తమ్మినేని సీతారాం కు జగన్ సపోర్ట్.. వైసీపీ అధినేత మౌనం సంకేతం అదేగా?!

Publish Date:Jul 21, 2026

Advertisement

వైసీపీ సీనియర్ నాయకుడు, జగన్ హయాంలో అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన  తమ్మినేని సీతారాం ఇప్పుడు కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తమ్మినేని కుటుంబం   భూకబ్జా, ఫోర్జరీకి పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకు సంబంధించిన కేసులోనే అరెస్టును తప్పించుకోవడానికి ఆయన రాత్రికి రాత్రే.. సొంత కార్లు, ఫోన్లూ కూడా వదిలేసి పరారైపోయారు.

ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బతికున్న వ్యక్తి చనిపోయినట్లుగా బోగస్ డెత్ సర్టిఫికేట్ సృష్టించి భూమిని కబ్జా చేశారన్న అభియోగాలపై ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మంది అరెస్టయ్యారు. ఆ కేసులో తమ్మినేని కుటుబ సభ్యులు అరెస్టు భయంతో అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఈ విషయంపై జగన్ ఇప్పటి వరకూ స్పందించకపోవడంతో పొలిటికల్ సర్కిల్స్ లో జగన్.. తమ్మినేనికి వెనకేసుకు వస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అసలు రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఈ కేసు పూర్వాపరాల్లోకి వెడితే..  శ్రీకాకుళం జిల్లాలో  4 కోట్ల రూపాయల విలువైన  స్థలాన్ని హస్తగతం చేసుకునేందుకు తమ్మినేని సీతారాం నకిలీ పత్రాలు, తప్పుడు వారసత్వ ఆధారాలు సృష్టించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఈ కేసులో పోలీసులు అరెస్టుల పర్వానికి తెరతీశారు. కొందరిని అరెస్టు చేశారు కూడా.. ఈ నేపథ్యంలోనే తమ్మినేని కుటుంబంతో సహా పరారయ్యారు. ఈ కేసులో   ప్రధాన నిందితులుగా   తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులే ఉన్నారు.

అటువంటి తమ్మినేనికి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ అండగా నిలిచి వెనకేసుకు వస్తున్నారన్న చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది.    చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ  అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ఇప్పుడు తమ్మినేని విషయంలో కూడా జగన్ మౌనం ఆయనకు సమర్ధనే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తమ్మినేని కుటుంబం బరితెగింపుగా కబ్జాకు పాల్పడిందన్న విషయంలో   భూ యజమాని కుటుంబ సభ్యులు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో  వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు,  అక్రమ రిజిస్ట్రేషన్ కుట్ర వెనుక ఉన్న భారీ నెట్‌వర్క్‌ను ఛేదించారు. మొత్తం 13 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, ఇందులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను A6 గా, ఆయన కుమారుడు చిరంజీవి నాగ్‌ను A5 గా, భార్య తమ్మినేని వాణిని A7 గా చేర్చారు. అంతేకాకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఈ ఫోర్జరీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసిన స్థానిక సబ్ రిజిస్ట్రార్ బొడ్డేపల్లి అరుణను A13 గా చేర్చారు. ఈ క్రమంలోనే కుట్రలో భాగస్వాములైన 8 మంది నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

బాధితులకు న్యాయం జరగాల్సిన ఘటనలో, నిందితులుగా ఉన్న తమ పార్టీ సీనియర్ నేతకు   జగన్  మద్దతుగా నిలవడం విమర్శలకు తావిస్తున్నది.  గతంలోనూ పార్టీ నేతలపై కేసులు నమోదైన సందర్భాల్లో జగన్ తీసుకున్న వైఖరి తరహాలోనే, ఈ కేసులోనూ తమ్మినేని సీతారాంకు పూర్తి అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈ విషయంపై జగన్ ఇంత వరకూ స్పందించలేదు. పార్టీ పరంగా తమ్మినేని సీతారాంపై చర్యా తీసుకోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    

Srikakulam land grabbing case, fake death certificate forgery, YSR Congress Party

By
en-us Political News

  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.