Publish Date:Feb 22, 2025
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని ఎంత హడావుడి చేస్తున్నారో అందరికీ తెలుసు. ఆఖరికి స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోర్టు మెట్లు కూడా ఎక్కారాయన. తనకు హోదా వచ్చే వరకు అసెంబ్లీ మెట్లెక్కనని భీష్మించుకు కూర్చొన్నారు. అంతా తన ఇష్ట ప్రకారమే జరగాలని భావించే మాజీ సీఎంకు శాసనసభ నిభందనలు తెలిస్తే కాని తత్వం బోధ పడలేదు. ఏ శాసనసభ్యుడైనా స్పీకర్‌కు సరైన రీజన్ చూపించకుండా ఆరు నెలల పాటు అసెంబ్లీకి గైర్హాజరైతే అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్‌కి ఉంటుంది.
అయితే స్పీకర్లు తమకు ఉన్న ఆ విచక్షనాధికారాల్ని పెద్దగా ఉపయోగించిన సందర్భాలు కనిపించవు. అయితే ఏపీలో స్పీకర్‌గా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజులను జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో వేధింపులకు గరి చేశారు. వారు ఎక్కడ తమ విచక్షణాధికారాలకు పని చెప్తారో అన్న భయంతో జగన్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం అసెంబ్లీకి రావడానికి రెడీ అయ్యారు.
కేసీఆర్ కూడా తెలంగాణలో అనర్హత వేటు భయంతోనే బడ్జెట్ సమావేశాల రోజు అసెంబ్లీలో అటెండెన్స్ వేయించుకుని వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జగన్ కూడా అదే భయంతో బెట్టు మాని.. మెట్టు దిగుతున్నారు. జగన్ అసెంబ్లీకి వస్తున్నారు సోమవారం శాసనమండలిలోని వైసీపీ కార్యాలయంలో మీటింగ్ ఉంది.. సభ్యులంతా హాజరవ్వాలని బొత్స సత్యనారాయణ రాసిన లేఖతో జగన్ అసెంబ్లీ షెడ్యూల్ ఖరారైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-step-back-and-attend-assembly-25-193293.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.