వైసీపీ నుంచి పోయిన వాళ్లు పోగా.. ఉన్నవాళ్లని జగన్ తరిమేస్తున్నారా?

Publish Date:Feb 12, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఆ పార్టీలోని సీనియర్లను తీవ్ర అయోమయానికి గురి చేస్తున్నాయి. అసలే  గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేదు. దీంతో వైసీపీ నేతలు, క్యాడర్ లో నైతిక స్థైర్యం బాగా దెబ్బతింది. అధికారంలో ఉన్నంత కాలం నోటికొచ్చిన బూతులతో ప్రత్యర్థులపై రెచ్చిపోయిన వారంతా ఇప్పుడు నోరు తెరవాలంటేనే భయపడుతున్న పరిస్థితి. వైసీపీ కోలుకుని రాజకీయంగా చురుకుగా మారడం కష్టమని భావించిన ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే తమ దారి తాము చూసుకున్నారు. కూటమి పార్టీలలో సర్దుకున్నారు. మరి కొందరు రాజకీయాలకు దూరంగా ఉంటామంటూ ప్రకటనలు చేసి పార్టీకి రాజీనామా చేశారు.

ఇక మిగిలిన వారిని జగన్ స్వయంగా పార్టీ నుంచి తరిమేసే కార్యక్రమం ఏదైనా పెట్టుకున్నారా? అంటూ అనుమానాలు పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతున్నాయి. 
సాధారణంగా ఏ పార్టీ అయినా ఎన్నికలలో అవమానకరమైన ఓటమిని ఎదుర్కొన్న తరువాత.. పొరపాటు ఎక్కడ జరిగింది, ప్రజా విశ్వాసాన్ని ఎందుకు కోల్పోయాం. తిరిగి ప్రజల నమ్మకాన్ని పొందడం ఎలా అని ఆలోచిస్తుంది.  ఘోర ఓటమిపై ఆత్మ విమర్శ చేసుకుంటుంది. పార్టీని మళ్లీ గాడి లోకి పెట్టడానికి ఏం చేయాలన్నదానిపై సమాలోచనలు చేస్తుంది. కానీ వైసీపీలో ఈ ఎనిమిది నెలల కాలంలో ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. ఓటమికి ఈవీఎం ట్యాంపరింగ్ కారణమంటూ కొన్ని రోజులు, తెలుగుదేశం అధినేత ఆచరణ సాధ్యం కాని హామీల కారణంగానే ఓటమి పాలయ్యామంటూ కొన్ని రోజులు గడిపేసింది.

ఎంత సేపూ తాము బ్రహ్మాండమైన పాలన అందించాం. సంక్షేమాన్ని దండిగా ఇచ్చాం.. అని చెప్పుకోవడమే కాకుండా క్రమం తప్పకుండా బటన్ నొక్కి సొమ్ము పందేరం చేసినా దానిని తీసుకుని కూడా జనం తమకు ఓట్లేయలేదని నెపాన్ని ప్రజల మీదకు నెట్టేయడంతోనే వైసీపీ అధినేత జగన్, ఆయన పార్టీ నేతలూ ఈ ఎనిమిది నెలలూ గడిపేశారు. దీంతో పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదని పలువురు నేతలు జగన్ కు బైబై చెప్పేశారు. అలా వెళ్లిపోవడం అన్నది పార్టీలో అత్యంత కీలక నేత, జగన్ అక్రమాస్తుల కేసులో సహనిందితుడు అయిన విజయసాయి వరకూ సాగింది. దీంతో ఇక పార్టీలో మిగిలిన వారిని కాపాడుకోవడానికి జగన్ ప్రయత్నాలు ప్రారంభిస్తారని అంతా భావించారు. అంటే పార్టీ పదవులలో మిగిలి ఉన్న సీనియర్లను నియమించి పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేలా కార్యక్రమాలను రూపొందిస్తారని అంతా భావించారు. అయితే జగన్ తీరు మాత్రం పార్టీలో ఇంకా మిగిలి ఉన్న సీనియర్లను తరిమేసేలా ఉందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. 

ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి, రెండు సార్లు ఎమ్మెల్యే అయిన రోజాను పార్టీ నుంచి తరిమేయడానికి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.  గతంలో మాజీ మంత్రి బాలినేని విషయంలో కూడా ఇలాగే వ్యవహరించి చివరకు ఆయనంతట ఆయనే పార్టీ వదిలి వెళ్లిపోయేలా చేసిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. సరే విషయానికి వస్తే.. నగరి నియోజకవర్గ ఇన్ చార్జిగా రోజాను కాకుండా.. ఇప్పుడు కొత్తగా వైసీపీలో చేరడానికి సిద్ధమైన నాయకుడిని నియమించాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలలోనే గట్టిగా చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడి పెద్ద కుమారుడు గాలి భాను ప్రకాష్ నగరి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన రోజాపై భారీ మెజారిటీతో గెలుపోందారు. ఇప్పుడు గాలి ముద్దుకృష్ణమ రెండవ కుమారుడు   గాలి జగదీశ్ వైసీపీ గూటికి చేరనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆయన బుధవారం వైసీపీ కండువా కప్పుకుంటారు. ఆయననను పార్టీలో చేర్చుకుని నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే రోజాకు పార్టీ నుంచి బయటకు వెళ్లమని మర్యాదగా చెప్పినట్లేనని అంటున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో గాలి జగదీశ్ ను వైసీపీలో చేర్చుకోవడంపై రోజా తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అబ్యంతరాన్ని ఆమె నేరుగా జగన్ కే తెలియజేశారని అంటున్నారు. దీంతో గాలి జగదీశ్ వైసీపీ చేరికకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.  మొత్తం మీద జగన్ వ్యవహార శైలి పార్టీలోని సీనియర్లకు కాళ్ల కింద కుంపటి పెడుతున్నట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.