ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు.. జనంలో మరింత మసకబారిన జగన్ ప్రతిష్ఠ!?

Publish Date:Jul 31, 2024

Advertisement

ఇటీవలిఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. అసలీ స్థాయి ఓటమి చవిచూడాల్సి వస్తుందని వైసీపీ ఊహించలేదు. ప్రజలు మాత్రం ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? వైసీపీ అరాచకపాలనకు చరమగీతం పాడుదామా అని ఎదురు చూశారు. ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న జనం అంటూ తెలుగువన్ కూడా వరుస కథనాలు ఇచ్చింది. జగన్ తప్ప, వైసీపీ సీనియర్లు కూడా ఓటమిని ముందే కనిపెట్టేశారు.  ఏది ఏమైనప్పటికీ ఈ స్థాయి పరాజయంతో వైసీపీ ఉనికే ప్రమాదంలో పడిందని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు. ఐదేళ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీకి ప్రస్తుత పరిస్థితి జీర్ణించుకోవడం కష్టమే. 2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి వచ్చిన ఓట్ల శాతమే 2024లో వైసీపీకి కూడా లభించింది. కాకపోతే అప్పుడు తెలుగుదేశం పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కింది.  ఇప్పుడు అంటే 2024 ఎన్నికలలో పరాజయం స్థాయి ఎంత తీవ్రంగా ఉందంటే.. వైసీపీ  కనీసం ప్రతిపక్ష హోదా లభించేందుకు అవసరమైనన్ని స్థానాలు  కూడా గెలుచుకోలేకపోయింది.  ఇలాంటి సందర్భంలో సాంప్రదాయంగా వస్తున్న నిబంధనలను అనుసరించి వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ వైసీపీ అభ్యర్థనను తిరస్కరించడం సమంజసమే.   

అయితే  తమ పార్టీకి   ప్రతిపక్ష హోదా కావాలని, తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఆయన రాజకీయ అజ్ణానాన్ని తేటతెల్లం చేస్తున్నది.   అసెంబ్లీలో జరిగే వ్యవహారాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకో వని ఒక మాజీ ముఖ్యమంత్రి కి తెలియకపోవడం నిజంగా విడ్డూరమే. ప్రతిపక్ష హోదా లేదా అధికారం ఈ రెండింటిలోనూ ఏదైనా సరే ప్రజలే ఇవ్వాలి. వారు అలా ఇవ్వలేదంటే  జనాలకు ఆ పార్టీపై సదభిప్రాయం లేదని అర్థం. ఈ విషయాన్ని మరిచిపోయి దీనిని ఒక రాజకీయ అంశంగా మార్చుకొని లబ్ది పొందాలనుకోవడం జగన్ రాజకీయ తప్పిదంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో  తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో   చేసిన తప్పిదాలే ఇప్పటి పరిస్థితికి కారణమని జగన్ గ్రహించినట్లు కనిపించదు. తన ఓటమికి ప్రజలనే తప్పుపడుతున్న ఆయన అహంకారమే.. ప్రతిపక్ష హోదా కోసం కోర్టు మెట్లేక్కేలా చేసిందని అంటున్నారు. 

పార్టీ ఘోర పరాజయానికి కారణాలపై  ఆత్మ విమర్శ చేసుకోకుండా ప్రజలను,  ఎన్నికల వ్యవస్థను నిందిస్తూ, తాను చాలా గొప్పగా పాలన సాగించానని జగన్ ఆత్మ స్థుతి చేసుకుంటున్నారు. ఇది ఆత్మవంచన తప్ప మరొకటి కాదు. ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా అసెంబ్లీకి వెళ్లి తమ అభిప్రాయాలను చెప్పుకునవకాశం ఉంటుంది. ఆ  అవకాశం అధికార పార్టీ ఇవ్వకపోతే అదే విషయాన్ని అసెంబ్లీ బయట మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరించాలి. అంతే కాకుండా.. ప్రజలు ఇవ్వని హోదాను న్యాయస్థానాలను ఆశ్రయించి దక్కించుకుందామనుకోవడం.. ప్రజల దృష్టిలో మరింత పలుచన  అవ్వడానికి దోహద పడుతుంది తప్ప మరో ప్రయోజనం సిద్ధించదు.    

శాసనసభకు హాజరై ప్రజా సమస్యలపై అవకాశం ఉన్నంత మేరకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే శాసనసభ్యుని ప్రాథమిక బాధ్యత.  ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా  తాను పులివెందుల శాసనసభ్యుడిని మాత్రమేననీ, అంతకు మించి మరే ప్రత్యేకతా తనకు లేవనీ గ్రహించి అందుకు అనుగుణంగా వ్యవహరిస్తే మేలు. 

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.