Publish Date:May 22, 2025
రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డిపై వైసీపీ అధినేత, మాజీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడిన జగన్ విజయసాయిని టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు, ఏపీలో కూటమి ప్రభుత్వానికి మేలు చేసేందుకే విజయసాయి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని ఆరోపించారు. తన రాజ్యసభ సభ్యత్వం గడువు మరో మూడున్నర సంవత్సరాలు మిగిలి ఉండగానే విజయసాయి రెడ్డి కూటమి ప్రభుత్వానికి మేలు చేయడానికేనన్న జగన్.. జయఃసాయి తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూటమికి అమ్మేసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ఆవిర్భావం నుంచే కాకుండా అంతకు ముందు నుంచీ కూడా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న విజయసాయిపై జగన్ ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాలలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి విజయసాయి రెడ్డికి జగన్‌తో మూడు దశాబ్దాలకు పైగా సన్నిహిత అనుబంధం ఉంది. జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ ఏ1 అయితే విజయసాయి ఏ2గా ఉన్నారు. అది పక్కన పెడితే.. ఒక దశలో వైసీపీలో జగన్ తరువాత నంబర్ 2గా ఉన్నవిజయసాయి ఆ పార్టీ నుంచి రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే రెండో టర్మ్ ఇంకా మిగిలి ఉండగానే ఈ ఏడాది జనవరిలో ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికీ, పార్టీకీ రాజీనామా చేశారు. అప్పట్లో విజయసాయి వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నాననీ, రాజకీయ ఒత్తిళ్లు లేవని చెప్పారు. రాజకీయకు దూరంగా సాగు చేసుకుంటానని చెప్పారు.
అయితే.. ఇప్పుడు జగన్ విజయసాయి రెడ్డి చంద్రబాబు ప్రలోభాలకు లొంగి రాజీనామా చేశారని అలాంటి వ్యక్తి మాటలకు, స్టేట్‌మెంట్లకు ఏ విలువ ఉంటుంది ప్రశ్నించారు. గతంలో కూడా జగన్ విజయసాయిరెడ్డి విశ్వసనీయత కోల్పోయారని పేర్కొన్న సంగతి తెలిసిందే. అప్పట్లోనే జగన్ వ్యాఖ్యలకు విజయసాయి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఇప్పుడు లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరైన విజయసాయి ఇచ్చిన సమాచారం అధారంగానే నిందితుల అరెస్టులు జరుగుతున్నాయని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో జగన్ అరెస్టు అనివార్యం అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోన జగన్ గురువారం (మే 22) మీడియా సమావేశంలో విజయసాయిపై విమర్శలు గుప్పించారు. మద్యం కుంభకోణం కేసు తన వరకూరావడానికి విజయసాయే కారణమన్న ఆగ్రహంతోనే జగన్ ఈ స్థాయిలో స్పందించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే జగన్ విమర్శలపై విజయసాయి స్పందన కూడా అంతే తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. గతంలో తనను విశ్వసనీయత లేని వ్యక్తిగా జగన్ విమర్శించినప్పుడు విజయసాయి సీరియస్ గా రియాక్టైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-sensational-comments-on-vijayasai-39-198527.html
ఎల్బీ స్టేడియంలో జరిగిన సభ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెంట్రిక్ గానే జరిగింది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనారోగ్యం కారణంగా ఈ నెల 2న ఆయన అనారోగ్యం కారణంగా సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే.
చిత్తూరు జిల్లా మామిడి వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి పొలిటికల్ టర్న్ తీసుకుంది. జూలై 9న జగన్ బంగారుపాలెం మార్కెట్ యార్డ్ కి వచ్చి ఇక్కడి రైతులను పరమార్శించనున్నారు. కారణం ఈ రైతులకు తగిన ధర లేక అవస్థ పడుతున్నారని తెలియడమే. అలా తెలియడంతో ఇలా వారి కోసం ఓదార్పుయాత్రకు వచ్చేస్తున్నారు.
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్ న్యస్ చెప్పింది. ఇక జాతీయ రహదారులపై టోల్ ఫీజ్ సగానికి సగం తగ్గనుంది. ఔను కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల టోల్ ఫీజు నిబంధనల్లో చేసిన మార్పుల కారణంగా ఇది భారీగా తగ్గే అవకాశం ఉంది.
బేసిగ్గా జేపీ నడ్డా అధ్యక్ష పదవీ కాలం 2023 జనవరితోనే ముగిసింది. అయితే 2024 లో ఎన్నికల కారణంగా జూన్ వరకూ పొడిగించారు. అప్పటికీ ఏడాది గడచిపోయింది. ఇప్పుడు పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనివార్యం.
తెలంగాణలో ఇప్పటికే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో అన్ని పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. గెలుపు గుర్రాలను బరిలోకి దింపి సత్తా చాటాలన్న వ్యూహాలు, ప్రణాళికలలో నిమగ్నమయ్యాయి.
అమరనాథ్ యాత్ర కొనసాగుతోంది. గురువారం (జూలై) ప్రారంభమైన ఈ యాత్ర 38 రోజుల పాటు సాగుతుంది. శనివారం (జులై 5) మూడో రోజు యాత్ర కొనసాగుతోంది.
చిత్తూరు జిల్లాలో ఎనుగుల గుంపు భయాందోళనలు సృష్టిస్తోంది. జిల్లాలోని గ్రామాలపై దాడులు చేస్తూ పంటపొలాలను ధ్వంసం చేస్తున్నాయి.
మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల డిజైన్ మార్పును గిరిజనం వ్యతిరేకిస్తున్నారు. కొత్త డిజైన్ నమూనా ఆదివాసి సంస్కృతికి వ్యతిరేకంగా ఉందని మేడారం పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలలో భక్తులు పోటెత్తుతున్నారు. వారంతం కావడంతో తిరమలేశుని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.
డీఎంకే, బీజేపీలతో పొత్తులుండవ్. మా పార్టీ సీఎం కేండెట్ నేనేనంటూ విజయ్ ప్రకటన. ఇదయ దళపతి, టీవీకే అధినేత విజయ్.. ఎట్టకేలకు ఒక క్లారిటీ ఇచ్చారు. తమిళ స్పీకర్ అప్పావు వంటి వారు విజయ్ మరో రజనీ కాంత్ అవుతారని భావించారు.
గతంలో అమెరికా బెదిరించినా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భయపడలేదని, కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫోన్ చేయగానే పాకిస్థాన్‌తో యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపేశారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
తెలంగాణ బీజేపీ నూతన ఆధ్యక్షుడిగా, ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్. రామచంద్ర రావు, బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడితో ఇంచుమించుగా సంవత్సరం పైగా సాగుతున్న, కౌన్ బనేగా బీజేపీ అధక్ష్ కహానీలో ఒక అధ్యాయం ముగిసింది.