జగన్ సర్కార్ కేంద్రం మధ్య బియ్యం లొల్లి

Publish Date:Jul 21, 2022

Advertisement

వైసీపీ, బీజేపీ సయోధ్యకు ఫుల్ స్టాప్ పడింది. అందుకు తార్కానాలు ఒక్కటొక్కటిగా  బయటపడుతున్నాయి. నిన్న కాక మొన్న అఖిల పక్షంలో ఏపీ అప్పులను వేలెత్తి చూపిన కేంద్రం ఇప్పుడు కేంద్రం అందిచే ఉచిత బియ్యం పంపిణీ ఏపీలో నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఈ ఉచిత బియ్యం పంపిణీ గత నాలుగు నెలలుగా నిలిచిపోయినా ఇప్పటి వరకూ కిమ్మనని కేంద్రం.. రాష్ట్ర పతి ఎన్నిక ముచ్చట ముగియగానే వైసీపీ సర్కార్ పై బియ్యం పంపిణీ నిలిపివేతపై సీరియస్ అయ్యింది.

బియ్యం లేవన్న సాకుతో ఏపీ సర్కార్  ఏప్రిల్, మే, జూన్ నెలలలో ఉచిత బియ్యం పంపిణీ నిలిపివేసింది. ఇప్పుడు జూలై నెలలో కూడా పరిస్థితి అదే. ఉచిత బియ్యం పంపిణీ నిలిపివేతపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా ఇంత కాలం కిమ్మనకుండా ఊరుకున్న కేంద్రం ఇప్పుడు మాత్రం సీరియస్ గా తీసుకుంది. మరో వైపు ఏపీ బీజేపీ నాయకులు కూడా స్వరం పెంచి విమర్శల తీవ్రతను పెంచారు. అక్కడితో ఊరుకోకుండా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. కేంద్రం పేదల కోసం ఉచితంగా బియ్యం అందిస్తుంటే.. ఆ పేదల బియ్యాన్ని కూడా వైసీపీ సర్కార్ బొక్కేస్తోందంటూ బీజేపీ రాష్ట్ర నాయకులు చేస్తున్న విమర్శలపై జగన్ సర్కార్ స్పందించడం లేదు.

కానీ పేదల బియ్యాన్ని వైసీపీ సర్కార్ నొక్కేస్తోందన్న విమర్శల వల్ల ప్రజా వ్యతిరేకత మరింత ఎక్కువ అవుతుందన్న ఆందోళన మాత్రం వైసీపీ వర్గాలలో వ్యక్తమౌతోంది. అసలు సంగతి ఏమిటంటే కోవిడ్ తో నష్ట పోయిన ప్రజలకు కొంత ఊరట కలిగించే ఉద్దేశంతో కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కంద  ఉచిత బియ్యం పంపిణీ చేస్తోంది. 2022 మార్చితో ఉచిత పంపిణీ పథకం ముగిసినప్పటికీ దానికి కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. అంటే ఈ ఏడాది అక్టోబర్ వరకూ ఈ పథకం కొనసాగుతుంది.

అయితే  ఏపీలో మాత్రం ఉచిత బియ్యం పంపిణీ పథకం ఏప్రిల్ నుంచే నిలిచిపోయింది. వాస్తవానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడికీ 5 కిలోల చొప్పున ఈ బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. కేంద్రం నుంచి ఇందుకకోసం బియ్యం సకాలంలో ఎలాంటి జాప్యం లేకుండా రాష్ట్రానికి చేరుతోంది. అయితే జగన్ సర్కార్ మాత్రం గత నాలుగు లెలలుగా బియ్యం నిల్వలు లేవనో.. సాంకేతిక సమస్యలనో సాకులుగా చూపుతూ బియ్యం పంపిణీకి తిలోదకాలిచ్చేసింది.  దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో సవ్యంగా ఉచిత బియ్యం పథకం అమలులో ఉన్నా, ఏపీలో మాత్రం మొండి చేయి చూపుతుండడం పట్ల   కేంద్రం సీరియస్ అయ్యింది.

ఉచిత బియ్యం పేదలకు అందించకుంటే రాష్ట్రం నుంచి ధాన్యం సేకరణతో పాటు బియ్యం పంపిణీని సైతం నిలిపివేస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో అధికార వైసీపీని ఇరుకున పెట్టే విధంగా   బీజేపీ   రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుట్టింది. పేదల బియ్యాన్ని నొక్కేస్తున్నారని నినాదంతో నిరసన కార్యక్రమాలకు తెరలేపింది. ప్రధాని మోదీ కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఉచిత బియ్యం అందిస్తుంటే జగన్ సర్కారు అడ్డుకుంటోందని    ఇలా ఉండగా కేంద్ర  ఉచిత బియ్యం పంపీణీని నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అన్ని రాష్ట్రాల్లో అందించి ఇక్కడ మాత్రం మొండిచేయి చూపడం తగునా అని ప్రశ్నిస్తున్నారు. అటు లబ్దిదారులు సైతం ప్రభుత్వం తీరును గర్హిస్తున్నారు.

By
en-us Political News

  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.