జగన్ ఢిల్లీ ధర్నాకు ఇండియా కూటమి నేతలు.. జగన్ ది సెల్ఫ్ గోలేనా?

Publish Date:Jul 24, 2024

Advertisement

రాజకీయ హింసాకాండతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లాడిపోతోందని ఆరోపిస్తూ, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత ఢిల్లీ వేదికగా ధర్నాకు దిగారు. తనకున్న 11 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎమ్మెల్సీలు, నలుగురు ఎంపీలు, పార్టీ రాజ్యసభ సభ్యులతో హస్తిన వేదికగా ఆయన చేసిన ధర్నా ఒక విధంగా సెల్ఫ్ గోలేనంటున్నారు పరిశీలకులు.

ఈ ధర్నా ద్వారా జగన్ తాను కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి చేరువ అవుతున్నాన్న సంకేతాలు ఇచ్చారు. ఎందుకంటే ఈ ధర్నాకు కాంగ్రెస్ ఎంపీలు ఎవరూ హాజరు కాలేదు కానీ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన సమాజ్ వాదీ పార్టీ. అన్నాడీఎంకే, శివసేన రెండు గ్రూపులు, ఐయుఎంఎల్ పార్టీలకు చెందిన సభ్యులు హాజరయ్యారు. అయితే అలా హాజరైన వారిలో అఖిలేష్ యాదవ్ ను మినహాయిస్తే మిగిలిన ఎవరూ పెద్దగా గుర్తింపు ఉన్న వారు కాదు. వారి వారి పార్టీల్లోనే వారు చిన్న నేతలు.

అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసి ఉన్నదంటూ ఏమైనా ఉందంటే అది వీరంతా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన నేతలు. వీరైనా ఎలా వచ్చారంటే.. గత పదేళ్లుగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి, ఆ క్రమంలో పలు పార్లమెంటరీ కమిటీల్లో ఉన్నారు. ఆ విధంగా ఆయన తనకున్న పలుకుబడిని ఉపయోగించి కొందరు ఎంపీలను జగన్ ధర్నాకు తీసుకురావడంలో సఫలమయ్యారు.

అలాగే మరో వైసీపీ రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీ, ఈయన రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఓ డైరెక్టర్, ఈయనను జగన్ రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు. దీంతో ఆయన రిలయెన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ గా తన పరపతిని ఉపయోగించి మరి కొంత మంది ఎంపీలను జగన్ ధర్నాకు తీసుకువచ్చారు. సరే ఎలా వస్తే ఏమిటి కానీ, జగన్ ధర్నాకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీలకు చెందిన కొందరు ఎంపీలు హస్తినలో జగన్ నిర్వహించిన ధర్నాకు హాజరయ్యారు. అంటే బీజేపీ వ్యతిరేక పార్టీలు జగన్ కు మద్దతుగా నిలిచాయి. దీని ద్వారా జగన్ కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి తాను కాంగ్రెస్ కు, ఆ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమికి చేరువ అవుతున్నాన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇలా సంకేతాలు పంపడం ద్వారా  రాజ్యసభలో తనకున్న సభ్యుల బలంతో బీజేపీని బ్లాక్ మెయిల్ చేయగలనని జగన్ భావిస్తుంటే భావిస్తుండ వచ్చు గాక, కానీ జగన్ పార్టీని చీల్చడం అన్నది చిటికెలో పని అని ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలే సంకేతాలిస్తున్నారు.

ఇప్పటికే పలువురు వైసీపీ రాజ్యసభ సభ్యలు తెలుగుదేశం, జనసేన, బీజేపీతో టచ్ లోకి వెళ్లినట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.  అదే జరిగితే ఇంత కాలం  ఏ బీజేపీ అండతో అయితే జగన్ తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ ను జాప్యం చేసుకోగలిగారో, అదే బీజేపీ ఆ కేసుల విచారణకు వేగవంతం చేసి జగన్ ను ఉక్కిరిబిక్కిర చేయడం ఖాయమని అంటున్నారు.  మొత్తం మీద ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల మద్దతుతో హస్తినలో ధర్నాకు దిగి జగన్ సెల్ఫ్ గోల్  చేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.