అనుకున్నదే అయ్యింది.. జగన్ తిరుమల టూర్ ఆగింది!

Publish Date:Sep 27, 2024

Advertisement

అనుకున్నట్లే జరిగింది. డిక్లరేషన్ వ్యవహారం మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన రద్దు కావడానికి కారణమైంది. జగన్ టీటీడీ కోరినట్లు డిక్లరేషన్ ఇచ్చి తిరుమల వేంకటేశ్వరుని దర్శనం చేసుకుంటారని.. ఆయన గురించి తెలిసిన వారెవరూ అనుకోలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న ఐదేళ్లూ తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే లక్ష్యంగా జగన్ అడుగులు పడ్డాయి. భూమన కరుణాకరరెడ్డి వంటి నాస్తికుడికి టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. ఇందుకు కారణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ మోహన్ రెడ్డి హిందూ ధర్మానికి వ్యతిరేకి అని చెప్పలేం కానీ ఆయన కచ్చితంగా హిందువు అయితే కాదు. ఇది జగమెరిగిన సత్యం.

కానీ జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలం తిరుమలలో జరిగిన పరిణామాలను గమనిస్తే ఆయన హిందూ ధర్మానికి బద్ధ విరోధి అని చెప్పడానికి సందేహం అవసరం లేదు. ఈ మేరకు గత ఐదేళ్లలో హిందూ సమాజం మొత్తం తిరుమలలో జగన్ చేస్తున్న అరాచకాలపై గగ్గోలు పెట్టింది. తీరు మార్చుకోవాలని సూచించింది.  జగన్మోహన రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎన్నెన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో, ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంత మయ్యాయో. చివరకు ఏడుకొండల వెంకన్నదేవుని సన్నిధిలో  అన్యమత ప్రచారం మొదలు, ఎన్నెన్ని అకృత్యాలు జరిగాయో చెప్పనలవి కాదు.  జగన్ హయాంలో  తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ రక్షణ కోసం కాదు.. అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఆగమ శాస్త్రాన్ని, ఆచార వ్యవహారాలను తుంగలో తొక్కి తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్టారాజ్యంగీ తీసుకున్న నిర్ణయాలు భక్తుల మనోభావాలను దారుణగా దెబ్బతీశాయి. వారిని తీవ్ర ఆవేదనకు గురి చేశాయి.   టీటీడీ నియామకాలలో అన్యమతస్తులకు రిజర్వేషన్ కల్పిస్తూ టీటీడీ తీసుకుంటున్న  నిర్ణయాలు సహా జరిగిన అపచారాలకు లెక్కేలేదు.  

  తిరుమలను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం  అధికారంలో ఉన్నంత కాలం ఒక వ్యాపార కేంద్రంగా మార్చి వేశారు. ఆయన అడుగులకు మడుగులొత్తుతూ, ఆయన చెప్పిన దాని కల్లా తలూపుతూ టీటీడీ ఒక ధార్మిక సంస్థ అన్న విషయాన్నే మరిచి పోయింది.  ప్రసాదం ధర మొదలు వసతి గదుల అద్దెల వరకూ దోపిడీయే. తిరుమల వెంకన్నకు భక్తులు నిలువుదోపిడీ ఇస్తారు. అయితే జగన్ హయాంలో భక్తులకు ఆ అవకాశం లేకుండా కొండపైకి వచ్చిన భక్తులను టీటీడీయే నిలువు దోపిడీ చేసేసిందంటే అతిశయోక్తి కాదు.   స్వామి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో గంటలు తరబడి నిరీక్షించే భక్తుల ఆకలి  దప్పికలు తీర్చేందుకు  గతంలో సమయానుకూలంగా  జరిగే ప్రసాద వితరణ ఆగిపోయింది. కనీసం జలప్రసాదం కూడా భక్తులకు అందుబాటులో లేకుండా పోయింది.   

ఇదంతా ఒకెత్తు అయితే, గోవింద నామ స్మరణ తప్ప మరో పేరు వినిపించడమే అపచారంగా భావించే తిరుమల కొండపైన ఏకంగా రాజకీయ జెండాలు, స్టిక్కర్లు దర్శనం ఇచ్చాయి.  ఇలా  తిరుమల కొండపై జగన్  హయాంలో దేవునికి జరగని అపచారం లేదు.  ఉద్దేశ పూర్వకంగా తిరుమల దేవునికి జగన్ హయాంలో అపచారం జరిగింది. ఇప్పుడు అదే కొండపైకి ఎమ్మెల్యే హోదాలో జగన్ వెళ్లడానికి డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిన పరిస్థితి ఇప్పడు జగన్ కు ఎదురైంది.  అయితే ఓట్ల కోసం తప్ప హిందూ దేవాలయాలక వెళ్లే ప్రసక్తే లేదని చెప్పే జగన్ ఎప్పుడో ఐదేళ్ల తరువాత జరిగే ఎన్నికలలో లబ్ధి కోసం ఇప్పుడు తిరుమల వెంకన్నపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇస్తారని పరిశీలకులు అంటున్నారు. అందుకే తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.