స్వాహాయజ్ణంలో జగన్ సర్కార్ స్టైలే వేరు!

Publish Date:Jul 14, 2023

Advertisement

వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ రాష్ట్రంలో ఆర్థిక  నిర్వహణ అస్తవ్యస్థంగా తయారైంది. ఏ ప్రాజెక్టు తీసుకున్నా, ఏ పథకాన్ని చూసినా అవినీతే రాజ్యమేలుతోంది.  దోపిడీ కోసం ఏకంగా కార్పొరేషన్ ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో రుణాలు తీసుకోవడం గతంలో ఎన్నడూ చూడని కొత్త స్టైల్.   ప్రభుత్వ తాజాగా రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో భారీ దోపిడీకి పాల్పడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

కరువు నివారణ అంటూ కార్పొరేషన్ పేర అప్పులు తీసుకువచ్చి ఆ రుణాల సొమ్మును ప్రైవేటు ఖాతాలకు మళ్లించారంటూ తెలుగుదేశం సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఒక్క ఈ రూపేణా దాదాపు 900 కోట్ల రూపాయలు దారి మళ్లాయని కేశవ్ ఆరోపిస్తున్నారు. నిధుల దోపిడీ విషయంలో ఏపీ సర్కార్ కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. అప్పుల సొమ్ముతోనూ స్కామ్ చేయడం ఒక్క జగన్ సర్కార్ కే చెల్లిందని పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ చైర్మన్ కూడా అయిన పయ్యావుల కేశవ్ అన్నారు.  గురువారం (జూలై 13)  విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన పయ్యావుల కేశవ్  రుణాల సొమ్ముదారి మళ్లింపు స్కాంపై  సీబీఐ విచారణ కు డిమాండ్ చేశారు. రాయలసీమలో కరువు నివారణ కోసం అంటూ ఏర్పాటు చేసిన కార్పొరేషన్ పేరుతో ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ నిమిత్తం అప్పు చేసింది. అసలా పనులు చేపట్టకుండానే.. పూర్తై పోయాయని చెబుతున్నారు.  తీసుకున్న రుణానికి చెల్లింపులూ జరిపేస్తున్నారు. ఆ రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది.

అ రుణం 900 కోట్ల రూపాయలూ నేరుగా కాంట్రాక్టర్ కు చెల్లించారు. విషయమేమిటంటే.. ప్రభుత్వం ఈ యేడాది మార్చి 29న బ్యాంక్ గ్యారెంటీ ఇస్తూ గెజిట్ జారీ చేస్తే మూడు రోజుల్లో రుణం మంజూరైపోయింది.  అయితే ఆ సొమ్ములు కార్పొరేషన్ ఖాతాలోకి రాకుండానే నేరుగా కాంట్రాక్టర్ కు బదలీ అయిపోయాయి. ఏ పనుల నిమిత్తం అయితే రుణం తీసుకున్నారో ఆ పనులు జరగనే లేదు. అయినా పనులు పూర్తైపోయాయంటూ సర్కార్ సర్టిఫై చేసేసింది. అప్పుల సొమ్మును కూడా స్వాహా చేసే భారీ కుంభకోణం జగన్ సర్కార్ లో జరుగుతోందనీ.. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలనీ పయ్యావుల కేశవ్ డిమాండ్ చేస్తున్నారు.  

  ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకున్న రుణం ప్రభుత్వ ఖాతాలో జమ కాకుండానే  నేరుగా కాంట్రాక్టర్ కు చెల్లింపు అయిపోయింది. ఇప్పుడీ రుణాన్ని ప్రభుత్వ తన ఖాతాల నుంచి చెల్లిస్తున్నది.  పయ్యావుల కేశవ్ డిమాండ్ చేస్తున్నట్లు ఈ స్కాంపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే ప్రభుత్వ అప్పుల కుంభకోణాలన్నీ బయటపడతాయని పరిశీలకులు అంటున్నారు.   అసలు జగన్ ప్రభుత్వాన్ని నడపడానికి పూర్తిగా అప్పులపైనే ఆదారపడుతున్నారు. దశలవారీ సంపూర్ణ మద్య నిషేధం అంటూ ప్రారంభించి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుని మరీ అప్పులు తీసుకువస్తున్నారు. భవిష్యత్ లో మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకువస్తున్నారు.

తాజాగా మద్యం తాకట్టు ద్వారా మరో 8 వేల కోట్ల రూపాయల రుణం తీసుకోవడానికి రెడీ అయిపోయారు.  మొత్తంగా ఒక్క చాన్స్ అభ్యర్థనతో అధికారంలోకి వచ్చిన జగన్ మరో చాన్స్ దక్కదన్న నిర్ణయానికి వచ్చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనిపిస్తోందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.  మొత్తం రుణాలతో ప్రభుత్వాన్ని నడుపుతూ  రాష్ట్ర అభివృద్ధిని పాతాళానికి పంపేశారన్న విమర్శలు వినవస్తున్నాయి. 

By
en-us Political News

  
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి
ప్రస్తుత సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.
పెరిగిన నిత్యావసరాలు నిర్మాణ సామగ్రి ధరలతో సామాన్యులకు సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ఒక కష్టతరమైన సవాలుగా మారుతున్న తరుణంలో
తెలంగాణలో రూ.96 కోట్ల ప్రభుత్వ నిధులకు గండి.!
ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసి బస్సులో చిన్నపాటి చిల్లర గొడవ కాస్తా ఊహించని సంఘటనకు దారితీసింది.
గంటకు 140 కి.మీ వేగంతో పెనుగాలులు..అప్రమత్తమైన యంత్రాంగం.!
ఒకవైపు ధరల మంట.. మరోవైపు కృత్రిమ కొరతలు..!
హైదరాబాద్ మహానగరంలో మరోసారి తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.