అంద‌రికీ హ్యాండిచ్చిన‌ జ‌గ‌న‌న్న‌.. ఎన్నిక‌ల్లో దిక్కెవ‌రు?

Publish Date:Mar 23, 2022

Advertisement

అందలం ఎక్కాడమ్మా  అందకుండా పోయాడమ్మా..  అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి ఉందనే ఓ టాక్ అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అవుతోంది. రానున్నది ఎన్నికల సీజన్. ఈ నేపథ్యంలో మళ్లీ అధికారంలోకి రావాలంటే మాత్రం ఆచీ తూచీ మరీ అడుగులు వేయాలి. అందుకు వైయస్ జగన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే చర్చ అయితే తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా మస్త్ మస్త్‌గా నడుస్తోంది. ఆ క్రమంలోనే సీఎం జగన్.. తన కేబినెట్‌ను మార్చాలని నిర్ణయించారని.. అందుకు ఉగాది రోజుని ఫిక్స్ చేశారనే సమా చారం.  

అంత వరకు ఓకే కానీ.. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రచార బాధ్యతలు చేపట్టే వారు ఎవరంటే... మాత్రం కనుచూపు మేరలో ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదని.. ఫ్యాన్ పార్టీలోని లీడర్ నుంచి క్యాడర్ వరకు అందరి మధ్య ఓ చర్చ అయితే హాట్ హాట్‌గా నడుస్తోంది. గతంలో అంటే వైయస్ఆర్ ఆకస్మిక మృతి తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైయస్ జగన్‌కు అండ దండ... గా ఆయన తల్లి వైయస్ విజయమ్మ, సోదరి వైయస్ షర్మిల నిలబడ్డారు. పరోక్షంగా వైయస్ జగన్ బావా బ్రదర్ అనిల్ సైతం మద్దతు ఇచ్చారన్న సంగతి అందరికీ తెలిసిందే. 

కానీ నేడు ఆ పరిస్థితి అయితే లేదు. వైయస్ జగన్ సీఎం అయిన తర్వాత.. చోటు చేసుకున్న పరిణామాలన్నీ అందరికీ తెలిసినవే. వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపించి.. హైదరాబాద్ లోటస్ పాండ్ వేదికగా రాజకీయం చేస్తూ.. అక్కడ అధికారం అందుకునేందుకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దీంతో వీరిద్దరు .. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు బాగా దూరం జరిగినట్లేనని అందరికీ అర్థమవుతోంది.  

మరోవైపు ఏపీ సీఎం బావా బ్రదర్ అనిల్ కూడా కొత్త పార్టీ పెట్టి.. బావమరిది వైయస్ జగన్‌కు చెక్ పెట్టేందుకు తన వంతు ప్రయత్నాలకు ఇప్పటికే ఆయన శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు వైయస్ వివేకా హత్య నేపథ్యంలో పులివెందులలోని వైయస్ ఫ్యామిలీ అంతా.. వైయస్ సునీత వైపు ఉంటే.. ఈ హత్యలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైయస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డి వైపు సీఎం వైయస్ జగన్ ఉన్నారనే టాక్ అయితే రాష్ట్రంలో గట్టిగానే ఉంది. దీంతో వైయస్ జగన్‌కు వైయస్ ఫ్యామిలీ నుంచి మద్దతే కాదు.. ప్రచారం కూడా చేయరనే చర్చ కూడా గట్టిగానే సాగుతోంది.  

ఇక 2019 ఎన్నికలకు ముందు టాలీవుడు నటీనటులలో చాలా మంది వైయస్ జగన్‌ గెలుపు కోసం అలా ఇలా కాదు ఓ రేంజ్‌తో ప్రచారం చేశారు. ఆ తర్వాత వారంతా సీఎం జగన్‌కే కాదు పార్టీకి సైతం దూరమైయ్యారు. అలీ, పోసాని కృష్ణ మురళీ, 30 ఈయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ వగైరా వగైరా మాత్రం సీఎం జగన్‌తో టచ్‌లో ఉన్నారన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. 

మీగతా వారు .. అంటే జీవితా రాజశేఖర్, తనీష్, కొన వెంకట్, మంచు ఫ్యామిలీ, కృష్ణుడు, జయసుధ తదితరులంతా.. వైయస్ జగన్‌కు చాలా చాలా దూరంగానే జరిగారని సమాచారం. జీవితా రాజశేఖర్ అయితే గతంలోనే కమలం గూటిలోకి చేరిపోయారు. ఇక జయసుధ.. సైలెంట్ అయిపోయారు. తనీష్, కృష్ణుడు తెరమరుగయ్యారు. ఇక మంచు ఫ్యామిలీలోని మోహన్ బాబు.. ఇటీవల హాట్ హాట్ కామెంట్స్ చేసిన విషయం విదితమే. 

ఇంకో వైపు సినిమా టికెట్ల ధరల తగ్గింపు విషయంలో వైయస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై టాలీవుడ్ అంతా గుర్రుగా ఉంది. అలాంటి పరిస్థితిలో రానున్న ఎన్నికల వేళ... టాలీవుడ్ నుంచి ఎవరు ముందుకు వచ్చి మరీ జగన్ కోసం ప్రచారం చేస్తారనే చర్చ అయితే చిత్ర పరిశ్రమలో చాలా రంజుగా సాగుతోంది. ఓ వేళ.. ఎవరైనా జగన్ తరఫున ప్రచారం కోసం వెళ్లితే.. ఆ తర్వాత వారి భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న కూడా సదరు చిత్ర పరిశ్రమలో ఉత్పన్నమవుతోందనే చర్చ కూడా తాజాగా ఫిలింనగర్‌లో నడుస్తోంది. ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల వేళ.. జగన్ కోసం ప్రచారం చేయాలంటే.. ఆర్కే రోజా, ఆలీ, పోసాని కృష్ణమురళీ, పృద్శీ రాజ్ కన్‌ఫార్మ్ అని తెలుస్తోంది. మరి వీరి ప్రచారంతోనే వైయస్ జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేస్తారా ? అంటే మాత్రం.. అదీ సందేహమే. 

ఎన్నికల్లో గెలుపంటే.. ఒక్కరితోనో ఇద్దరితోనే కలి ప్రచారం చేస్తే వచ్చేది కాదు.. అది ఓ సమిష్టి కృషి.. అందుకు 2019 ఎన్నికలే ఉదాహరణ. ఈ ఎన్నికల వేళ.. ప్రశాంత్ కిషోర్, వైయస్ జగన్, వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిల, బ్రదర్ అనీల్, టాలీవుడ్ చిత్ర పరిశ్రమ.. ఇలా ఇతరత్రా ఇతరత్రా అంతా కలిసి ప్రచారం చేయడంతో.. ఓట్లు గంపగుత్తిగా ఫ్యాన్ పార్టీకి వచ్చి పడ్డాయి. దాంతో జగన్ గెలుపు నల్లేరు మీద నడక అయింది. కానీ నేడు వీరంతా... వైయస్ జగన్ వెంట ఉన్నారా అంటే అదీ లేదు. మరి  2024 ఎన్నికల వేళ.. ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఏమిటంటే.. అంటే అదీ ఆ జగనన్నకే ఎరుక... అని ఆ పార్టీలోనే ఓ వర్గం పేర్కొనడం గమనార్హం.

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.