అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు.. జగన్ సర్కార్ దౌర్జన్యం!

Publish Date:Dec 19, 2023

Advertisement

తనను వ్యతిరేకిస్తే సహించలేని తత్వం జగన్ ది. వ్యతిరేకులపై హింసకు పాల్పడటం, కేసులు బనాయించడం, జైల్లోకి నెట్టి వేధించడం మాత్రమే ఏపీ సీఎం జగన్ కు తెలిసిన విద్య. జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో ఇది పలు సందర్భాలలో నిరూపితమైంది.  ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి   ఎందరో జగన్ సర్కార్ చిత్రహింసలకు గురయ్యారు. వేధింపులను ఎదుర్కొన్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ఇళ్లు కోల్పోయారు.  అదంతా ఒకెత్తైతే.. చివరికి ప్రభుత్వంలో భాగమైన శాఖల ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించమని డిమాండ్ చేసినా  దౌర్జన్యానికి పాల్పడటం  మరోకెత్తు. అప్పుడెప్పుడో కరోనా సమయంలో మాస్కులు లేవు, పీపీఈ కిట్లు లేకుండా ఎలా వైద్యం చేయాలని ఓ దళిత వైద్యుడు ప్రశ్నిస్తే ఏమైందో తెలిసిందే కదా.

ఇప్పుడు  అంగన్వాడీలపై కూడా జగన్ సర్కార్ అదే  దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తుంది. తమ సమస్యలు పరిష్కారం డిమాండ్‌తో అంగన్‌వాడీలు  సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం (డిసెంబర్ 19) నాటికి ఈ సమ్మె ఎనిమిదో రోజుకు చేరింది. ప్రభుత్వం అంగన్‌వాడీలపై వివిధ రూపాల్లో ఒత్తిళ్లు చేస్తున్నప్పటికీ పట్టు విడవకుండా ఆందోళనను కొనసాగిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను మూసేసి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాల ముందు టెంట్‌లు వేసుకుని ఆందోళన చేస్తూ సమ్మె కొనసాగిస్తున్నారు.

అయితే  గత ఏడు రోజులుగా ప్రభుత్వం ఎన్నో విధాలుగా అంగన్వాడీలను తమ దారికి తెచ్చుకోవాలని చూసింది. విధుల నుండి తప్పిస్తామని హెచ్చరికలు, చర్యలు తీసుకుంటామని ఒత్తిళ్లు తెచ్చినా అంగన్వాడీ వెనక్కు తగ్గలేదు. దీంతో  ప్రభుత్వం దౌర్జన్యానికి తెగబడింది. ముందుగా ఐసీడీఎస్‌ అధికారులు , చివాలయ సిబ్బందితో బలవంతంగా అంగన్‌వాడీ కేంద్రాలను తెరిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో మంగళవారం ఉదయం నుండే ఈ పని మొదలు పెట్టారు. ఎక్కడిక్కడ రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాల తాళాలను బద్దలు కొట్టి తెరిపిస్తున్నారు. అంగన్వాడీలలో స్టాక్ లెక్కలు తేల్చి.. పెండింగ్ స్టాక్ లబ్ది దారులకు సచివాలయ సిబ్బంది చేత పంపిణీ చేయిస్తున్నారు.  అలాగే సచివాలయ సిబ్బంది  మధ్యాహ్న భోజనాన్ని వండి పెట్టాలని ఆదేశిస్తున్నారు.

ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటికే పలు కేంద్రాలను ఇలా బలవంతం తెరవగా.. పలుచోట్ల స్థానికులు అడ్డుతగలడంతో అధికారులు వెనక్కు తగ్గాల్సి వచ్చింది. కాగా, పలు కేంద్రాలలో స్టాక్ లెక్కలు చూపించి అంగన్వాడీలపై చర్యలకు ఉపక్రమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. సమ్మెకు దిగడంతో అంగన్ వాడీలపై జగన్ సర్కార్ కక్షకట్టి దొంగ లెక్కలతో వారిపై చర్యలకు దిగేందుకు ఇలా తాళాలు బద్దలు కొట్టి కేంద్రాలను తెరిచినట్లు అంగన్వాడీలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వమే ఇలా ప్రభుత్వ భవనాల తాళాలు బద్దలు కొట్టడం చరిత్రలో ఇదే ప్రథమనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంగన్వాడీలతో చర్చలు జరిపి వారి సమస్యలను తీర్చేందుకు ప్రయత్నించాల్సిన ప్రభుత్వం ఇలా దౌర్జన్యాలకు దిగడం సిగ్గుచేటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీతాల పెంపు, ఫేస్‌యాప్‌ విధానం రద్దు, ఉద్యోగ భద్రత, పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని, గ్రాట్యూటీ, పెన్షన్‌ అమలు చేయాలని అంగన్వాడీలు కోరుతున్నారు. నిజానికి ఇందులోవన్నీ జగన్ గతంలో ఇచ్చిన హామీలే. ఇప్పుడు వీరు ఆ హామీలను అమలు చేయాలని కోరుతున్నారు.

అయితే, ప్రభుత్వం మాత్రం హామీలను అమలు చేయకపోగా.. తిరిగి వారిపైనే దౌర్జన్యాలకు దిగుతున్నది. గత రెండేళ్లుగా అంగన్వాడీ ఆయాలను నియమించడం లేదు. అంతకుముందున్న వారు వ్యక్తిగత కారణాలతో, వృద్దులై కొంతమంది ఆయాలుగా మానేశారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కానీ, ఆయాల పని కూడా అంగన్వాడీలే చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది. దీంతో చాలా చోట్ల మధ్యాహ్న భోజనం అటకెక్కింది. ఇప్పుడు అలాంటి ఆయాలే లేని కేంద్రాలలో సచివాలయ సిబ్బందే వండి పెడతారా అన్నది చూడాల్సి ఉంది. ఇక, ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా అంగన్వాడీలు హాజరవ్వాలని ఆదేశాలివ్వడం, జన సమీకరణకు వారికే టార్గెట్లు పెట్టడంతో వీరంతా విసిగిపోయారు. ఏది ఏమైన తమ డిమాండ్లు నెరవేర్చకపోతే పనిచేయలేమని తెగేసి చెప్తూ అంగన్ వాడీలు సమ్మెకు దిగారు. అయితే, ప్రభుత్వం మాత్రం డిమాండ్లను పరిష్కరించకుండా ఇలా తిరిగి వారిపైనే దౌర్జన్యాలకు దిగుతున్నది. ఇప్పుడు పలు విధాలుగా వారిని వేధించేందుకు కూడా ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది.  దీనిపై  అంగన్వాడీలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

By
en-us Political News

  
మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేసిందన్నారు. విపక్షాలు సమష్టిగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోడీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారన్నారు. అందుకే ఆయన తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారన్నారు.
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.