ఆర్భాటంగా ప్రకటనలు.. అమలు చేయలేక ఆపసోపాలు!

Publish Date:Nov 1, 2022

Advertisement

జగన్ ముఖ్యమంత్రి ఈ మూడున్నరేళ్లలో చేసినది ఆర్భాటంగా నిర్ణయాలు తీసుకోవడం.. వాటి పర్యవసానాలు ఎదుర్కోలేక అభాసుపాలై ఆపసోపాలు పడటం మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజా వేదికను కూల్చడంతో మొదలైన జగన్ విధ్వంస పాలన మూడేళ్లుగా ఎన్నో మొట్టికాయలు తిన్నా అప్రతిహాతంగా కొనసాగుతూనే ఉంది. అక్రమ కట్టడం అంటూ ప్రజావేదికనైతే కూల్చేశారు కానీ.. ఆ ప్రజా వేదిక అక్రమకట్టడం అని ఇప్పటి వరకూ అక్రమకట్టడం అని నిరూపించడం అయితే కాలేదు.

ముందు కానిచ్చేస్తే.. ఆ తరువాత ఏం జరిగినా ఎవరూ పీకేదేం లేదన్న విధానంతో జగన్ సర్కార్ ముందుకు పోతోందని అంటున్నారు. రిషికొండ తవ్వకాల విషయంలో కూడా జగన్ సర్కార్ అదే తీరును అవలంబిస్తోందని గుర్తు చేస్తున్నారు. కోర్టు కూడదన్నా తవ్వకం పనులు యథేచ్ఛగా సాగించడం.. పర్యావరణ విధ్వంసానికి వెనుకాడకపోవడాన్ని ఈ సందర్భంగా రాజకీయ వర్గాలు ఉదహరిస్తున్నాయి. అడవుల విధ్వంసంపై న్యాయస్థానం కన్నెర్ర చేస్తే ధ్వంసం చేసిన అడవుల స్థానంలో మళ్లీ అడవిని పెంచుతామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పడాన్ని తెంపరితనంగా అభివర్ణిస్తున్నారు.

విధ్వంసం విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కు వేయని జగన్.. ప్రభుత్వ నిర్ణయాల అమలు విషయంలో మాత్రం ప్రతిసారీ మడమ తిప్పుతున్నారు.. మాట తప్పుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ విశాఖలో ఫ్లెక్సీల పై నిషేధం అంటున్నారు. ఇటీవల జగన్ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖలో అపరిమితంగా అడ్డూ అదుపూ లేకుండా వెలసిన ఫెక్సీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఊరుకోకుండా తక్షణమే విశాఖలో ఫ్లెక్సీలపై నిషేధాన్ని అమలు చేసినట్లు ప్రకటించారు.

ఈ తక్షణం ఇప్పటి వరకూ రాలేదు. నవంబర్ 1 లోగా ఫెక్సీలపై నిషేధం ఉత్తర్వులు ఇస్తామని ఒకసారి.. ఆ తేదీ వచ్చేసరికి నిషేధం జనవరి నుంచి అంటూ మరోసారి మడమ తిప్పేసి మాట మార్చేశారు

జగన్. ముందు చూపు లేకుండా నిర్ణయాలు ప్రకటించడం.. ఆ తరువాత మిన్నకుండిపోవడం ఒక అలవాటుగా జగన్ సర్కార్ వ్యవహరిస్తున్నది. అప్పటికప్పుడు నోటికి తోచిన ప్రకటన చేయడం... ఆ ప్రకటన ప్రకారం చర్యలు తీసుకోలేక, కార్యాచరణలో పెట్టలేక అభాసుపాలు కావడం.. మాట మార్చడానికి ఆపసోపాలు పడటం ఇదే మూడున్నరేళ్లుగా జగన్ సర్కార్ అవలంబిస్తున్న విధానమంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.