అసెంబ్లీ బహిష్కరణ.. జగన్ సెల్ఫ్ గోల్!

Publish Date:Nov 12, 2024

Advertisement

ఏపీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే వైసీపీ ఎమ్మెల్యేలు సభను బాయ్ కాట్ చేయాలని  జగన్ తీసుకున్న నిర్ణయం నిస్సందేహంగా సెల్ఫ్ గోల్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గత ఐదేళ్ల పాలనలో జగన్ సర్కార్ చేసిన తప్పులను తెలుగుదేశం కూటమి సభ్యులు అసెంబ్లీలో ఎండగడతారన్న భయంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.  కేవలం ప్రతిపక్ష హోదా సాకుతో అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం వైసీపీ భవిష్యత్ ను అంధకారం చేయడం ఖాయమని అంటున్నారు.  బడ్జెట్ ప్రసంగాల ద్వారా అధికార పార్టీ తప్పులు, బడ్జెట్ లో జరగని కేటాయింపుల పై నిలదీతకు వచ్చిన అవకాశాన్ని వైసీపీ చేజేతులా జారవిడుచుకుందని అంటున్నారు.  

ప్రతిపక్ష హోదా ఇస్తామని హామీ ఇస్తే అసెంబ్లీకి వస్తామని వైసీపీ ఎమ్మెల్యేలు ,తమకు సభలో మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వాలనీ, ఆ విషయాన్ని స్పీకర్ చేత చెప్పించాలని వైసీపీ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందనడంలో సందేహం లేదు. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన తరువాత అసెంబ్లీలో ఆ పార్టీ అధినేత, అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో విపక్ష హోదా గురించి చేసిన ప్రసంగాన్ని ఒక్క సారి గుర్తు చేసుకుంటే.. ఇప్పుడు విపక్ష నేతగా ప్రతిపక్ష హోదా అడిగేందుకు తనకు ఏ మాత్రం అర్హత లేదన్న విషయం జగన్ కు అర్ధమౌతుందని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.   అసలు 11మంది సభ్యులున్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిబంధన ఎక్కడుందో చూపాలని జగన్ నిలదీయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది.  

అదీ కాక శాసన సభకు డుమ్మా కొట్టిన వైసీపీ సభ్యులు శాసనమండలికి హాజరవడం ఆ పార్టీ ఒక పద్ధతీ పాడూ లేని విధంగా వ్యవహరిస్తోందనడానికి నిదర్శనంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అసలు అసెంబ్లీ అంటేనే శాసనసభ, శాసనమండలి కదా..  బడ్జెట్ సమావేశాలకు శాసన సభను బహిష్కరించి మండలికి హాజరవడం వైసీపీ రాజకీయ అజ్ణానానికి నిలువెత్తు నిదర్శనంగా తెలుగుదేశం కూటమి అభివర్ణిస్తోంది. 

శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే హాజరవుతామనడం ప్రజాస్వామ్య వ్యవస్థ లో తప్పు అవుతుంది. ఈ విషయం తెలిసిన వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ వైఖరి ఇలానే కొనసాగితే తమపై అనర్హత వేటు పడుతుందని  భయపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడూ,అధికారం కోల్పోయినప్పుడు జగన్ ఒంటెద్దు పోకడలో మార్పు లేదని సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎమ్మెల్యే లతో సమావేశం నిర్వహించకుండా ఏకపక్షంగా ప్రకటించడంపై వైసీపీ ఎమ్మెల్యేలు అంతర్గత సంభాషణల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇలా అసెంబ్లీకి ముఖం చాటేసి రేపు ప్రజలు ముందుకు ఏ ముఖం పెట్టుకువెళ్లాలని వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణులు కూడా జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. అసెంబ్లీ సాంప్రదాయం ప్రకారం 10 శాతం సభ్యులున్న పార్టీలకే ప్రతిపక్ష హోదా ఉంటుంది. అది పట్టించుకోకుండా విపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీ బహిష్కరణ అని భీష్మించడం వల్ల అభాసుపాలు కావడం వినా మరో ప్రయోజనం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పటికైనా జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుని బడ్జెట్ సమావేశాలకు హాజరై గౌరవాన్ని కాపాడుకుంటే పార్టీకీ, ఆయనకూ కూడా మంచిదని హితవు చెబుతున్నారు. 

By
en-us Political News

  
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.