అబద్ధాలు రుజువైపోయి అభాసుపాలు..!

Publish Date:Jun 26, 2022

Advertisement

అబద్ధాలాడేవారికి జ్ణాపక శక్తి ఎక్కువ ఉండాలి. అందులో రాజకీయ నాయకులైతే మరీ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఏ విషయంలో ఏ అబద్దమాడారో మరచిపోతే.. వారి బండారం బయటపడి అభాసుపాలౌతారు. ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ నేతల పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. ఆడిన మాటలన్నీ అబద్ధాలని తేలిపోయి ప్రజలలో పలుచన అవుతున్నారు. చులకన అవుతున్నారు. ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉంది. అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన చేసిన వాగ్దానాలు, విమర్శలు అన్ని ఇప్పుడు బూమరాంగ్ అయి.. ఆయన అబద్ధాల పాలనను వెక్కిరించే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా అమరావతి విషయంలో జగన్, ఆయన మంత్రివర్గ సహచరులు వివిధ సందర్భాలలో చెప్పిన మాటలు అబద్ధాలని ఇప్పుడాయన సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలతోనే తేటతెల్లమైపోతోంది.

దీంతో జనంలో జగన్ ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది. విపక్షంలో ఉన్నప్పుడు జగన్ నిండు అసెంబ్లీలో రాజధానిగా అమరావతికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఆ తరువాత గత ఎన్నికల ప్రచారంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని నమ్మ బలికారు. ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టగానే మూడు రాజధానులంటూ అమరావతిని పక్కన పెట్టేశారు. రాష్ట్ర రాజధాని కోసం భూములిచ్చిన రైతులను నానా యాతనా పెట్టారు. చారిత్రక న్యాయపోరాటం ద్వారా వారు ప్రభుత్వంపై విజయం సాధించినా.. కోర్టు తీర్పు అమలులో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.

గత మూడేళ్లుగా జగన్ సర్కార్ అనుసరించిన అస్తవ్యస్త ఆర్థిక విధానాల కారణంగా రాష్ట్రం దివాళా స్థితికి చేరుకుంది. ఎక్కడా అప్పుపుట్టని పరిస్థితుల్లో మళ్లీ అమరావతే ఆదుకుంటుందని జగన్ భావిస్తున్నారు. ఈ లోగా ఈ మూడేళ్లలో జగన్ కానీ, ఆయన పార్టీ నేతలకు కానీ అమరావతిపై చేసిన వ్యాఖ్యలు, విమర్శలూ ఇన్నీ అన్నీ కావు. ఒక పథకం ప్రకారం అమరావతి అభివృద్ధిని నిర్వీర్యం చేసిన జగన్ సర్కార్.. ఇప్పుడు గత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ఆదాయంగా మార్చుకునేందుకు నడుం బిగించింది.

గతంలో అమరావతిని స్మశానం గా అభివర్ణించిన జగన్ సర్కారే ఇప్పుడు ఆ భూములనే బంగారు బాతుగుడ్లుగా గుర్తించి వాటిని వేలం వేసి ఆదాయాన్నిసమకూర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు గ్రాఫిక్స్ అంటూ ఎకసెక్కాలాడిన భవనాలనే ఇప్పుడు లీజుకు ఇచ్చి ఆర్థిక ఊరట పొందాలని నిర్ణయించుకుంటున్నది. దీంతో వైకాపా సార్కార్, ముఖ్యమంత్రి, వైసీపీ నేతలు అమరావతిపై గతంలో చేసిన వ్యాఖ్యలు, విమర్శలూ అబద్ధాలని రాష్ట్రప్రజలకు తేటతెల్లమైంది. దీంతో జగన్ ప్రతిష్ట మసకబారింది. గతంలో అమరావతి భవనాలను గ్రాఫిక్స్ అని ఎద్దేవా చేసిన జగన్ ఇప్పుడు వాటిని లీజుకు ఇవ్వడం ద్వారా మంచి ఆదాయం వస్తుందన్న సీఆర్డీయే ప్రతిపాదనకు ఆమోదించడం ద్వారా తాను నాడు గ్రాఫిక్స్ అంటూ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని ఇప్పుడు స్వయంగా అంగీకరించినట్లైంది.

గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన పలు టవర్లు, భవనాలను ఇంత కాలం నిరుపయోగంగా ఉంచేసిన జగన్ సర్కార్ ఇప్పుడు వాటినే ఆదాయ వనరులుగా గుర్తించారు. ఉద్యోగుల కోసం గత సర్కార్ నిర్మించిన భవనాలను ఉద్యోగులకు కేటాయించకుండా ప్రైవేటు  సంస్థలకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. భవనాల లీజు ద్వారా ఏడాదికి పదికోట్లు ఆర్జించడానికి రెడీ అయిపోయింది. అమరావతిలో తెలుగుదేశం చేపట్టినట్లు చెబుతున్న పనులన్నీ గ్రాఫిక్సేనని ప్రచారం చేసిన జగన్ సర్కార్ ఇప్పుడా ‘గ్రాఫిక్ భవనాల’నే అవసరానికి వాడుకుంటోంది.

స్మశానం అంటూ నిందించిన నోటితోనే అమరావతి భూముల విక్రయానికి రెడీ అయిపోతోంది. ఇప్పుడు జనం జగన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం   చేయడమే కాదు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధిని నిర్వీర్యం చేయకుండా ఉండి ఉంటే.. అప్పుడు జరిగిన అభివృద్ధిని కొనసాగించి ఉంటే ఇప్పుడు రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉండేది కాదు కదా అని నిలదీస్తున్నారు. యథా ప్రకారం జగన్ ప్రభుత్వం నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు, అధికారంలో ఉన్న మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు, విమర్శలు చేస్తే దులిపేసుకు ముందుకు పోతాం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. 

By
en-us Political News

  
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.