విదేశీ పర్యటనకు జగన్.. 10 రోజులు సీఎం లేకుండా పరిపాలన!

Publish Date:Aug 31, 2023

Advertisement

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. పది రోజుల పాటు సీఎం కుటుంబంతో కలిసి ఫారిన్ టూర్ వెళ్లనున్నారు.  సీఎంగా జగన్ గత ఏడాది విదేశీ పర్యటనకు వెళ్లారు. పెట్టుబడుల సదస్సు కోసం ఆయన అప్పట్లో మంత్రి వర్గంలోని కీలక మంత్రులను, ఉన్నతాధికారులను దావోస్ తీసుకుని వెళ్లారు. మొత్తం పది రోజుల పాటు జగన్ విదేశీ టూర్ అప్పట్లో సాగింది. ఇక సీఎం కాకముందు కుటుంబంతో కలిసి ఇలాగే విదేశీ యాత్రలకు వెళ్లేవారు. గతంలో జగన్ పారిస్, డెట్రాయిట్, దావోస్, డల్లాస్ పర్యటనకు వెళ్లగా ఇప్పుడు యూకే వెళ్లనున్నారు. అక్రమాస్తులకు సంబంధించి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎం జగన్ విదేశీ పర్యటన కోసం మూడు రోజుల క్రితం తెలంగాణలోని సీబీఐ కోర్టులో అనుమతి కోరారు. 

అవినీతి కేసులలో ఆయన ప్రస్తుతం బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. కాగా  దేశం విడిచి వెళ్ళరాదని బెయిల్ షరతులు ఉండడంతో వాటిని సడలించి తాను విదేశాలు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ పిటిషన్‌లో కోరారు. బెయిల్ ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని కోర్టు సీబీఐని కోరగా.. ముందుగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు కొద్దిగా సమయం కావాలని సీబీఐ తెలిపింది. అనంతరం జగన్ విదేశీ పర్యటనలపై సందేహలున్నాయని, సాక్ష్యాలను తారుమారు చేస్తారని, సాక్షులను బెదిరిస్తారనే అనుమానాలు ఉన్నాయని.. అందుకే అనుమతి ఇవ్వవొద్దని సీబీఐ వాదనలు చేసింది. అయితే, సీబీఐ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. జగన్ విదేశీ పర్యటనకు అనుమతి మంజూరు చేసింది. దీంతో సీఎం జగన్ రెడ్డి శనివారం (సెప్టెంబర్ 2)  నుంచి పది రోజుల పాటు యూకేకు వెళ్తారు.

 కాగా.. సీఎం జగన్ తో పాటు అదే అక్రమ ఆస్తుల కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి కూడా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరగా.. ఆయనకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక విజయసాయిరెడ్డి విదేశీ పర్యటన విషయానికి వస్తే ఈయన యూకే, యూఎస్ఏ, జర్మనీ, దుబాయ్, సింగపూర్ లో పర్యటించనున్నారు. విదేశీ యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం ఆరు నెలల్లో ఎప్పుడైనా విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి కోరగా కోర్టు అందుకు అనుమతి ఇవ్వడం విశేషం. అక్రమాస్తుల కేసులలో బెయిల్ షరతుల్లో భాగంగా ఈ ఇద్దరి పాస్ పోర్టులు అప్పుడు కోర్టుకు సరెండర్ చేయగా.. ఇప్పుడు కోర్టు అనుమతితో ఆ రెండు పాస్ పోర్టులు వీరికి అప్పగించనున్నారు. పర్యటన పూర్తి కాగానే మళ్ళీ తిరిగి కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.

 విజయసాయి రెడ్డి విదేశాలకు ఎప్పుడు వెళ్తారో   షెడ్యూల్ ఖరారు కాలేదు కానీ, సీఎం జగన్ మాత్రం శనివారం(సెప్టెంబర్ 2) ప్రయాణం కానున్నారు.  ఆ రోజు తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి ఉండడంతో జగన్ ఇడుపులపాయకు వచ్చి నివాళి అర్పిస్తారు. అక్కడ నుంచే నేరుగా  ఆయన లండన్ టూర్ కి బయల్దేరి వెళ్తారు. విదేశాలలో చదువుకుంటున్న తన ఇద్దరు కుమార్తెలను చూసేందుకే జగన్ ఈ టూర్ పెట్టుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే, మొత్తం పది రోజుల పాటు సీఎం రాష్ట్రంలో లేకుండానే రాష్ట్ర పరిపాలన సాగనుంది. వర్చువల్ విధానం ద్వారా అక్కడ నుండే పరిపాలన సాగిస్తారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో సీఎం విదేశీ యాత్రకు వెళ్ళినపుడు కూడా ఇలాగే పరిపాలన సాగగా.. ఇప్పుడు కూడా అలాగే ప్రభుత్వాన్ని నడిపించనున్నారు.  

By
en-us Political News

  
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.