బడ్జెట్ జగన్నాథం!

Publish Date:Jul 19, 2024

Advertisement

సొంత సొమ్ము సోమవారం ఒంటి పొద్దులుంటారు.. మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు అన్నట్లుగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం వెలగబెట్టిన జగన్ ఇటీవలి ఎన్నికలలో పరాజయం పాలై అధికారం కోల్పోయారు.

అయితే ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్లలో కొద్ది పాటి దూరం ప్రయాణానికి కూడా ప్రత్యేక విమానాలు, చాపర్లనే ఉపయోగించారు. రోడ్డు మార్గంలో ప్రయాణం అన్న మాటే లేకుండా విమానయానాలు చేశారు. విదేశాలకు వెళ్లాలన్నా, ఢిల్లీ వెళ్లాలన్నా ఆయన చార్టర్డ్ ఫ్లైట్స్ నే ఉపయోగించారు. మళ్లీ అలాంటిలాంటివి కాకు అత్యంత లగ్జూరియస్ విమానాలనే ఉపయోగించారు. అటువంటి జగన్ అధికారం కోల్పోయిన తరువాత బెంగళూరు నుంచి గన్నవరానికి సాధారణ విమానంలో సతీమణితో కలిసి వచ్చారు.  సొంత సొమ్ము ఖర్చు చేయాల్సి వచ్చే సరికి ఆయనకు పొదుపు గుర్తుకు వచ్చినట్లుందని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.

జగన్ హయాంలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వోద్యోగులకు వేతనాలు చెల్లించడానికీ, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సొమ్ము బదలాయించడానికీ కూడా ప్రభుత్వం అప్పుల మీదే ఆధారపడింది. అప్పు చేయకుండా ప్రభుత్వానికి రోజు గడవని పరిస్థితి ఉంది. అంతటి ఆర్థిక సంక్షోభంలో కూడా జగన్ స్పెషల్ ఫ్లేట్లు ఆడంబరాలకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడానికి ఇసుమంతైనా వెనుకాడలేదు. అంతెందుకు తన సొంత తాడేపల్లి ప్యాలెస్ ను క్యాంప్ ఆఫీసుగా మార్చేసుకుని ప్యాలస్ నిర్వహణ ఖర్చులు కూడా ప్రభుత్వ ఖజానాయే భరించేలా చూసుకున్నారు. 

పోనీ జగన్ ఏమైనా సామాన్యుడా అంటే... దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎంగా గుర్తింపు పొందిన వ్యక్తి. అటువంటి సంపన్న జగన్ సొంత సొమ్ము ఖర్చు చేయాలనే సరికి అహా నా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావులా పిసినారిగా మారిపోయారు. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ జగన్ ను నెటిజనులు ఓ ఆటాడేసుకుంటున్నారు. ముందు ముందు జగన్   సాధారణ విమనాలలో మరిన్ని పర్యటనలు చేస్తారని అంటున్నారు. ముందు ముందు ఆయన ప్రతి శుక్రవారం అక్రమాస్తుల కేసుల విచారణ కోసం కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆయన హైదరాబాద్ లో ఉంటే ఫరవాలేదు కానీ, తాడేపల్లిలోనో, బెంగళూరులోనో ఉంటే మాత్రం కోర్టుకు హాజరయ్యేందుకు ఒక విమానం ఎక్కక తప్పదనీ, సొంత సొమ్ముతో చేయాల్సిన ప్రయాణాలు కనుక సాధారణ కమర్షియల్ ఫ్లైట్స్ నే ఆశ్రయిస్తారని చెబుతున్నారు. మొత్తం మీద సొంత సొమ్ము ఖర్చు చేయాలంటే జగన్ కు చేతులు రావడం లేదు.. అదే జనం సొమ్ముతో దర్జాగా ప్రత్యేక విమానాలలో విహారయాత్రలుగా  అధికార పర్యటనలు సాగించారనీ విమర్శలు గుప్పిస్తున్నారు. 

By
en-us Political News

  
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న ఒక అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తెలంగాణ పోలీసు వ్యవస్థలోకి మరో కొత్త తరం అడుగుపెట్టింది.
ప్రధాని కావాలనుకోవడం తప్పా.. ప్రణబ్ కుమార్తె కౌంటర్.! 
ఉద్యోగం.. మంచి జీతం.. ఉచిత వసతి.. ఇవన్నీ ఆశ చూపించి యువతులను హైదరాబాద్‌కు రప్పించడం
వీసీ జానయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. గవర్నర్‌కు మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు.!
టెక్నాలజీ రంగంలో యువత తమ సృజనాత్మకతతో అద్భుతాలు సృష్టిస్తున్నారు.
యువకులపై హోటల్ సిబ్బంది, యాజమాన్యం అనుచరుల దాడి.!
రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత కాలంలో చర్చనీయాంశంగా మారిన పరిణామాలపై ప్రధాన రాజకీయ పార్టీలు బాధ్యతాయుతమైన వైఖరిని ప్రదర్శిస్తున్నాయి.
రాజకీయాలలో ఆధిపత్యం కోసం కుమ్ములాటలూ, తగాదాలు, విభేదాలు. అటువంటి కారణాలతోనే కేసీఆర్ కుటుంబం నుంచి కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంత రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) ఏర్పాటు చేశారు.  సరిగ్గా అటువంటి తాగాదాలతోనే వైఎస్ రాజశఖరరెడ్డి కుమార్తె, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు స్వయానా చెల్లెలు అయిన వైఎస్ షర్మిల అన్నతో వేరుపడి సొంత బాటలో నడుస్తున్నారు.
ప్రజల ప్రాణాలకు ముప్పు కలగకూడదని హెచ్చరించడమే ఆయన చేసిన నేరమైంది.
భారతీయ ఆర్థిక వ్యవస్థలో నల్లధనం అరికట్టేందుకు, అవినీతిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో పెద్ద నోట్ల రద్దు అంశం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఒక షాకింగ్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.