వాలంటీర్ల‌కు జ‌గ‌న్‌ షాక్.. బాబు భరోసా!

Publish Date:Apr 10, 2024

Advertisement

వాలంటీర్ల‌కు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి షాకిస్తే.. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు భరోసా ఇచ్చారు.  ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ వేళ ఈ అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జ‌గ‌న్ వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసిన‌ప్ప‌టికీ.. వారి సేవ‌ల‌ను త‌ప్పుడు ప‌ద్ద‌తుల్లో వినియోగించుకుంటున్నార‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. వాలంటీర్ల స‌హాయంతో ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త డేటా సేక‌రిచ‌డంతోపాటు, వారిని వైసీపీ కార్య‌క‌ర్త‌లుగా జ‌గ‌న్‌ మార్చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ వారిని పార్టీ ప్ర‌చారానికి ఉప‌యోగించుకొని ల‌బ్ధిపొందాల‌ని జ‌గ‌న్ కుట్ర‌ చేశారు. దీంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం వైసీపీ కుట్ర‌ల‌కు చెక్‌ పెట్టింది. వాలంటీర్ల సేవ‌ల‌ను ఎన్నిక‌ల కోడ్ పూర్త‌య్యే వ‌ర‌కు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ నిర్ణ‌యంతో షాక్ కు గురైన వైసీపీ అధిష్టానం.. కొత్త కుట్ర‌కు తెర‌లేపింది. వాలంటీర్లంద‌రినీ రాజీనామా చేయించి పార్టీ ప్ర‌చారంలో వాడుకోవాల‌ని వైసీపీ నేత‌లు ప్ర‌య‌త్నం చేశారు. కొంద‌రు వాలంటీర్లు ఉద్యోగానికి రాజీనామా చేయ‌గా.. మెజార్టీ వాలంటీర్లు ఇదంతా వైసీపీ కుట్ర‌లో భాగ‌మ‌ని గుర్తించి రాజీనామాకు స‌సేమిరా అన్నారు. అయితే  రాజీనామా చేయ‌ని వారిని మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చాక తొల‌గిస్తామ‌న్న బెదిరింపుల‌కు  వైసీపీ నేత‌లు దిగారు. దీంతో ఆందోళ‌న‌లో ఉన్న వాలంటీర్ల‌కు చంద్ర‌బాబు నాయుడు అండ‌గా నిలిచారు. దీంతో వాలంటీర్ల నుంచి హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ఏపీలో వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌పై పెద్దచ‌ర్చే జ‌రుగుతుంది. ఇటీవ‌ల‌ ఎన్నిక‌ల సంఘం వాలంటీర్ల‌ను  పెన్షన్ల పంపిణీ కి దూరంగా ఉంచాలని ఆదేశించింది. వారికి ప్ర‌భుత్వం ఇచ్చిన ట్యాబ్ లు, సెల్ ఫోన్లు వెన‌క్కు తీసుకుంది. ఇత‌ర మార్గాల ద్వారా వృద్ధుల‌కు ఇంటివ‌ద్ద‌కే వెళ్లి పెన్ష‌న్ ఇవ్వాల‌ని  ఆదేశించింది. దీంతో వైసీపీ త‌ప్పుడు ప్ర‌చారంతో ల‌బ్ధిపొందాల‌ని చూసింది. వృద్ధుల‌కు పెన్ష‌న్లు ఇవ్వ‌కుండా తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన పార్టీల కూట‌మి పెన్షన్ల పంపిణీని అడ్డుకుంద‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేసింది. వృద్ధుల‌కు, న‌డ‌వ‌లేని వారికి ఇళ్ల‌కు వెళ్లి పెన్ష‌న్ అందించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశించినా.. ఆ ఆదేశాల‌ను అధికారులు ప‌క్క‌న పెట్టారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు పెన్ష‌న్లు ఇవ్వ‌కుండా అడ్డుకున్నారంటూ వైసీపీ నేత‌లు అస‌త్య ప్ర‌చారాన్నిచేశారు. దీనికితోడు.. చంద్ర‌బాబు ఫిర్యాదుతోనే స‌చివాల‌యం వ‌ద్ద‌నే పెన్ష‌న్లు ఇవ్వాల‌ని ఎన్నిక‌ల సంఘం ఆదేశించిందంటూ వృద్ధుల‌ను మండుటెండ‌లో మంచాల‌పై పెన్ష‌న్ కోసం తీసుకెళ్లి, ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియా, వైసీపీ అనుకూల మీడియాలో విస్తృత ప్ర‌చారం చేశారు. త‌ద్వారా కూట‌మి అధికారంలోకి వ‌స్తే వృద్ధులు, పెన్ష‌న్ దారుల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ప్ర‌చారం చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. వైసీపీ నేత‌ల త‌ప్పుడు ప్ర‌చారం వ‌ల్ల పెన్ష‌న్ కోసం మండుటెండ్ల‌లో వెళ్లి ప‌దుల సంఖ్య‌లో వృద్ధులు మ‌ర‌ణించారు. ఒక‌ప‌క్క ఎన్నికల సంఘం వృద్ధుల‌కు, న‌డ‌వ‌లేని వారికి ఇంటింటికి వెళ్లి పెన్ష‌న్ ఇవ్వాల‌ని ఆదేశిలిచ్చినా, త‌ప్పుడు ప్ర‌చారంలో వైసీపీ ల‌బ్ధిపొందాల‌ని చూసింది. వైసీపీ కుట్ర‌లు ప్ర‌జ‌ల‌కు అర్ధంకావ‌టంతో మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని భావించి వైసీపీ ఆ  డ్రామాకు స్వ‌స్తి చెప్పింది.

వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను వైసీపీ ప్ర‌భుత్వం మొద‌టి నుంచి త‌ప్పుడు ప‌నుల‌కుకూడా ఉప‌యోగించుకుంది. ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త డేటాను సేక‌రించ‌డంతోపాటు, పెన్ష‌న్ దారులుపై వైసీపీకే ఓటు వేయాల‌ని ఒత్తిడి తెచ్చారు. దీంతో  వైసీపీ సానుభూతి ప‌రుల‌కు మాత్ర‌మే పెన్ష‌న్లు ఇస్తూ  తెలుగుదేశం, జ‌న‌సేన సానుభూతి ప‌రుల‌కు పెన్ష‌న్లు రాకుండా ఇబ్బందులు పాలుచేశారు. ఆది నుంచి వాలంటీర్లు అంటే వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లా ముద్ర‌ప‌డిపోయారు. దీంతో టీడీపీ, జ‌న‌సేన పార్టీలు వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను త‌ప్పుబ‌డుతూ వ‌చ్చాయి. తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యంతో వాలంటీర్లు రాజీనామా చేయాలంటూ వైసీపీ నేత‌లు వారిపై ఒత్తిడి తెస్తున్నారు. రాజీనామా చేయ‌ని వాలంటీర్ల‌ను మ‌ళ్లీ వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత పూర్తిగా ప‌క్క‌న పెట్టేస్తామంటూ బెదిరింపుల‌కు  దిగుతున్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు నాయుడు వాలంటీర్ల‌కు భ‌రోసా ఇచ్చారు. కూట‌మి అధికారంలోకి వ‌స్తే వాలంటీర్ల‌కు నెల‌కు రూ. 10వేలు వేత‌నం ఇస్తామ‌ని ఉగాది రోజున శుభ‌వార్త చెప్పారు. వాలంటీర్ల‌ను మంచి ప‌నులకు ఉప‌యోగిస్తామ‌ని, పార్టీ కార్య‌క‌ర్త‌ల్లా చూడ‌బోమ‌ని, ప్ర‌జ‌ల‌కు సేవ‌చేసే వాలంటీర్ల‌కు తాము ఎల్ల‌ప్పుడూ అండ‌గా ఉంటామ‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. 

కూట‌మి అధికారంలోకి వ‌స్తే వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను తొల‌గిస్తార‌ని వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. వైసీపీని మ‌రోసారి గెలిపించుకుంటేనే వాలంటీర్ల ఉద్యోగాలు ఉంటాయ‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కూట‌మి అధికారంలోకి వ‌స్తే వాలంటీర్ల‌కు జీతం రూ.10వేలకు పెంచుతామ‌ని చెప్ప‌డం ప‌ట్ల వాలంటీర్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు, తాము అధికారంలోకి వ‌స్తే వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేస్తామ‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో ఎలాంటి నిజంలేద‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు హామీతో మెజార్టీ శాతం వాలంటీర్లు ఖుషీ అవుతున్నారు. ఇన్నాళ్లు వైసీపీ నేత‌ల పెత్త‌నంతో తాము అనేక ఇబ్బందులు ప‌డ్డామ‌ని, చంద్ర‌బాబు హామీతో కూట‌మి అభ్య‌ర్థుల విజ‌యానికి తాము కృషిచేస్తామ‌ని ప‌లువురు వాలంటీర్లు బ‌హిరంగాంగా చెబుతున్నారు. ఎన్నిక‌ల వేళ వాలంటీర్ల‌ను అడ్డుపెట్టుకొని మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని భావించిన సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి చంద్ర‌బాబు త‌న‌దైన శైలిలో గ‌ట్టి షాకిచ్చిన‌ట్లయింద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. చంద్ర‌బాబు వాలంటీర్ల‌కు ఇచ్చిన హామీతో వైసీపీ అభ్య‌ర్థులు ఆందోళ‌న చెందుతున్నారు. ఇక విజయంపై తమలో దింపుడు కళ్లెం ఆశ కూడా మిగలలేదని పలువురు వైసీపీ అభ్యర్థులు ప్రైవేటు సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

By
en-us Political News

  
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.