపు రెండు గంటల సేపు మాట్లాడిన జగన్ తన ప్రసంగం మొత్తం తెలుగుదేశం కూటమి చేపట్టిన భూముల రీసర్వేపైనే మాట్లాడారు.
అసలీ కార్యక్రమాన్ని చేపట్టినది తానేనంటూ క్రెడిట్ చోరీకి శతధా ప్రయత్నించారు. వాస్తవానికి భూముల రీసర్వే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అదే సమయంలో అప్పట్లో తన నిర్వాకం అదే ఫొటోల వ్యవహారం తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నవ విషయాన్ని కనీసం ప్రస్తావించలేదు. భూ యజమానులకు జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాలపై తన సొంత ఫోటోను ముద్రించడం పట్ల జగన్ ఈ సమావేశంలో ఎలాంటి వివరణా ఇవ్వలేదు. అసలా ప్రస్తావన చేయడానికి కూడా సాహసించలేదు. అంతే కాదు తన హయాంలో సరిహద్దు రాళ్లపై తన పేరు, ఫోటో విషయాన్ని కూడా దాటవేశారు. దీంతో జగన్ మీడియా సమావేశంలో ప్రసంగం విన్నవారంతా తప్పులెన్నువారు అన్న వేమన శతకంలోని పద్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-unaware-of-his-own-mistakes-25-212920.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్