ష‌ర్మిల‌కు చెక్‌పెట్టే ప‌నిలో జ‌గ‌న్‌.. జగన్ కు షాక్ ఇచ్చేందుకు రంగంలోకి రాహుల్!

Publish Date:Dec 21, 2024

Advertisement

ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బంప‌ర్ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం ఏపీలో అభివృద్ధే ల‌క్ష్యంగా దూసుకెళ్తోంది. కేంద్రం స‌హ‌కారంతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు కృషి చేస్తున్నారు. ఇదే క్ర‌మంలో గ‌డిచిన ఐదేళ్ల కాలంలో అరాచ‌క పాల‌న సాగించిన వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి వ‌రుస‌గా షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. జ‌గ‌న్ వెంట ఉంటే త‌మ‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని భావించిన వైసీపీ కీల‌క నేత‌లు ఒక్కొక్క‌రుగా పార్టీని వీడుతున్నారు. టీడీపీ, జ‌న‌సేన పార్టీల్లోకి క్యూ క‌డుతున్నారు. మ‌రోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ బ‌లోపేతంపై కీల‌క నిర్ణ‌యాలు తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇదే క్ర‌మంలో జ‌గ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే, త‌న చెల్లి ష‌ర్మిల‌ దూకుడుకు చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు ఆరంభించారు‌. ముఖ్యంగా ఆమెను ఏపీపీసీసీ చీఫ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించేందుకు ఢిల్లీలో  ఆయ‌నకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ పెద్ద‌ల‌తో మంత‌నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇదే స‌మ‌యంలో ఏపీ కాంగ్రెస్ లో ఒక‌రిద్ద‌రు సీనియ‌ర్ నేత‌ల‌కు వైసీపీ కండువా క‌ప్పి ష‌ర్మిల‌కు చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రావ‌డానికి వైస్ ష‌ర్మిల కీల‌క భూమిక పోషించారు. అయితే, సీఎంగా జ‌గ‌న్‌ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ష‌ర్మిల‌ను ప‌క్క‌న పెట్టేశారు. ఆస్తుల విష‌యంలోనూ వారిమ‌ధ్య వివాదాలు త‌లెత్తాయి. ఈ క్ర‌మంలో ష‌ర్మిల తెలంగాణ‌లో సొంత రాజ‌కీయ పార్టీ పెట్టుకున్నారు. కొద్దికాలానికే ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన ష‌ర్మిల‌..  ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ఏపీ రాజ‌కీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ రోజు నుంచి జ‌గ‌న్ రెడ్డి టార్గెట్ గా ఆమె విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ భారీ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణాల్లో వైఎస్ ష‌ర్మిల‌కూడా ఒక‌రు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ, ఎన్నిక‌ల త‌రువాతా కూడా జ‌గ‌న్ రెడ్డి టార్గెట్ గా ష‌ర్మిల దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇన్నాళ్లు ష‌ర్మిల విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోని జ‌గ‌న్‌.. ఇప్పుడు ఆమె పేరు చెబితేనే భ‌య‌ప‌డుతున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి‌. దీంతో ష‌ర్మిల దూకుడుకు చెక్ పెట్టేలా   పావుల‌ను క‌దిపేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మైన‌ట్లు కనిపిస్తోంది. 

ఏపీ కాంగ్రెస్ లో ష‌ర్మిల నాయ‌క‌త్వంపై అసంతృప్తితో ఉన్న సీనియ‌ర్ నేత‌ల‌ను జ‌గ‌న్ వైసీపీలోకి ఆహ్వానించారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది‌. షర్మిల నాయకత్వంపై కొంత‌కాలంగా సీనియర్లు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. ఆమె తీరు, వ్యవహారశైలిపై పార్టీ అధినాయకత్వానికి   ఫిర్యాదులు రూడా చేశారు. షర్మిల పార్టీ బలోపేతం కంటే తన వ్యక్తిగత అంశాల కోసం పార్టీని వాడుకుంటున్నార‌ని, ఎన్డీఏ కూటమి కంటే జగన్ పైన విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర పార్టీ పెద్దల‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఇదే సరైన సమయంగా భావిస్తున్న జగన్ కేంద్ర పార్టీలో తనకు అనుకూలంగా ఉన్న‌వారి ద్వారా ష‌ర్మిలను పీసీసీ చీఫ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

దివంగ‌త‌ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న ముఖ్య‌ అనుచ‌రులుగా కొన‌సాగిన నేత‌లు కొంద‌రు ఏపీ కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతున్నారు. వారంద‌రితో ఇటీవ‌ల‌ జ‌గ‌న్ ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల‌ కర్నూలులో వైసీపీ ప్రధాన కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు జ‌గ‌న్‌, వైసీపీ నేతలతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. వారిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ   చీఫ్ శైలజానాథ్ ఉన్నారు. శైలజానాధ్, జ‌గ‌న్ ఒక‌రికొక‌రు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కొద్ది సేపు విడిగా ముచ్చటించుకున్నారు. ఈ క్ర‌మంలో తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై  వారిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌జరిగిందని తెలుస్తోంది. అయితే, అంత‌కుముందే వైసీపీలో చేరే విష‌యంపై జ‌గ‌న్‌, శైలజానాథ్ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయ‌న్న ప్ర‌చారం ఉంది. వ‌చ్చే రెండు నెల‌ల్లో శైల‌జానాధ్ తోపాటు మ‌రో ఎనిమిది మంది కాంగ్రెస్ సీనియర్లు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

 మ‌రోవైపు  ఇప్ప‌టికే ఏపీ కాంగ్రెస్ బ‌లోపేతంపై దృష్టిపెట్టిన రాహుల్ గాంధీ.. తాజా ప‌రిణామాల‌పై సమాచారాన్ని ఎప్పటికప్పుడు ముఖ్య‌నేత‌ల ద్వారా తెలుసుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి‌. ఏపీలోని ఓ సీనియ‌ర్‌ నేత‌, తెలంగాణ‌కు చెందిన ఓ కీల‌క నేత ఏపీ కాంగ్రెస్ లో చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు, పార్టీ బ‌లోపేతానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు రాహుల్‌కు నివేదిస్తున్నారని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. 

అధికారం కోల్పోయిన త‌రువాత వైసీపీని వీడుతున్న నేత‌ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జ‌గ‌న్‌కు ముఖ్య అనుచ‌రులుగా పేరున్న నేత‌లు సైతం వైసీపీని వీడి కూట‌మి పార్టీల్లో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీలోని ముఖ్య‌నేత‌ల‌ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేలా రాహుల్ టీం రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే వారు ప‌లువురు వైసీపీ నేత‌లతో మంత‌నాలు జరిపినట్లు స‌మాచారం. ష‌ర్మిల నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేస్తామ‌ని కొంద‌రు వైసీపీ నేత‌లు రాహుల్ టీంకు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. వారంతా వ‌చ్చే రెండు నెల‌ల్లో కాంగ్రెస్ గూటికి చేర‌బోతున్నార‌ని, వ‌చ్చే ఏడాది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయ‌ని ఆ పార్టీలోని కొంద‌రు నేత‌లు పేర్కొంటున్నారు. మొత్తానికి ష‌ర్మిల‌కు చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ రంగంలోకి దిగ‌గా.. వైఎస్ జ‌గ‌న్ రెడ్డికి గ‌ట్టి షాకిచ్చేందుకు రాహుల్ టీం రంగంలోకి దిగింది. ఈ క్ర‌మంలో ఎవ‌రిది పైచేయి అవుతుందో  చూడాలంటే మ‌రికొద్దిరోజులు ఆగాల్సిందే.

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.