అప్పుడు 86 లక్షలు.. ఇప్పడు 45లక్షలు! మడమ తిప్పిన జగన్ రెడ్డి..
Publish Date:Jun 8, 2021
Advertisement
ప్రభుత్వాలు మారితే, రాష్ట్ర జనాభా మారుతుందా? రాష్ట్రంలో వివిధ వృత్తులపై ఆధారపడి జీవించే వారి జనాభా మారిపోతుందా? అప్పుడున్న రైతుల్లో సగంమంది ఇప్పడు మాయమై పోతారా? అంటే అవుననే అంటోంది,ఘనతవహించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డి, అనేక సందర్భాలలో రైతుల పేరున దీక్షలు చేశారు. అసెంబ్లీలో, బయట రైతుల సమస్యలపై ప్రసంగించారు. ఈ అన్ని సందర్భాలాలో రాష్ట్రంలోని 86 లక్షల మంది రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్ చేశారు. అనే రాష్ట్రంలో రైతుల జనాభా 86 లక్షలని, ఆయనే చెప్పారు. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచియన్ తర్వాత, ఓ వంక తమది రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పుకుంటూనే రాష్ట్రంలో రైతుల సంఖ్యను సగానికి సగం తెగ నరికేసింది. రాష్టంలో ఇప్పుడున్న రైతులు 45 లక్షల మందే అన్నట్లు లెక్కలు చూపుతోంది.అంటే, 40 లక్షల మంది రైతులను రైతులుగానే గుర్తించడం లేదు. ఇదీ, ప్రభుత్వం చేసున్న మోసంచేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం కాదని, రైతు ద్రోహ ప్రభుత్వమని,బీజేపీ ఆరోపించింది. రైతుల పట్ల జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మంగళవారం బీజేపే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు నిర్వహించింది. పార్టీ నేతలు , కార్యకర్తలు ఇళ్ళ వద్దనే దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి అనతపురంలో ఈ విమర్శ చేశారు. నిజానికి,జగన్ రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేయడం మాత్రమే కాదు. వ్యవసాయా రంగాన్నే నిర్వీర్యం చేస్తోంది.ఆంధ్ర ప్రదేశ్ జీవధార పోలవరం పనులు ఎక్కడి వక్కద ఆగిపోయాయి. రాజధాని రైతుల అందోళన 600 రోజులకు చేరుకుంటోంది అయినా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాజధాని ప్రాంతంలోని అసైన్డ్ రైతులకు ఇవ్వవలసిన కౌలుపైకం ఇవ్వడం లేదు. ప్రభుత్వం అంటే అప్పులు చేయడం, పంచి పెట్టడం... అన్నట్లుగానే పరిపాలన సాగుతోంది. నిజనికి ఒక వ్యసాయ రంగం మాత్రమేకాదు..,. అన్ని రంగాలదీ అదే పరిస్థితి.
http://www.teluguone.com/news/content/jagan-reddy-govt-cheating-farmers-25-117210.html





