Publish Date:Aug 17, 2022
అధికారంలోకి వచ్చే వరకూ ఒక మాట, వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతూ యువతకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, రాష్ట్రంలో దొరలపాలనే నడుస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు.
Publish Date:Aug 17, 2022
ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలన్నారు పెద్దలు.. అలాగే ఏదైనా సరే తెగేదాకా లాగకూడదనీ అన్నారు. అయితే వెంకటరెడ్డి ఆ రెంటినీ పరిధి దాటి వాడేశారా? ఇక వెంకటరెడ్డి విషయంలో కాంగ్రెస్ సీరియస్ నిర్ణయం తీసేసుకుందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసిన క్షణం నుంచీ.. ఇంకా గట్టిగా చెప్పాలంటే.. అంతకు ముందు నుంచీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను కాంగ్రెస్ ను వీడతాను జగ్రత్త అంటూ అధిష్ఠానానికి ఫీలర్లు పంపుతూనే ఉన్నారు.
Publish Date:Aug 17, 2022
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు ఎందుకు చేస్తోంది, ఎక్కడెక్కడ నుంచి చేస్తోంది. ఆ తీసుకున్న అప్పులను ఎలా ఖర్చు పెడుతోంది? ఈ వివరాలన్నీ బ్రహ్మ రహస్యం. కాదా కాదు జగన్ రహస్యం. ఎవరికీ తెలియదు, ఎవరైనా అడిగినా సర్కార్ చెప్పదు. ఆఖరికి కాగ్ అయినా సరే.. మరో రాజ్యాంగ వ్యవస్థ అయినా సరే. ఎవరడినిగా చెప్పం. మా అప్పులు, మా ఇష్టం అన్నట్లుగా ఏపీ సర్కార్ వ్యవహరిస్తోంది. రాజ్యంగ బద్ధంగా మేం నడుచుకోవడం కాదు.. మేం నడుపుతున్నదే రాజ్యాంగం. మేం చేసేదే పద్ధతి. ఎవరైనా సరే అంగీకరించి తీరాల్సిందే. ఇదీ జగన్ సర్కార్ వ్యవహారవైలి.
Publish Date:Aug 17, 2022
రైతు బరోసా కేంద్రాలను కేవలం ఏటీఎం మిషన్లుగా మార్చుకున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు.
Publish Date:Aug 17, 2022
ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, జనసేన నేత కొణిదెల నాగబాబు మధ్య ట్విట్టర్ వేదికగా ప్రాసలతో విమర్శలు పడుతున్నాయి. పంచ్ లు పేలుతున్నాయి. వీరి మధ్యలో అంబటిపై నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్, జనసేన శ్రేణులు, పవన్ ఫ్యాన్స్. వీరంతా తమ శైలిలో ట్వీట్ల వార్ రసవత్తరంగా కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు, సెటైర్లతో ఏపీలో పొలిటికల్ హీట్ ను ఒక్కసారిగా పెంచేశారు. ఈ వార్ ప్రారంభించింది మంత్రి అంబటి రాంబాబు. వివాదానికి మూల కారణం చేనేత చాలెంజ్.
Publish Date:Aug 17, 2022
బీజేపీ, టీఆర్ ఎస్ ల మధ్య ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల రభస మళ్లీ తలెత్తింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారానికి టీఆర్ఎస్ మీద విరుచుకుపడటమే ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకుంటు న్నారు.
Publish Date:Aug 17, 2022
పిల్లాడికి ముచ్చటపడి పేరు పెడతారు పెద్దవాళ్లంతా ఒక నిర్ణయానికి వచ్చి. దానికి ముందో వెనకో ఆధుని కత్వం జోడిస్తూ మంచి పేరు పెట్టడానికే ప్రయత్నిస్తారు. కుదరకపోతే లోకంలో సర్వసాధారణ మైన బాబీ, నిమ్మీ, విన్నూ.. ఎలాగూ ఉంటాయి. పేరు మార్చడం, అలాగే ఉంచడం తల్లిదండ్రుల యి ష్టం. కానీ ఒక ప్రభుత్వ పథకానికి ఇష్టం వచ్చినట్టు మారుస్తానంటే ఎలా కుదురుతుంది? అదేమన్నా స్వంత వ్యవహారమా. జగన్ సర్కార్ అంబేడ్కర్ విద్యానిథికి పథకానికి పేరు మార్చడం సర్వత్రా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.
Publish Date:Aug 17, 2022
తెలుగు వన్ సంస్థల అధినేత కంఠంనేని రవిశంకర్ కుమార్తె జితేష్ణ వివాహం సాయిరామ్ సోహిల్ తో శనివారం(ఆగస్టు 13) సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
Publish Date:Aug 17, 2022
సహజ నటి జయసుధ వెండి తెర మీద.. దాదాపు ఐదు దశాబ్దాల పాటు.. వివిధ పాత్రల్లో అభిమానులను అలరించింది. అయితే ప్రస్తుతం ఆమె రాజకీయాలకు దూరంగా.. సైలెంట్‌గా ఉంటున్నారు. కానీ ఆమెను తమ పార్టీలో చేర్చుకోవాలని కమలనాథులు.. ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆ క్రమంలో ఇప్పటికే బీజేపీ జాయినింగ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. ఈ సహజ నటితో భేటీ అయి.. పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
Publish Date:Aug 17, 2022
ప్రజాసంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయమని ప్రచారం చేసుకున్నంత మాత్రాన సంక్షేమం చేపడుతున్నట్టు కాదు. నిజంగానే ప్రజల సంక్షేమానికి తగిన పథకాలతో వారికి ఆసరాగా నిలవాలి. కేవలం పథకాలు ప్రక టించడం, యాప్‌లు తయారుచేయించి ప్రజలకు తాయిలాలుగా ఇవ్వడం తప్ప ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యే కించి జరుగుతున్న సంక్షేమమేమీ లేదన్నది విశ్లేషకుల మాట.
Publish Date:Aug 17, 2022
తెలంగాణాలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు కూలబోతున్నదీ బీజేపీ వారు లోకానికి తెలియజేసే గడియా రాన్ని ఏ ర్పాటు చేశారు. గతంలోనూ ఇలాంటి కార్యక్రమం చేపట్టి ఈసీ నుంచి మొట్టికాయలు వేయించు కున్నారు.
Publish Date:Aug 16, 2022
కర్నాటకలో బొమ్మై ప్రభుత్వం ఎంత నిస్సహాయ స్థితిలో ఉందో తెలియజేసే ఓ ఆడియో లీక్ అయ్యింది. కర్నాటక న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారానికి తెరతీశాయి.
Publish Date:Aug 16, 2022
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైసీపీ ఎంపీ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై దర్యాప్తునకు సీబీఐ రంగంలోనికి దిగనుందా? జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అలాగే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. గోరంట్ల న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై జాతీయ రాజకీయాలలో కూడా దుమారం రేగుతోంది.