చెప్పేదొకటి.. చేసేదొకటి.. అంతా జగన్మాయ!

Publish Date:Dec 24, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ ఏం చెబుతుందో అది చేయదు.. ఏం చెప్పలేదో... అది చేస్తుంది.  మాట ఒకటి.. చేత ఒకటి ఇది గతంలో పలు సందర్భాలలో రుజువైంది. అయితే జగన్ సర్కార్ తమ విధానమంటూ చెప్పుకు వస్తున్నమూడు రాజధానుల విషయంలో కూడా ద్వంద్వ ప్రమాణాలే పాటిస్తోందనీ తేటతెల్లమైపోయింది.

విశాఖ పాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని అంటూ జగన్ ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ ఉట్టి నీటి మూటలేనని తేలిపోయింది.  గతంలో కర్నూలులో ఏపీ జ్యుడీషియల్ అకాడమీ అంటూ జారీ చేసిన జీవోను ఇప్పుడు రద్దు చేసింది. ఆ జ్యుడీషియల్ అకాడమీని మంగళగిరిలోనే ఏర్పాటు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసంది. జీవో అయితే ఇక్కడే జారీ చేసింది కానీ మంగళగిరిలో జ్యుడీషియల్ అకాడమీ పనులు ఎప్పుడో ప్రారంభమయ్యాయి. హైకోర్టు నేతృత్వంలో ఆ పనులు జరుగుతున్నాయి. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.. ఈ అకాడమీని ప్రారంభిస్తారు. ఇది కూడా ఖరారైంది. అయితే కర్నూలులో ఏర్పాటు చేయదలచిన జ్యుడీషియల్ అకాడమీ కోసం జీవో కూడా జారీ చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు దానిని రద్దు చేసి మంగళగిరిలోనే ఏర్పాటు చేయడానికి కారణమేమిటన్నదానిపై పలు ఊహాగానాలు వ్యక్తమౌతున్నాయి.

కర్నూలులో జ్యుడీషియల్ అకాడమీ కోసం ఆందోళనలు చేసిన రాయలసీమ న్యాయవాదులు దానిని మంగళగిరికి తరలించేసినా ఎందుకు కిమ్మనడం లేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అసలు విషయమేమిటంటే హైకోర్టుతో సంబంధం లేకుండా జగన్ సర్కార్ కర్నూలులో జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటు అంటూ జీవో జారీ చేసేసింది. అయితే కర్నూలలో జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటుకు హైకోర్టు అనుమతి ఇవ్వలేదు.. అది మంగళగిరిలో మాత్రమే ఏర్పాటు చేయాలని విస్పష్టంగా తేల్చి చెప్పేసింది. దీంతో జగన్ సర్కార్ మరో గత్యంతరం లేక పాత జీవోను రద్దు చేసి మంగళగిరిలో జ్యుడీషియల్ అకాడమీ అంటూ తాజాగా మరో జీవో జారీ చేసింది.

వైసీపీ పెద్దలు తల నిలువుగా ఊపితే ఆందోళనలు, అడ్డంగా ఊపితే నిశ్శబ్దం పాటించే అనుయాకులు.. ఈ జీవో విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు మౌనం వహిస్తున్నారు. ఇప్పటికే సుప్రీం కోర్టుకు జగన్ సర్కార్ కర్నూలులో హైకోర్టు ప్రశక్తే లేదని తేల్చి చెప్పేసింది. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికీ.. ప్రాంతీయ విభేదాలు సృష్టించి లబ్ధి పొందడానికి మాత్రమే మూడు రాజధానుల జపం చేస్తున్నదన్న విషయం జ్యూడీషిల్ అకాడమీ జీవోతో మరో సారి తేటతెల్లమైంది. 

By
en-us Political News

  
దీపావళి పండుగ వేళ ఛత్తీస్‌గఢ్‌లో అత్యంత హృదయ విదారకరమైన ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది.
ఇటీకాల కాలంలో టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులతో పాటు ఉద్యోగుల పని వాతావరణంలోనూ విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
పండుగ వేళ నగరంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తెలుగు రాష్ట్రాల ప్రజలను వాతావరణ శాఖ మరోసారి అప్రమత్తం చేసింది.
హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల వేళ అపశ్రుతి చోటుచేసుకుంది.
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.