Publish Date:Jul 29, 2024
జగన్‌ని నమ్మితే ఎరగనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్టే.. షాక్ కొట్టాక గానీ జగన్‌ని నమ్మడం ఎంత పెద్ద తప్పో తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తాము చేసిన తప్పు తెలిసొచ్చింది. అందుకే, ఆ తప్పు మరోసారి చేయకుండా తమను తాము రక్షించుకున్నారు. కానీ, పాపం ఇంకా కొంతమందికి జగన్ అసలు స్వరూపం అర్థం కాలేదు. అందుకే గొర్రె కసాయివాడిని నమ్మినట్టు జగన్‌ని నమ్ముతున్నారు. నమ్మడం మీ వంతు, మిమ్మల్ని మోసం చేయడం నావంతు అన్నట్టుగా జగన్ తనపని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు లేటెస్ట్.గా జగన్ చేతిలో దారుణంగా మోసపోయింది ఎవరయ్యా అంటే, వినుకొండలో హత్యకి గురైన రషీద్ కుటుంబ సభ్యులు.
హతుడు రషీద్, హంతకుడు జిలానీ ఇద్దరూ పాత స్నేహితులే. ఇద్దరూ వైసీపీ కార్యకర్తలే. అయితే కారణాలు తెలియవుగానీ, ఇద్దరి మధ్య శత్రుత్వం పెరిగింది. అది రషీద్ హత్యకి దారి తీసింది. ఇది పూర్తిగా వ్యక్తిగత కక్షల వల్ల జరిగిన హత్య అని పోలీసుల దర్యాప్తులో కూడా తేలింది. రషీద్‌కి, జిలానీకి వ్యక్తగత కక్షలు ఎప్పటి నుంచో వున్నాయని రషీద్ కుటుంబానికి కూడా తెలుసు. ఈ నేపథ్యంలో రషీద్ హత్యకు గురికావడంతో శవాల కోసం వెతికే రాబందు జగన్మోహన్‌రెడ్డికి మంచి అవకాశం దొరికింది. రషీద్ కుటుంబాన్ని పరామర్శించే పేరుతో వినుకొండకి వెళ్ళి నానా రచ్చ చేయడానికి ఛాన్సొచ్చింది. జగన్ నాటకం మరింత రక్తి కట్టడానికి కావలసింది రషీద్ కుటుంబ సభ్యుల మద్దతు. అంతే, జగన్ ఆదేశాలతో లోకల్ వైసీపీ బ్యాచ్ రషీద్ కుటుంబం దగ్గరకి వెళ్ళింది. జగన్ సార్ పరామర్శకి వస్తారు. మీరు ఆ సమయంలో ఇది రాజకీయ హత్యేనని చెప్పాలి. తెలుగుదేశం వాళ్ళే చంపారని చెప్పాలి. పనిలోపనిగా తెలుగుదేశం పరిపాలన సరిగా లేదని కూడా చెప్పాలి. జగనన్న పరామర్శకు వచ్చి వెళ్ళిన తర్వాత పది లక్షల రూపాయలు మీకు అందుతాయి. చెట్టంత రషీద్‌ని పోగొట్టుకున్న బాధలో వున్న మీకు ఆ డబ్బు వస్తే కొంత ఊరట దక్కుతుంది అని చెప్పి ఒప్పించారు.
ఆ తర్వాత జగన్ వినుకొండకి రావడం, రషీద్ కుటుంబాన్ని పరామర్శించడం, రషీద్ కుటుంబం తెలుగుదేశం వాళ్ళే చంపారని చెప్పడం, మధ్యమధ్యలో చంద్రబాబు పథకాలు ఏవీ అందడం లేదని కూడా చెప్పడం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఆ తర్వాతే స్టోరీలో జగన్ మార్కు అసలు ట్విస్టు మొదలైంది. జగన్ రావడం అయింది, వెళ్ళడం అయింది. రషీద్ కుటుంబానికి ఇస్తానన్న ఆర్థిక సాయం మాత్రం అందలేదు. రేపో ఎల్లుండో జగన్ సార్ డబ్బు పంపుతారు అని ఎదురుచూసిన రషీద్ కుటుంబానికి మెల్లగా జ్ఞానోదయం కలిగింది. ఈ విషయంలో స్థానిక నాయకులను అడిగితే, వాళ్ళు ‘‘మాకేం తెలుసు.. ఆయన పదిలక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తారని అనుకున్నాం.. కానీ అలా జరగలేదు’’ అని చేతులెత్తేశారు. దాంతో రషీద్ కుటుంబం షాకైపోయారు. అప్పటికి గానీ వాళ్ళకి జగన్ అసలు స్వరూపం అర్థం కాలేదు. పాపం.. కుటుంబంలోని వ్యక్తిని కోల్పోయారు.. జగన్ దిక్కుమాలిన రాజకీయాల్లో పావులా మారారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-shock-to-rasheed-family-39-181723.html
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.