ఉద్యోగులకు ఏపీ సర్కార్ మళ్లీ షాక్

Publish Date:Apr 28, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ రెడ్డి సర్కార్ మళ్లీ షాక్ ఇచ్చింది. గత సంవత్సరానికి సంబంధించిన కరువుభత్యం బిల్లులను అప్ లోడ్ చేసు అవకాశం లేకుండా సీఎఫ్ఎంఎస్ లో లాగిన్ ను మూసేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 వేల కోట్ల రూపాయల డీఏ బిల్లులు చెల్లింపులు లేక నిలిచిపోయాయి. తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలపై దెబ్బకొట్టిన ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నిధుల కొరత కారణంగా డీఏ బిల్లులను ఇప్పటికే ఏపీ సర్కార్ వెనక్కి పంపేయడం చర్చనీయాంశంగా మారింది.

ఒక్క ఛాన్స్ అంటూ ఏపీలో అధికార పీఠం ఎక్కిన జగన్ రెడ్డి సర్కార్ అవకతవకలు, చేతగానితనం, అనాలోచిత చర్యలు ఒక్కొక్కటిగా వెల్లడవుతూనే ఉన్నాయి. పరిపాలనలో ప్రభుత్వ పెద్దల అనుభవ రాహిత్యం కారణంగా రాష్ట్ర ఖజానాను పూర్తి దివాలా దిశగా నడిపిస్తున్నారు. ఆదాయం వస్తున్నా.. చెల్లింపుల విషయంలో ఏమాత్రం చేవలేక, చేతకాక చేతులెత్తేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. నవరత్నాల పేరు చెప్పి ఖజానాలోని సొమ్మంతా ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చుపెట్టేసి, ఆనక అత్యవసర సమయాల్లో, అభివృద్ధి పనుల విషయంలో వైసీపీ సర్కార్ మొండిచెయ్యి చూపిస్తోందని అంటున్నారు.

ఖజానాను ఖాళీ చేసేసి, దొరికిన చోటల్లా అప్పులు తెచ్చేసి, ఆపైన ఓవర్ డ్రాఫ్ట్ కూడా వాడేసినా రోజువారీ పాలన సాగించలేని దుస్థితిలోకి ఏపీని నెట్టేసిన జగన్ సర్కార్ ఆ తర్వాత పలు ప్రభుత్వ శాఖల నుంచీ నిధులు తలరించుకుపోయింది. నిజానికి ఏపీకి ఇక అప్పు కూడా పుట్టని దుస్థితి దాపురించింది. అవీ చాలకపోవడంతో పంచాయతీరాజ్ వ్యవస్థలోని అట్టడు స్థాయిలోని పంచాయతీల నుంచి కూడా సొమ్ములు లాగేసుకుంది. తద్వారా గ్రామాల్లో పనులు కొనసాగించలేక సర్పంచ్ ల చేత చిప్పలు చేతపట్టించింది రాష్ట్ర సర్కార్. అయినా దాని కరువు తీరకపోవడంతో ఇప్పుడు ఏకంగా ఉద్యోగుల డీఏ బకాయిల్ని కూడా చెల్లించకుండా మొండికేసే స్థితికి దిగజారిపోయిందని విశ్లేషకులు అంటున్నారు.
 
ఇప్పుడు తాజాగా.. డిస్ట్రిక్ట్ డ్రాయింగ్ ఆఫీసర్ల (డీడీఓల) నుంచి డీఏ బిల్లులు మార్చినెల చివరి వారంలో సబ్ ట్రెజరీలకు వచ్చాయట. వేతనాలు, పింఛన్లు తప్ప మరే బిల్లునూ అప్ లోడ్ చేసేందుకు సీఎఫ్ఎంఎస్ ఛాన్స్ ఇవ్వడం లేదని సబ్ ట్రెజరీ ఉద్యోగుల నుంచి వస్తున్న సమాచారం. జిల్లా సబ్ ట్రెజరీ ఆఫీసులు వాటిని అప్ లోడ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే మంగళవారం సాయంత్ర నుంచే అవి అప్ లోడ్ కావడంలేదట. ‘ఇన్ సఫిసియంట్ ఆఫ్ ఫండ్స్’ అనే ఆప్షన్ సబ్ ట్రెజరీ ఆఫీసుల కంప్యూటర్ తెరలపై కనిపిస్తోందట. దీంతో ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సుమారు ఏడాది క్రితం డీఏ బిల్లులు చెల్లించకుండా జగన్ రెడ్డి సర్కార్ తమకు తీవ్ర అన్యాయం చేస్తోందని దుయ్యబడుతున్నారు.

గత ఏడాది డీఏ ఒక్కొక్కరికి సుమారు 6 వేలు నుంచి లక్ష రూపాయల వరకు రావాల్సి ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఇప్పటికే సంవత్సరం దాటిపోయినా తమ డీఏ బిల్లుల్ని ఇంకా ఎంతకాలం ప్రభుత్వం ఆపుతుందని ఫైరవుతున్నారు.

By
en-us Political News

  
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఈ నేపథ్యంలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎవరికీ అంత సులువుగా కనిపించడం లేదు.
అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదనీ, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ-అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
భార్య పేరుతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. చిత్తూరు జిల్లాలో తమ పీఎల్ఆర్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసం ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోబోమని విస్పష్టంగా పేర్కొంది.
ఈ నెల 28 రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమెదించడమే. ఇది ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగుగా భావించవచ్చు.
భారతంలో ద్రౌపదిని వివస్త్రను చేయడానికి కౌరవులు ప్రయత్నిస్తే.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగల్చడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే కురుక్షేత్రంలో కౌరవులు ఓడిపోయినట్టుగా.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది.
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు
1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న నంబర్ 24, అక్బర్ రోడ్ భవనాన్ని ఈ నెల 28 లోగా అంటే శనివారం లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది.
జ‌గ‌న్ లెవ‌న్ పై మీమ్స్ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. పంజాబ్ కింగ్స్ లెవ‌న్ లాగా.. జ‌గ‌న్స్ లెవ‌న్ అనే పేరు మీద మీమ్స్ వెల్లువెత్తాయి. ఇక తాజాగా కొత్త పార్లమెంట్ భవనంలో వైసీపీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కేటాయించినది కూడా 11వ నెంబర్ రూమే.
ఇక 2026 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ప‌లుర‌కాల ఉచితాల వ‌ల ప‌న్నాయంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు.
ఇక టికెట్ ధరల పెంపు అనేది కేవలం పవన్ కల్యాణ్ కోసం తీసుకున్న నిర్ణయం కాదని, నిర్మాతల నుంచి వచ్చే అభ్యర్థనల మేరకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం తీసుకునే నిర్ణయమని స్పష్టం చేశారు. ఈ పిటిషన్ వెనుక కేవలం రాజకీయ దురుద్దేశాలు తప్ప, ప్రజా ప్రయోజనం లేదన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.