కూట‌మి ఐక్యతను బ‌ద్ధ‌లు కోసం జ‌గ‌న్ స్కెచ్ అదేనా?

Publish Date:Jan 28, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ తో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఐక్యంగా ముందుకు సాగుతున్నది. క్షేత్ర స్థాయిలో ఏమైనా పొరపొచ్చాలు ఉన్నా వాటిని వెంటనే సరి చేసుకుని సమష్టిగా పని చేస్తున్నది. ఇదే విషయాన్ని ఇటీవల మంత్రి నారా లోకేష్ విస్పష్టంగా చెప్పారు. కూటమికి విడాకుల్లేవని పేర్కొన్నారు. ఇక జనసేనాని అయితే లోకేష్ కంటే ముందే దశాబ్దంన్నర పాటు కలిసే ఉంటాం. ఉంటున్నాం అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  వీట‌న్నిటినీ బేరీజు వేసిన తరువాతే.. వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి.. ఎన్ని పాద‌యాత్ర‌లు చేసినా నీ ప‌ప్పులు ఉడ‌క‌వ్ జ‌గ‌న్! అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక‌ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి సైతం  కూట‌మి ఐక్యంగా ఉన్నంత వ‌ర‌కూ జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డం క‌ల్ల‌ అన్నారు.

ఇలాంటి సిట్యువేష‌న్ ని  కూడా ఢీ కొట్టి, డీకోడ్ చేయ‌డం అన్న‌ది  జ‌గ‌న్ కత్తిమీద సామే అంటున్నారు పరిశీలకులు.  గ‌తంలో అంటే 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్  కూటమి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి వేసిన స్కెచ్ పని చేసింది. అప్పట్లో ఆయన  ప్ర‌త్యేక హోదా అనే  అస్త్రం ప్ర‌యోగించారు. దీంతో ఎన్డీఏలోంచి టీడీపీ  బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చేసింది కూడా. కూటమి ఐక్యత దెబ్బతినడం వల్లనే 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు అందుకోగలిగారు. 2024 ఎన్నికలలో కూటమి ఐక్యత కూడా జగన్ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచిందనడంలో సందేహం లేదు. 

ఇప్పుడు జగన్ కూటమి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి జనసేన టార్గెట్ గా స్కెచ్ వేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.  జనసేనను తెలుగుదేశం నుంచి దూరం చేయడం అన్న లక్ష్యం పెట్టుకున్న జగన్ అందుకు అనుగుణంగా స్కెచ్ వేశారని అంటున్నారు.  

ఒక స్థానిక జ‌ర్న‌లిస్టు రైల్వేకోడూరు ఎమ్మెల్యే వ‌ర్సెస్ మ‌హిళ వ్య‌వ‌హారంలో చిన్న వార్త రాస్తే అత‌డ్ని బండ బూతులు తిడుతూ.. ప్ర‌శ్నించిన ఆ మ‌హిళ నోటి నుంచి ప‌దే ప‌దే వ‌చ్చిన మాట శివారెడ్డి. అంటే ఇక్క‌డ వైసీపీ నేత‌ల పాత్ర ఉంద‌న్న మాట‌. ఆపై టీడీపీ ఇన్ చా ర్జ్ ముక్కా రూపానంద‌రెడ్డిని కూడా బ‌య‌ట‌కు లాగుతూ వీడియోలు విడుద‌ల చేసిందా మ‌హిళ‌. అంటే ఇక్క‌డే అస‌లు మేట‌ర్ అర్ధం అయిపోవ‌డం లేదా? అంటున్నారు రాజకీయ పరిశీలకులు. 

ఇక ఎమ్మెల్యే త‌ల్లి చెప్పే మాట‌ల‌ను అనుస‌రించి చెబితే.. అర‌వ శ్రీధ‌ర్ ఎమ్మెల్యే అయిన నెల రోజుల నుంచే  ఆ మహిళ ఆయన వెంట‌ప‌డింద‌ట  ఒకే కులం కాబ‌ట్టి పెళ్లి చేసుకోమ‌ని వెంట ప‌డేద‌ట‌. అంటే తొలి నాటి  నుంచీ అరవ శ్రీధర్ వారి వ్యూహంలో చిక్కాడ‌ని భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ మ‌హిళ త‌ర్వాతి  కాలంలో అంచెలంచెలుగా శ్రీధ‌ర్ కి బాగా ద‌గ్గ‌ర‌వుతూ వ‌చ్చి.. ఇప్పుడు ముప్పై కోట్లు ఇవ్వకుంటే.. బండారం మొత్తం బ‌య‌ట పెడ‌తా అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నదని, వరుసగా ఒక్కో వీడియో విడుద‌ల చేస్తూ   ప్రెస్ మీట్లు పెడుతూ బెదరింపులకు దిగుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇక్కడే వైసీపీ రంగ ప్రవేశం చేసి.. ఆడ‌పిల్ల‌ల‌కు ఎవ‌రైనా ద్రోహం చేస్తే త‌ల తీసేస్తా అన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్క‌డ‌? అంటూ త‌న సోష‌ల్ మీడియా ఇన్ ఫ్లూయెన్ష‌ర్ల ద్వారా  నానా యాగీ చేస్తున్నది. ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీ పాత్ర సుస్ప‌ష్టంగా తెలుస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటువంటి ప్రచారం ద్వారా జనసేన పట్ల ప్రజలలో  వ్యతిరేకత వచ్చేలా చేసి.. టీడీపీని జనసేనకు దూరం చేయాలన్నదే జగన్ స్కెచ్ అంటున్నారు.  త‌ద్వారా 2029 ఎన్నిక‌ల నాటికి కూట‌మి ఐక్యత విచ్ఛిన్నమయ్యేలా చేయాలన్నదే వైసీపీ టార్గెట్ అంటున్నారు.  అందుకే  జనసేనాని ఇప్పటికే తమ పార్టీ కార్యకర్తలు, నేతలకు బీవేర్ ఆఫ్ వైసీపీ అంటూ ఓ హెచ్చరిక జారీ చేశారు.    అయితే అర‌వ శ్రీధ‌ర్ లాంటి కొంద‌రు బ‌ల‌హీనులు ఇలాంటి హ‌నీ ట్రాప్ లో చిక్కి.. ఇదిగో ఇలా పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారన్న పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.  

By
en-us Political News

  
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.