పరకామణి దొంగను వెనకేసుకొస్తున్న జగన్

Publish Date:Dec 5, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరకామణి చోరీ కేసు నిందితుడిని వెనకేసుకు వస్తున్నారు. పరకామణిలో జరిగిన చోరీ చాలా చాలా చిన్నదని అంటూ.. ఆ విషయంలో ఇంత రాద్ధాంతం ఎందుకని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే నేరం, దొంగతనం చిన్నాదా పెద్దదా అన్నది పక్కన పెడితే.. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. మన చట్టం అదే చెబుతోంది. అందులోనూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం.

తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా. కానీ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం అదేమంత పెద్ద నేరం కాదని తీసి పడేస్తున్నారు. పరకామణి లో రవికుమార్ అనే వ్యక్తి  ఏదో చిన్న దొంగతనం చేశాడు.. కానీ అందుకు ప్రాయశ్చితంగా  టీటీడీకి 144 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడంటూ వెనకేసుకు వచ్చారు. అటు వంటి వ్యక్తి విషయంలో ఇంత యాగీ చేస్తారేంటంటూ ఆశ్చర్యపోయారు. పరకామణి చోరీ నిందితుడిని వెనకేసుకురావడమే కాదు.. అతడిని మహాదాతగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు.  నిజమే జగన్ హయాంలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయి. ఆయన స్వయంగా ఆక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. అటువంటి వ్యక్తికి పరకామణి చోరీ చిన్న విషయం కనిపించడంలో ఆశ్చర్యం లేదు.. కానీ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల శ్రీవారి విషయంలో జగన్ తీరును ఎవరూ సమర్ధించరు. సమర్ధించలేరు. ఎవరి తప్పులకు వారు శిక్ష అనుభవించి తీరాలి. అయినా జగన్ మోహన్ రెడ్డి పరకామణి  చోరీ నిందితుడు రవికుమార్ ను వెనకేసుకురావడం చూస్తుంటే..ఈ చోరీ కేసులోనూ ఆయన ప్రమేయం ఉందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులోనూ తాను బుక్కయ్యే ప్రమాదం ఉందన్న భయం ఆయనలో ప్రస్ఫుటంగా కనిపిస్తోం దంటున్నారు.  

అందుకే పరకామణి చోరీ కేసును ఇప్పుడు తిరగతోడి విచారించడం సరికాదన్నట్లుగా మాట్లాడు తున్నారంటున్నారు.  ఇక్కడ జగన్ పరకామణిలో చోరీ జరగలేదని చెప్పడం లేదు.. కానీ చోరీ చేసిన సొత్తుకంటే ఎన్నో రెట్ల ఆస్తులను టీటీడీకి ఇచ్చి ప్రాయశ్చిత్తం చేసుకున్న వ్యక్తిని ఎందుకు విచారణ పేరుతో విధిస్తారని ఆశ్చర్యపోతున్నారు జగన్. రవికుమార్ చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా రూ.144 కోట్ల ఆస్తులను టీటీడీకి ఇవ్వడం వల్లనే తన హయాంలో ఆ కేసును రాజీ చేశారని చెబుతున్న జగన్ అసలు ఓ చిరుద్యోగికి అంత ఆస్తి ఎక్కడిదన్న విషయం మాత్రం చెప్పలేదు. వాస్తవానికి ప జగన్ హయాంలో తిరుమల పరకామణిలో అవకతవకలకు హద్దు లేకుండా పోయిందనీ, రవికుమార్ ఇటువంటి చోరీలతోనే కోట్ల రూపాయలు సంపాదించాడ, ఆ సంపాదన నుంచి వందల కోట్ల రూపాయలను వైసీపీ నేతలకు రాసిచ్చాడనీ పరిశీలకులు ఆరోపణలు చేస్తున్నారు.  ఏది ఏమైనా చిన్న చోరీ చేసి ప్రాయశ్నితంగా 144 కోట్లు టీటీడీకి రాసిచ్చేశానని రవికుమార్ చెప్తున్న మాటలు, ఆయనను సమర్ధించుకు వస్తూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలూ ఇసుమంతైనా నమ్మశక్యంగా లేవు.   అయినా నేరం జరిగిందని నిందితుడే అంగీకరించాడు.

ఇప్పుడు జగన్  కూడా ఔను రవికుమార్ చోరీ చేశాడని చెబుతున్నారు. అలాంటప్పుడు విచారణ జరపడంలో తప్పేముంది? అన్నిటికీ మించి పరకామణి చోరీపై ఫిర్యాదు చేసిన సతీష్ హత్యకు గురి కావడంతో పరకామణి చోరీ వ్యవహారంలో రవికుమార్ వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అవి నివృత్తి కావాలంటే ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందే.  అయినా ఇప్పుడు పరకామణి చోరుడు రవికుమార్ ను వెనకేసుకు వస్తూ జగన్ మాట్లాడిన మాటలు వింటుంటే గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు అన్న సామెత గుర్తుకు వస్తోందంటున్నారు పరిశీలకులు. 

అదలా ఉంటే కోర్టు కూడా పరకామణి చోరీ వ్యవహారాన్ని లోక్ అదాలత్ లో రాజీ కుదుర్చుకోవడాన్ని సీరియస్ గా తీసుకుంది. ఇదేమీ చిన్న విషయం కాదని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది.   ఈ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితుడు రవికుమార్ దాఖలు చేసిన  పిటిషన్ ను గురువారం (డిసెంబర్ 4) విచారించిన ధర్మాసనం  సతీష్‌కు సంబంధించిన కేసు లోక్ అదాలత్‌లో రాజీకి అవకాశం లేదని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును   సమర్థించింది.  

ఆలయాల ప్రయోజనాల పరిరక్షణలో  కోర్టులే మొదటి సంరక్షకులుగా వ్యవహరిస్తాయని  స్పష్టం చేసింది. పరకామణి చోరీ వంటి తీవ్రమైన కేసులో రాజీ కుదుర్చుకోవడాన్ని తేలికగా తీసుకోలేమని స్పష్టం చేసింది. తరువాత రవికుమార్ దాఖలు చేసిన అప్పీల్‌పై తదుపరి విచారణను ఈనెల 11కి వాయిదా వేసింది.

By
en-us Political News

  
వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.