లడ్డూ వివాదంలో జగన్ సెల్ఫ్ గోల్

Publish Date:Sep 30, 2024

Advertisement

జగన్ లడ్డూ వివాదంలో నిండా మునిగిపోయారు. ఆయనకు ఇక ఇందులోంచి బయటపడే దారులన్నీ మూసుకుపోయాయి. స్వతహాగా క్రైస్తవ మత విశ్వాసం ఉన్న జగన్ ను ఆ కారణంగా ఏపీలోని హిందూ ఓటర్లు ఎన్నడూ దూరం పెట్టలేదు. 2019 ఎన్నికలలో జగన్ పార్టీ ఘన విజయం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగలగడమే ఇందుకు నిదర్శనం. 2024 ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాజయానికి కూడా ఆయన మత విశ్వాసం ఎంత మాత్రం కారణం కాదు. అధికారంలో ఉన్న సమయంలో అరాచక పాలన సాగించడమే ప్రజలు ఆయనను తిరస్కరించడానికి కారణం. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకూ తావులేదు. అయితే ఇప్పుడు లడ్డూ వివాదంలో ఆయన హిందూ వ్యతిరేకిగా తనకు తానే ముద్ర వేసుకున్నారు. 

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యి వినియోగం ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలను గాయపరిచింది. సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. కల్తీ నెయ్యి వినియోగంపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను వేసింది. ఆ సిట్ దర్యాప్తులో నిజానిజాలు తేలుతాయి. అయితే ఈ సమయంలో జగన్ ప్రాయశ్చిత పూజలు అంటూ తిరుమల ప్రయాణం పెట్టుకోవడం, అయితే తిరుమల వెంకన్న దేవుడిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించి తిరుమల ప్రయాణాన్ని రద్దు చేసుకోవడంతో ఆయన ప్రజలలో విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు. 

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ వ్యవహారం వెలుగులోకి రాగానే జగన్ తాను హిందూ వ్యతిరేకిని కాను అని చాటుకోవడానికి ఎన్ని చేయాలో అన్నీ చేశారు. అయితే.. గతంలో ఎన్నడూ లేని విధంగా లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి కొనుగోలుకు రివర్స్ టెండరింగ్ ఎందుకు అవసరం అయ్యిందో వివరించడంలో మాత్రం విఫలమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రాయశ్చిత పూజలు అంటూ తిరుమల పర్యటన పెట్టుకోవడాన్ని తెలివితక్కువ వ్యూహంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఆయన తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ అంశం తెరమీదకు వస్తుందని మెడమీద తలకాయ ఉన్న ఎవరైనా ఇట్టే చెప్పగలరు. అయితే జగన్ మాత్రం తన పర్యటనను ప్రభుత్వం అడ్డుకుంటే వచ్చే పోలిటికల్ మెయిలేజ్ పై దృష్టి పెట్టారు తప్ప డిక్లరేషన్ అంశం బూమరాంగ్ అవుతుందని ఊహించలేదు. ఇప్పుడు అదే ఆయన మెడకు చుట్టుకుంది. జగన్ తిరుమల పర్యటనను ప్రభుత్వం అడ్డుకోలేదు సరికదా.. ఆయన పర్యటన సజావుగా సాగడానికి అవసరమైన ఏర్పాట్లు చేసింది. కూటమి పార్టీ శ్రేణులెవరూ జగన్ పర్యటనను అడ్డకోవద్దంటూ జనసేనాని పిలుపు కూడా ఇచ్చారు. 

అన్యమతస్థులు ఎవరైనా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలంటే దేవుడిపై  విశ్వాసం ఉందన్న డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకోవడంతో డిక్లరేష్ ఇవ్వడం ఇష్టం లేకే జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారని ధృవపడింది.  ఇప్పుడు ఇక డిక్లరేషన్ ఇవ్వకపోవడానికి ఎన్ని కారణాలు చెప్పుకున్నా జనం నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే తిరుమల పర్యటన రద్దు చేసుకోవడం ద్వారా జగన్ స్వయంగా తాను హిందూ వ్యతిరేకిననీ, తిరుమల దేవుని పట్ల తనకు విశ్వాసం లేదనీ తనకు తానే చాటుకున్నట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.