డిక్లరేషన్ ఇస్తేనే జగన్ కు దర్శనానికి అనుమతి.. టీటీడీ నిర్ణయం

Publish Date:Sep 27, 2024

Advertisement

జగన్ తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం అనుమానమే. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆయనను దర్శనానికి అనుమతించే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ అన్యమతస్థుడు కనుక ఆయన తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే తప్పని సరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని అంటున్నది. ఈ నేపథ్యంలోనే శనివారం (సెప్టెంబర్ 28) ఆయన దర్శనానికి ముందుగానే తిరుమలలో ఆయన బస చేసిన  గెస్ట్ హౌస్ కు వెళ్లి ఆయనకు డిక్లరేషన్ పత్రం ఇచ్చి సంతకం తీసుకోవాలని నిర్ణయించింది. ఆయన డిక్లరేషన్ పై సంతకం పెడితే ఓకే.. ఒక వేళ సంతకం పెట్టడానికి నిరాకరిస్తే మాత్రం దర్శనానికి అనుమతించరాదని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది.  

అయితే ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం ఏదీ ఇంకా రాలేదు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకుంది. జగన్ తిరుమల పర్యటన వేళ ఉద్రిక్తతలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇది ఒకటే మార్గంగా తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తోంది. గతంలో జగన్ తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ ఇవ్వలేదనీ, అయితే అప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో వచ్చినందున నిబంధనల మేరకు డిక్లరేషన్ పై పట్టుబట్టలేదనీ టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. 

కాగా జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటికే జగన్ పర్యటన సందర్భంగా ఎటువంటి ఆందోళనలకూ పాల్పడవద్దంటూ జనసేని శ్రేణులకు పిలుపునిచ్చారు. జగన్ డిక్లరేషన్ వ్యవహారం తిరుమల తిరుపతి దేవస్థానం చూసుకుంటుందనీ, డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ కు అనుమతి ఇవ్వాలా, అనుమతి నిరాకరించాలా అన్నది టీటీడీకి సంబంధించిన అంశమనీ పవన్ కల్యాణ్ పేర్కొన్న నేపథ్యంలో ఆందోళనలు, నిరసనలకు దూరంగా ఉండాలని ఇప్పటికే జనసేన శ్రేణులు ఫిక్స్ అయిపోయారు. అయితే బీజేపీ, హిందూ సంస్థలూ మాత్రం జగన్ తిరుమల పర్యటన, డిక్లరేషన్ అంశంపై  గట్టిగా నిలబడుతున్నారు.

డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ తిరుమల దేవుడిని దర్శించుకోవడానికి ఎంత మాత్రం అంగీకరించమనీ, అవసరమనుకుంటే అలిపిరి వద్దనే ఆయనను అడ్డుకుంటామనీ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా  పోలీసు యాక్ట్ 30ని పోలీసులు అమలులోకి తీసుకు వచ్చారు. ఇలా ఉండగా మందీ మార్బలంతో జగన్ జగన్ తిరుమల పర్యటనకు బయలుదేరనుండటం పై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. వేల మందితో ఆయన తిరుమల రావడం దేవుడి దర్శనానికా, దండయాత్రకా అంటే తెలుగుదేశం శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.  

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.