కాక్రోచే దిక్కు అంటున్న జగన్.. చేతులెత్తేసినట్టేనా?

Publish Date:Jun 11, 2026

Advertisement

రాజకీయాల్లో  ఏ ఎండకా గొడుగు పట్టడంలో వైసీపీ అధినేత జగన్ ది అందె వేసిన చెయ్యిగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ తెలుగుదేశం ఘనతలను తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నించిన జగన్ ఇప్పుడు..  నీట్ పరీక్షల లీకేజీ వ్యవహారంపై యువత ఆగ్రహం నుంచి పుట్టుకొచ్చిన  కాక్రోచ్ జనతా పార్టీ  ట్రెండ్‌ను  చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. నీట్ లీకేజీని  ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షల అంశానికి లింక్ చేసిమైలేజ్ పొందాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. 

తాడేపల్లిలో గురువారం (జూన్ 11) జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. దాదాపు రెండున్నర గంటల పాటు జగన్ రెండున్నర గంటల పాటు సాగిన మీడియా సమావేశంలో జగన్  సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.  ఇది జెన్-జీ కాలం.. ఇప్పుడు జెన్-ఆల్ఫా కూడా నడుస్తోంది. ఏపీలో కూడా కాక్రోచ్‌లు బయటకు వస్తాయి అంటూ ఆయన  చేసిన వ్యాఖ్యలు  రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నిజానికి ఆ రెండు జనరేషన్ల అర్థాలు ఏమిటి? అన్నది జగన్ కు ఎంత వరకూ తెలుసో కానీ,  జగన్ మాత్రం తాను  ఏపీ కాక్రోచ్ మూవ్ మెంట్ ను లీడ్ చేస్తానంటూ అన్యాపదేశంగా  ప్రకటించేశారు. 

అయితే  దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ   ఏపీలో మెగా డీఎస్సీ  పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది. ఈ డీఎస్సీ ప్రక్రియలో ఒక్కటంటే ఒక్క లీకేజీని కూడా జగన్  చూపించలేదు. ఆరోపణలు తప్ప ఆధారాలేవీ బయటపెట్టలేదు.  అయినప్పటికీ..  ఒక  అబద్ధాన్ని పదే పదే  చెబితే.. ఏపీ యువత  నమ్మేసి రోడ్లెక్కి  చంద్రబాబు ప్రభుత్వంపై దాడి చేస్తారని ఆయన నమ్ముతున్నారు. 

వాస్తవాలతో  సంబంధం లేకుండా, ప్రజలకు సరైన దిశానిర్దేశం చేయాల్సిన రాజకీయ నేత..  అసత్య ప్రచారాలతో జనాలను నమ్మించాలని చేస్తున్న ప్రయత్నాల పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్త మౌతున్నాయి.  ట్రెండ్ సృష్టించడమెందుకు.. ఫాలో అయితే పోలా అన్న చందంగా జగన్ .. కాక్రోచ్ జనతా పార్టీని గుడ్డిగా ఫాలో అవుతూ నీట్  లీకేజీకీ,  ఏపీ డీఎస్సీకీ ముడిపెట్టి లబ్ధి పొందాలని చూసిన తీరును నెటిజనులు ఎండగడుతున్నారు.  తాజా ప్రెస్ మీట్ లో జగన్ పదే పదే కాక్రోచ్ లు వస్తాయి అనడంతో నెటిజనులు  వైసీపీ పేరును.. కాక్రోచ్ జగన్ పార్టీ అని మార్చేస్తారేమో అని నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  ఏది ఏమైనా  జగన్ కొత్తగా మొదలెట్టిన  బొద్దింకల రాజకీయం ఏపీలో జగన్‌కు మైలేజీ ఇవ్వడం మాట అటుంచి.. జనంలో ఆయన నవ్వుల పాలు కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.