ఏబీవీపై కక్ష సాధింపే ముఖ్యం.. అందుకు సుప్రీం కోర్టు తీర్పునైనా ధిక్కరిస్తాం!

Publish Date:May 17, 2022

Advertisement

జగన్ విపరీత మనస్తత్వానికి ఏబీవీ విషయంలో అనుసరిస్తున్న వైఖరే తాజా నిదర్శనం. కక్ష సాధింపు మనస్తత్వం జగన్ ది అని ఏబీవీ విషయంలో ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న తీరే చెబుతుంది. ఏబీవీ సస్పెన్షన్ ముగిసిందనీ, ఆయనక తక్షణం పోస్టింగ్ ఇవ్వాలని సుప్రీం కోర్టు విస్పష్ట ఆదేశాలు ఇచ్చినా జగన్ సర్కార్ ఖాతరు చేయడం లేదు. ఆయనకు పోస్టింగ్ విషయంలో కోర్టు ధిక్కరణ నేరాన్ని ఎదుర్కొనేందుకైనా సిద్ధపడుతోందని చెప్పకనే చెబుతోంది.

సుప్రీం కోర్టు ఆదేశాల తరువాత ఇప్పటి వరకూ రెండు సార్లు పోలీసు అధికారుల బదలీలను జగన్ ప్రభుత్వం చేపట్టింది. ఈ రెండు సార్లూ కూడా ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వలేదు.తాజాగా మంగళ వారం దాదాపు పాతిక మంది ఐపీఎస్ లను జగన్ సర్కార్ బదలీ చేసింది. ఏసీబీ డీజీపీ సహా పలువురు అధికారులను బదలీ చేసింది. వారిలో పలువురికి అదనపు బాధ్యతలూ కట్టబెట్టింది. కానీ సుప్రీం ఆదేశించినా ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు (ఏబీవీ) విషయం మాత్రం పట్టించుకోలేదు. 

సుప్రీం కోర్టు తీర్పు కాపీని తీసుకుని ఏబీవీ ఏపీ సీఎస్ ను కలిసినా ఫలితం లేకపోయింది. అసలు ఏబీవీకి అప్పాయింట్ మెంట్ ఇవ్వడానికే సీఎస్ సుముఖత చూపడం లేదు.గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీవీపై వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం పలు ఆరోపణలు చేసింది. కేసులు నమోదు చేసి సస్పెన్షన్ వేటు వేసింది. రెండేళ్లు అయినా ఆయనపై కేసులు తేలకపోవడంతో సస్పెన్షన్ ఆటోమేటిక్‌గా ముగిసిందని సుప్రీం కోర్టు చెప్పింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు తీర్పును ఖాతరు చేయడం లేదు. కోర్టు ధిక్కరణ కేసునైనా ఎదుర్కొంటా కానీ ఏబీవీపిని మాత్రం సర్వీసులోకి తీసుకోం అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.

ఇది కక్ష సాధింపు తప్ప మరొకటి కాదని విశ్లేషిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ధిక్కరణకు జగన్ సర్కార్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొన వలసి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.