జగన్ బీసీ కార్డ్ సెల్ఫ్ గోలేనా?

Publish Date:Jun 20, 2023

Advertisement

కర్నాటకలో బీజేపీ ఓటమి తర్వాత  ఆ పార్టీ పట్ల ఏపీ సీఎం జగన్ రెడ్డి వైఖరి మారుతోందా?  బీజేపీ దూకుడుకు బ్రేకులు వేసేందుకు పావులు కదుపుతున్నారా? ఇందు కోసం వ్యూహాత్మకంగా బీసీ కార్డును తెరపైకి తెచ్చారా ?అంటే అందుకే బీసీ కార్డుతో బీజేపీ దూకుడుకు బ్రేకులు వేసే వ్యూహానికి తెరలేపారా? అంటే పరిఇశీలకులు ఔననే అంటున్నారు.

అయితే నాలుగేళ్ల పాటు బీజేపీ మాటే వేదం అన్నట్లుగా వ్యవహరించిన జగన్ ఇప్పుడు బీజేపీకి చెక్ పెట్టేందుకు చేస్తున్న వ్యూహరచన ఫలిస్తుందా అంటే అనుమానమే అని అంటున్నారు. ఏమైతేనేం.. కేసుల భయమో, మరోటో కానీ అధికారంలో  ఉన్న ఈ నాలుగేళ్ల కాలంలోనూ బీజేపీ అడుగులకు మడుగులొత్తుతూ.. స్వామి కార్యం, స్వ కార్యం నెరవేర్చుకున్న జగన్ ఇప్పుడు ఎన్నికల సంవత్సరంలో ఆ పార్టీకి చెక్ పెట్టేందుకు పన్నుతున్న వ్యూహాలు బూమరాంగ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇంతకీ బీజేపీ దూకుడుకు చెక్ పెట్టేందుకు  బీసీ రిజర్వేషన్ బిల్లును తెరపైకి తీసుకువచ్చారని పరిశీలకులు అంటున్నారు. బీజేపీకి బీసీలను దూరం చేయాలన్న వ్యూహాన్ని జగన్ తలకెత్తుకున్నారనీ,  కేంద్రంలో ఉన్న 27 మంది బీసీ మంత్రులూ పనికిరాని వాళ్లంటూ బీసీ నేత   కృష్ణయ్య విమర్శ వెనుక ఉన్న ఎత్తుగడ ఇదేననీ విశ్లేషిస్తున్నారు.  

కేంద్రంలోని మోడీ సర్కారు బీసీలకు అన్యాయం చేస్తోందని వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య విమర్శించడం మామూలు విషయం కాదని అంటున్నారు.  పేరుకు మాత్రమే బీసీ అయిన మోడీ   క్యాబినెట్‌లో ఉన్న 27 మంది బీసీ మంత్రులు పనికిమాలిన వాళ్లేనని కృష్ణయ్య విమర్శించారు. దేశంలోని 75 కోట్ల బీసీలకు బీజేపీ ప్రభుత్వం చేసిందేమిటని నిలదీశారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు రెండు లక్షల కోట్ల బడ్జెట్  ఇవ్వకపోతే  ధర్నా చేస్తామని హెచ్చరించారు. అంతే కాకుండా అన్ని రాష్ట్రాల్లో పర్యటించి బీసీలను ఏకం చేస్తామన్నారు. బీసీల రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కూడా మద్దతునిచ్చారని కృష్ణయ్య చెప్పారు.  నాలుగేళ్లుగా కేంద్రంలోని మోడీ సర్కార్  ఆశీస్సులతో ఔను కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులతోనే ఏపీలో బండి లాగించేస్తున్న జగన్ పార్టికి చెందిన ఎంపీ కృష్ణయ్య కేంద్రానికి అల్టిమేటమ్ ఇచ్చారంటే.. కేంద్రంతో జగన్ సర్కార్ కు ఉన్న సత్సంబంధాల్లో ఏదో తేడా కొట్టినట్టేనని పరిశీలకలు అంటున్నారు.  

ఎందుకంటే  వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ కూడా జగన్ అనుమతి లేకుండా నోరు మెదపడానికి సాహసించరు. అలా సాహసించిన వారు పార్టీలో ఉండరు.  మరి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రంలోని బీజేపీ సర్కారు వైఫల్యాలనూ, చేతగాని తనాన్నీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య చెరిగేయడం వెనుక జగన్ అనుమతి ఉందనే అంటున్నారు.  ఎందుకంటే కృష్ణయ్య బీసీ రిజర్వేషన్ల గురించి చేసిన వ్యాఖ్యలు, కేంద్రానికి ఇచ్చిన అల్టిమేటమ్ వ్యక్తిగత స్థాయిలో ఇచ్చిందే అనుకున్నా.. ఆయన నోటి వెంట కేంద్రంలోని మోడీ సర్కార్ పై విమర్శలు వచ్చిన వెంటనే వైసీపీ అధికారికంగా వాటిని ఖండించి ఉండాలి. అది పార్టీ అభిప్రాయం కాదనీ, కృష్ణయ్య వ్యక్తిగత హోదాలో చేసిన వ్యాఖ్యలనీ స్పష్టత ఇచ్చి ఉండాలి. కానీ ఇప్పటి వరకూ అటువంటిదేమీ జరగలేదు.  అంటే జగన్ అనుమతితోనే కృష్ణయ్య మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా గళమెత్తారని భావించాల్సి వస్తోంది.

 ఇదే విషయం బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది. అమిత్ షా, నడ్డాలు ఏపీ వచ్చి మరీ జగన్ పార్టీపై నిప్పులు చెరిగి వెళ్లిన తరువాత ఇరు పార్టీల మధ్యా అగాధం ఏర్పడిందనడానికి కృష్ణయ్య వ్యాఖ్యలు కూడా ఒక నిదర్శనంగా పరిశీలకులు చెబుతున్నారు. ఇక కృష్ణయ్య బీసీ అయిన మోడీని నామ్ కేవాస్తేగా ప్రధానిని చేశారంటూ వ్యాఖ్యానించడంపై పార్టీ అగ్రనాయకత్వం చాలా చాలా సీరియస్ గా ఉంది.  వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య వ్యాఖ్యల వెనుక, ఏపీ సీఎం  జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలున్నాయన్న చర్చ బీజేపీలో జరుగుతోంది. తనకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ మద్దతు అవసరం లేదని ఇటీవల జగన్ వ్యాఖ్యానించడాన్ని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  తన సర్కార్ పై అవినీతి ముద్ర వేసి విమర్శించిన షా, నడ్డాలకు బీసీ బాణం సంధించిన జగన్  ఇందుకు కాంగ్రెస్ మద్దతు కూడా ఉందని చెప్పడం భవిష్యత్ లో తాను తీసుకోబోయే టర్న్ కు చిహ్నంగా బీజేపీ భావిస్తోంది.  

బీసీ బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.    బీజేపీ టీడీపీ లు దగ్గరౌతున్న సంకేతాలు వస్తున్న ఈ సమయంలో బీసీలకు బీజేపీ అన్యాయం చేస్తోందన్న విమర్శలు  రాజకీయంగా పూడ్చుకోలేని నష్టం చేకూర్చే అవకాశాలున్నాయని వైసీపీ వర్గాలు అంటున్నాయి.  ఒక విధంగా జగన్ బీసీ కార్డ్ ప్రయోగించి బీజేపీని ఇరుకున పెడదామన్న వ్యూహం సెల్ఫ్ గోల్ వంటిదేనని పార్టీ శ్రేణుల్లోనే ఓ స్థాయిలో చర్చ జరుగుతోంది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో పర్యటించారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో అనూహ్య విమాన ఘటన చోటుచేసుకుంది.
సైబరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కొత్త చర్యలకు సిద్ధమవుతోంది.
ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై హెచ్చరిక చిహ్నాల అమలులో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వం సిద్ధమైంది.
హైదరాబాద్ నగరంలోని రేతిబౌలి ప్రాంతంలో జరిగిన పెళ్లి ఊరేగింపులో కత్తులు చేతబట్టి నృత్యం చేసిన నలుగురు వ్యక్తులను గుడిమల్కాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
సూపర్ ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనిషి సహజ వృద్ధాప్య ప్రక్రియను నియంత్రించగలిగితే, సుమారు 1,400 సంవత్సరాల వరకు జీవించే అవకాశం
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
ప్రపంచ అందాల పోటీల చరిత్రలో కీలక మలుపు చోటు చేసుకుంది.
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు, రేడియల్ రోడ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టుల పనుల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ముంబయిలోని కాలాచౌకి ప్రాంతానికి చెందిన ఉదయ్ పవార్ పట్టుదల, ఆచరణాత్మక ఆలోచనలతో చిన్న స్థాయి సేవను లాభదాయక వ్యాపారంగా తీర్చిదిద్దారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.