జగన్ బంధువు అరెస్ట్.. పులివెందులలో కదులుతున్న జగన్ పునాదులు

Publish Date:May 9, 2022

Advertisement

వైఎస్ కుటుంబానికి పులివెందుల కంచుకోట. అక్కడి నుంచే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో చీమ చిటుక్కుమన్నా వెంటనే వైఎస్ కుటుంబానికి తెలిసిపోతుంది. అందుకే తమకు ఎదురునిలిచే నాయకుడు లేడని వైఎస్ కుటుంబం ఇంత కాలం భావించేది. వైసీపీ నేతలు కూడా పులివెందుల తమ నాయకుడికి కంచుకోట అని చెబుతూ ఉంటారు. కానీ అలాంటి చోట వైఎస్ కుటుంబ పునాదులు మెల్ల మెల్లగా కదులుతున్నాయి. ప్రజల్లో మెల్ల మెల్లగా మార్పు మొదలుకావడంతో వైసీపీ నేతల ఆగడాలకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ సమీప బంధువును పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇది రూఢీ అయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. 

పులివెందులలో ఏం చేసినా తమను అడిగే వారు లేరని వైఎస్ కుటుంబ సభ్యులు భావిస్తారు. అందుకే ఇంత కాలంగా వారి ఆగడాలకు అంతూ పొంతు లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ కుటుంబం నుంచి వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయన్నది స్థానికుల ఆరోపణ. ఇప్పుడు అలాంటి వ్యవహారంలోనే జగన్ సమీప బంధువు చక్రాయిపేట మండల వైసీపీ ఇంచార్జి కొండారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పులివెందుల - రాయచోటి వెళ్లే రహదారి పనులు చేస్తున్న ఎస్ ఆర్ కే కన్ స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ ను కమీషన్ కోసం బెదిరించాడని కొండారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. దానితో పోలీసులు కొండారెడ్డిని అరెస్టు చేశారు. ఏకంగా జగన్ కు సమీప బంధువునే పోలీసులు అరెస్ట్ చేయడంతో నియోజకవర్గంలో కొత్త చర్చ మొదలైంది. అధికార పార్టీ నేత, అందులోనూ జగన్ బంధువునే పోలీసులు కటకటాల్లోకి నెట్టడంతో వైసీపీ నేతలు కూడా పులివెందులలో వైఎస్ కుటుంబ హవాకు బ్రేక్ పడుతోందా అన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. 

నిజానికి జగన్ 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన తర్వాత నుంచి జగన్ కు, ఆయన కుటుంబీకులకు పులివెందులపై పట్టు సడలడం ప్రారంబమైందనే చెప్పాలి. ముఖ్యంగా గత ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో దీనికి బీజం పడందని చెప్పవచ్చు.    వైఎస్ వివేకానందరెడ్డి హత్య, ఆ తరననంతర సంఘటనల్లో పులివెందుల ప్రజలలో వైఎస్ జగన్ పట్ల వ్యతిరేకత ప్రారంభమైందని స్థానికులు చెబుతున్నారు.   సొంత బాబాయ్ మర్డర్ కేసు విషయంలోనూ జగన్ ఏ మాత్రం శ్రద్ధ చూపకపోవడం, పైపెచ్చు హత్య ఆరోపణలు ఎదుర్కొటున్న వారిని వెనకేసుకు రావడం, అలాగే సోదరి, తల్లి పట్ల సీఎం అయిన తరువాత జగన్ చూపుతున్న నరాదరణ పులివెందుల ప్రజలలో జగన్ తీరు పట్ల అయిష్టత పెరగడానికి కారణమయ్యాయంటున్నారు.   మరోవైపు జగన్ సమీప బంధువులే ప్రజలు, కాంట్రాక్టర్లు, అధికారులను వేధిస్తున్నారనే అపవాదు కూడా ఉంది.  ఆ కారణంగానే పులివెందులలో జగన్ పునాదులు కదులుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.