ధీమా తగ్గింది.. స్వరం మారింది.. బేలతనం బైటపడింది!

Publish Date:Aug 11, 2023

Advertisement

నాలుగేళ్లలో మన ప్రభుత్వ పాలన చూడండి.. మళ్ళీ ఓటేయాలా వద్దా మీరే నిర్ణయించుకోండి. ఈసారి గట్టిగా కొడతాం.. 175కి 175 కొడదాం. అందరూ కలిసినా నా వెంట్రుక కూడా పీకలేరు.. ఇవీ  నిన్న మొన్నటి వరకూ సీఎం జగన్ మోహన్ రెడ్డి నోటి నుండి వచ్చిన మాటలు.. ప్రగల్భాలు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను.. ఎక్కడ వీలయితే అక్కడ వ్యక్తిగతంగా దూషణల పర్వానికి దిగడం,  ముసలోడు, పనైపోయిందని చంద్రబాబును ఎగతాళి చేయడం.. పవన్ పెళ్లిళ్లపై కామెంట్లు చేయడంతో ఈ మధ్య వరకూ సీఎం జగన్ సభలు సాగిపోయేవి. కానీ, ఇప్పుడు జగన్ టోన్ మారింది. మాటలలో  ధీమా పోయి, బేలతనం బయటపడుతోంది.  నిన్న మొన్నటి వరకూ గట్టిగా కొడదాం అన్న ఆ నోటి నుండే ఇప్పుడు వాళ్లంతా కలిసి నన్ను కొడతా అంటున్నారు.. మీరే నన్ను ఆదుకోండని ప్రజలను వేడుకుంటున్నారు. నా పాలన చూసి మరోసారి నాకు ఓట్లేయండని కోరిన జగన్.. ఇప్పుడు టీడీపీకి అధికారం వస్తే తనను చంపేస్తారని  వాపోతున్నారు.

శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్సార్ సున్నా వడ్డీ నిధుల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ కార్యక్రమంతో   సున్నా వడ్డీ కింద  ఎన్ని నిధులు విడుదల చేస్తున్నారో కానీ.. ఈ సభకు మాత్రం కోట్లలోనే ఖర్చు పెట్టారని ఆ ఏర్పాట్లూ, హంగామా చూస్తే అర్ధమౌతుంది. బటన్ నొక్కి జగన్ ఎంత విడుదల చేశారో కానీ.. ఈ కార్యక్రమం పబ్లిసిటీకి మాత్రం భారీగానే ఖర్చు పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదని.. వారి మైండ్ లో ఫ్యూజులు ఎగిరిపోయాయంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన మోసాలు, వెన్నుపోటులే గుర్తొస్తాయి తప్పితే.. ఒక్క పథకం కూడా గుర్తుకు రాదని విమర్శించారు. బాబు కోసం ఆయన దత్తపుత్రుడు పరుగులు పెడుతున్నాడని పవన్ కళ్యాణ్ పైనా విమర్శలు గుప్పించారు.

అయితే, ఆ మాటలు చెప్పిన అదే సభలో జగన్  తన గొంతు మార్చి మాట్లాడారు. ప్రతిపక్షాలకు అధికారం ఇస్తే తనను మట్టుబెడతానంటున్నారని గొంతు తగ్గించి  గద్గద స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ముగ్గురూ (చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్) ఒక్కో చోట సభలు నిర్వహించారని.. అధికారం ఇస్తే ఎవరినీ వదలమంటూ హెచ్చరిస్తున్నారని.. అధికారంలోకి వస్తే తన అంతు చూస్తారని బెదిరించారని దాదాపు ఏడ్చినంత పనిచేశారు. గిట్టని వారిని మట్టు బెడతామంటున్నారని, అందుకే వాళ్ళు అధికారం కోరుకుంటున్నారనీ.. ఏకంగా తనకు నరకాన్ని చూపిస్తామంటున్నారని తనదైన శైలిలో హావభావాలను పలికించారు. ప్రతిపక్షాలు ప్రజలను బెదిరిస్తున్నాయని చెప్తూనే.. తనను చంపుతామని బెదిరిస్తున్నారని ప్రజలకు దీన వదనంతో  చెప్పుకున్నారు. దీంతో సహజంగానే జగన్ అమలాపురం ప్రసంగం మరోసారి విస్తృత చర్చకు దారి తీసింది. 

జగన్ అమలాపురం ప్రసంగాన్ని చూస్తే మరోసారి జగన్నాటకం మొదలైపోయిందా అన్న చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో జోరందుకుంది.  సానుభూతి డ్రామాను పలికించడంలో జగన్ కు జగనే సాటి.  తన తండ్రి వైఎస్ మరణం నుండి వివేకా మరణం వరకూ.. తన అవినీతి కేసుల నుండి కోడికత్తి కేసు వరకూ కాదేదీ సానుభూతికి అనర్హం అన్నట్లుగా అన్నిటినీ తనకు అనుకూలంగా మలచుకోవడంలో జగన్ మార్క్ జగన్ కి ఉంది. ఇప్పుడు ఇది కాస్తా ఆయన ప్రసంగాలలోకి వచ్చి చేరింది.  నిన్న మొన్నటి వరకూ గంభీరాలు పోయిన ఆయన గొంతు  ఒక్కసారిగా డౌన్ అయి  వేడికోళ్లకు, అభ్యర్థనలకు దిగిపోయింది. తనను చంపుతామని బెదిరిస్తున్నారని ప్రజలకు మోర పెట్టుకొనే పరిస్థితికి వచ్చిందంటే ఇది సానుభూతి డ్రామా కోసమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే గతంలో ఆయనకు సానుభూతి వర్కౌట్ కావడానికి  అప్పుడు ప్రతిపక్షంలో ఉండటమే కారణం.  ఇప్పుడు ఆయనదే అధికారం. నాలుగేళ్లుగా అధికారం చెలాయిస్తున్నారు.

పైగా ఈ నాలుగేళ్లలో ఆయన తన విధానాలను వ్యతిరేకించిన ఎందరికి ఎలా నరకం చూపించారో ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. కరోనా సమయంలో వైద్యులకు మాస్కులు ఇవ్వాలన్నందుకు డాక్టర్ ను పిచ్చివాడిగా ముద్ర వేసి నడిరోడ్డుపై పోలీసుల చేత కొట్టించారు. ఆపరేషన్ జరిగి విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు అచ్చెంనాయుడిని ఇంటి నుంచి బలవంతంగా తీసుకువచ్చి వేల మైళ్లు తిప్పారు. తన విధానాలను విమర్శించిన పాపానికి సొంత పార్టీ ఎంపీ అయిన రఘురామకృష్ణం రాజు  ఎన్ని రకాలుగా వేధింపులకు గురయ్యారో అందరికీ తెలిసిందే. అటువంటి జగన్ ఇప్పుడు అధికారం దూరమౌతున్న సంకేతాలు వచ్చాయనేసరికి సానుభూతి డ్రామాకు తెరతీశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మరి సరికొత్త పాత్ర డ్రామా వైసీపీకి ఏమేరకైనా కలిసొస్తుందేమో చూడాలి!

By
en-us Political News

  
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్క‌డి నుంచి ఈ పార్టీ అంచ‌లంచ‌లుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గ‌తంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాస‌న రుచి చూప‌డంతో.. ఇప్పుడు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్ర‌స్తుతం అప్ర‌తిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.