ధర్మ విజేత అంటే ....... ?

Publish Date:Sep 26, 2013

Advertisement

 

 

 

 

....సాయి  లక్ష్మీ మద్దాల

 

 

అక్రమ ఆస్తుల కేసు విషయమై ఎట్టకేలకు 16 నెలల అనంతరం సి.బి.ఐ కోర్ట్ మంజూరు చేసిన షరతులతో కూడిన బెయిల్ పై జగన్ జైలునుండి బయటకు వచ్చాడు. ప్రస్తుత చట్టాల ఆధారంగా న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. సాక్ష్యాలను విచారించి జగన్ అక్రమ ఆస్తుల కేసులో నిర్దోషా కాదా అనేది న్యాయస్థానం నిర్ణయించ వలసి ఉంది. కేవలం బెయిల్ లభించి నంత మాత్రాన ఈ పరిస్థితులలో జగన్ ధర్మవిజేత అనటం ఎంతవరకు సమంజసం?


ఇక జగన్ బయటకు వస్తే రాజకీయాలలో చాలా మార్పులు వస్తాయి అనటం కూడా సరికాదు. ఒకసారి పార్లమెంట్ లో సమైఖ్యాంద్ర ప్లకార్డు పట్టుకొని,మరొకసారి అఖిలపక్ష సమావేశంలో విభజనకు అనుకూలంగా లెటర్ ఇచ్చి,మళ్ళి ఇప్పుడు సమైఖ్యాంద్ర కోసం సీమాన్ద్రలో ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతున్న నేపధ్యంలో మళ్ళి సమ న్యాయం అంటూ పరిపరి విధాలుగా తమ నిర్ణయాన్ని మార్చుకుంటూ తమకంటూ ఒక నిర్ణీత అభిప్రాయం లేని,వై. ఎస్.ఆర్. సి.పి ని ఏరకంగా సమైఖ్యాంద్ర కోసం చిత్తశుద్దితో ప్రయత్నిస్తుందని నమ్మాలి?నేటి ఆంధ్రప్రదేశ్ అనిశ్చిత స్థితికి కారణం జగన్ రాజకీయ పార్టీనే అని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. కేవలం జగన్ను ఎదుర్కోవటానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఈ విభజన అంశాన్ని2009 లో  తీసుకువచ్చింది అనే అభిప్రాయం చాలామంది ప్రజల మదిలో ఉంది. ఇక రాజకీయ స్వార్ధం కోసం రాజశేఖరరెడ్డి టి.డి.పి హయాం లో 41 మంది శాసనసభ్యుల సంతకాలతో విభజన అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం ముందుకు పంపారు అనే అభిప్రాయాన్ని వై.ఎస్.ఆర్.సి.పి నే ఖండించలేని పరిస్థితి ఉంది. ఇక రాజకీయ నాయకులను ప్రజలు నమ్మని ఈ పరిస్థితులలో సమైఖ్యాంద్రను తాను సాధించ గలనని జగన్ ప్రజలను ఎలా నమ్మించ గలడు?
                 

ఇక జగన్ సోదరి షర్మిల విభజన జరిగితే సమైఖ్యాంద్ర కు కట్టుబడి ఉన్నందున సీమాన్ద్రలో వై.ఎస్.ఆర్.సి.పి నే ప్రజలు గెలిపిస్తారని,తెలంగాణలో తమ తండ్రి రాజశేఖర రెడ్డి ఏవిధంగా అభివృద్ధి నిమిత్తం ఎక్కువనిధులు సీమాంద్ర ప్రాంతం కంటే వెచ్చించారో తమ వద్ద గల ఆధారాలను చూపించి తెలంగాణలో కూడా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్ప్తోంది. ఈరోజున ప్రజలకు కావల్సింది విభజన అంశం ఏరకంగా వై.ఎస్.ఆర్.సి.పి  కి ఉపయోగపడుతుంది అని కాదు, విభజన జరిగితే 2014 ఎన్నికల తరువాత కేంద్రంలో వై.ఎస్.ఆర్.సి.పి  తన వైఖరి ఎటు అని. ఈ విషయంలో జగన్ తన  వైఖరి చెప్పని పక్షంలో విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తో కుమ్మక్కు ఐన కారణంగానే జగన్ కు బెయిల్ దొరికి,జైలు నుండి బయటకు వచ్చాడని ప్రజలు భావించే ప్రమాదముంది.
                 

 2014 ఎన్నికల తరువాత కేంద్రంలో యు.పి.ఎ  ని బలపరిచే అవకాశం ఉందని  స్వయంగా వై.ఎస్.ఆర్.సి.పి  వారే  అంగీకరిస్తున్నారు. విభజన విషయం లో సీమాంద్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని భావిస్తున్నారు. వారి ఆగ్రహావేశాలను వై.ఎస్.ఆర్.సి.పి  సమైఖ్యాంద్ర నినాదంతో ఓట్లు కింద మార్చుకుని 2014 లో యు.పి.ఎ  ని బలపరిస్తే అంతకు మించిన ప్రజాద్రోహం మరొకటి ఉండదు.  

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.