ఎన్ఐఏ కోర్టుకు జగన్?.. ఎందుకంటే

Publish Date:Jan 13, 2023

Advertisement

జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టుకు జగన్ హాజరు కావాల్సిందే. అయితే ఆయన ఇంత వరకూ కోర్టు మెట్లు నిందితుడిగా ఎక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్ఐఏ కోర్టుకు ఆయన బాధితుడిగా హాజరు అవ్వాల్సి వస్తోంది. ఔను బాధితుడిగానే. టెక్నికల్ ఈ బాధితుడిగా హాజరు కావాల్సి వచ్చినా వాస్తవానికి ఈ కేసు కారణంగా ఆయన గత ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఔను కోడి కత్తి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ టేకప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ సందర్భంగా ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ కేసులో బాధితుడి స్టేట్ మెంట్ ఎందుకు రికార్డు చేయలేదని ప్రశ్నించింది. బాధితుడిని విచారించకుండా, స్టేట్ మెంట్ రికార్డు చేయకుండా సాక్షులను మాత్రం విచారించి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది. ఈ కేసులో జగన్  స్టేట్ మెంట్ రికార్డు చేసినట్లుగా ఎన్ఐఏ తరఫున్యాయవాది కోర్టుకు తెలియజేశారు. అయితే చార్జిషీట్ లో  ఆ స్టేట్ మెంట్ ఏదని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో 56 మందిని విచారిస్తే.. మొదటి 12 మంది స్టేట్ మెంట్లూ చార్జిషీట్ లో లేకపోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఈ కేసులో కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ కు బెయిలు నిరాకరించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ నెల 31 నుంచి కేసు విచారణ చేపడతామని పేర్కొంది. ఈ కేసు విచారణకు బాధితుడితో సహా అందరూ హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. దీంతో కోడి కత్తి కేసులో బాధితుడిగా ఉన్న జగన్ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. గత ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో జగన్ పై కోడి కత్తితో దాడి జరిగిన సంగతి విదితమే. ఆ దాడి కారణంగా అప్పటి ఎన్నికలలో జగన్ పార్టీకి సానుభూతి లభించి లబ్ధి చేకూరిన సంగతి విదితమే. 

నిందితుడిగా సీబీఐ కోర్టుకు హాజరైన సీఎం జగన్ త్వరలో బాధితుడిగా ఎన్ఐఏ కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జగన్‌పై విశాఖలో జరిగిన కోడికత్తి దాడి ఘటనలో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ విచారణలో బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. నెలాఖరు నుంచి ఈ కేసులో విచారణ ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎన్ఐఏ దాఖలు చేసిన చార్జిషీటును పరిశీలించారు.

ఈ కేసులో ఇంత వరకూ బాధితుడైన జగన్మోహన్ రెడ్డి దగ్గర స్టేట్ మెంట్ తీసుకోలేదని ఎన్ఐఏపై .. శ్రీనివాస్ తరపు లాయర్ ఫిర్యాదు చేశారు. అయితే తాము జగన్ స్టేట్ మెంట్ నమోదు చేశామని ఎన్ఐఏ లాయర్ కోర్టుకు తెలిపారు.. అయితే ఆ స్టేట్ మెంట్.. చార్జిషీటులో ఎందుకు లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. బాధితుడి స్టేట్ మెంట్ నమోదు చేయకుండా ఇతర సాక్షులను విచారిస్తే ఏం ప్రయోజనమని న్యాయమూర్తి ప్రశ్నించారు. నెలాఖరు నుంచి రెగ్యులర్ విచారణను ప్రారంభిస్తున్నందున బాధితుడు కూడా కోర్టుకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. దీంతో బాధితుడైన సీఎం జగన్ కూడా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.