ఇన్ చార్జ్ లు కావలెను.. జగన్ వెతుకులాట.. నేతల దోబూచులాట!

Publish Date:Jan 11, 2025

Advertisement

వైసీపీ పరిస్ధితి రాష్ట్రంలో నానాటికీ తీసికట్టు నాగంభోట్లుఅన్నట్లుగా తయారౌతోంది. ఏ నియోజకవర్గ ఇన్ చార్జిని ఎప్పుడు పీకేస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది. ఛాదస్తపు మొగుడు చెబితే వినడు తిడితే ఏడుస్తాడు అన్నట్లుగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఉందని ఆ పార్టీ నేతలే తలలుపట్టుకుంటున్న పరిస్థితి. అధికారంలో ఉండగా కన్నూమిన్నూగనక.. ఇక ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామన్న గుడ్డి విశ్వాసంతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన నేతలంతా ఇప్పుడు వైసీపీ వినా మరో గత్యంతరం లేక ఆ పార్టీలోనే ఉంటున్నారు. అలా కాకుండా కొద్దో గొప్పో పార్టీలో తామరాకు మీద నీటిబొట్టులా ఉండి.. ప్రత్యర్థులపై నోరు పారేసుకోని నేతలు వైసీపీని వదిలేసి కూటమి పార్టీల్లోకి దూకేశారు. ఆ దారిలో ఇంకా చాలా మంది ఉన్నారని అంటున్నారు. సంక్రాంతి తరువాత వైసీపీ నుంచి వలసలు పెద్ద సంఖ్యలో ఉంటాయనీ చెబుతున్నారు. ఇక రోజా, అంబటి, బుగ్గన, పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి, భూమనకరుణాకర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కాకాణి వంటి వారు వారి తీరు కారణంగా మరో పార్టీలోకి ప్రవేశం లేక.. గత్యంతరం లేక వైసీపీనే పట్టుకు వేళాడుతున్నారు. 

ఇక గత ఎన్నికల సమయంలో  పార్టీ టికెట్ల కేటాయింపును జగన్ మోహన్ రోడ్డి అపహాస్యం చేసి పారేశారు. ఎలాంటి కారణం, హేతువు అన్నదే లేకుండా అభ్యర్థులను మార్చి పారేశారు. తన ఫొటో చూసే ఓట్లు పడతాయి, అభ్యర్థులు నిమిత్త మాత్రులు అన్నట్లుగా వ్యవహరించారు. అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు నుంచి నరసరావుపేటకు పంపేయడం, అలాగే రోజా, అంబటి వంటి వారికి అసలు ఎన్నికలలో పోటీకి అవకాశం ఇస్తారా ఇవ్వరా అన్న సస్పెన్స్ లో ముంచి చివరి నిముషంలో టికెట్ కేటాయించడం వంటి ఫీట్లు ఎన్నో చేశారు.  ఆయన ఏం చేసినా అప్పట్లో నేతలు నోరు మెపదకుండా ఉండడానికి మరోసారి జగన్ అధికారంలోకి వస్తారన్న విశ్వాసమే కారణమని వేరే చెప్పనవసరం లేదు.

తీరా గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 2019 ఎన్నికలలో 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైసీపీ ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి జగన్ అరాచక పాలనకు విసిగి వేసారిపోయిన ప్రజలు ఆ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. దీంతో వైసీపీ నేతలలో అత్యధికులు సైలెంటైపోయారు. పార్టీ కార్యక్రమాలకు దూరం జరిగారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారు వెళ్లిపోగా, మిగిలిన వారిలో అత్యధికులు అటు పార్టీకీ, ఇటు ప్రజలకూ ముఖం చాటేసి ఎవరికీ కనిపించకుండా తిరుగుతున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు ఈ కోవలోకి వస్తారు. దీంతో పార్టీ క్యాడర్ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయింది.  

రాష్ట్రంలో దాదాపు 50కి పైగా నియోజకవర్గాలలో ఇప్పడు వైసీపీకి ఇన్ చార్జీలే లేరు. ఎవరినైనా నియమిద్దామని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తున్నప్పటికీ ఆ పోస్టును చేపట్టేందుకు ముందుకు వచ్చే వారే కరవయ్యారు.  పోనీ కోరుకున్న వారికి ఆ పోస్టు ఇచ్చేయొచ్చు కదా అంటే అందుకు జగన్ అంగీకరించడం లేదు. కింద పడినా పై చేయి నాదే అంటున్న జగన్ తీరు చూసి నేతలు కూడా వెనక్కు తగ్గుతున్నారు. ఇన్ చార్జిలు ఉన్న నియోజకవర్గాలలో కూడా పార్టీ  కార్యక్రమాలు చేపట్టేందుకు క్యాడర్ ముందుకు రావడం లేదు.   ఓ వైపు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా సాగుతూ కోటి సభ్యత్వాల ల్యాండ్ మార్క్ చేరుకుంది. ఆ పార్టీ కార్యకర్తల కోసం బీమా కూడా చేయించింది. మరో వైపు వైసీపీ ఉన్న క్యాడర్ ను చేజార్చుకుంటోంది. దీంతో రానున్న రోజులలో ఆ పార్టీ ఉనికి మాత్రంగా మిగిలిపోయినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.