ఐదేళ్లూ కొనసాగే ధైర్యం తగ్గు! ముందస్తుకే జగన్ మొగ్గు?

Publish Date:Jul 11, 2022

Advertisement

ఏపీ సీఎం జగన్ ముందస్తుకే మొగ్గు చూపుతున్నారా? వాగ్దానాల అమలు నుంచి ప్రతి విషయంలోనూ వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకత ఆయనకు ఊపిరి సలపనివ్వడం లేదా? మిగిలిన రెండేళ్లు అధికారంలో కొనసాగితే ప్రజాగ్రహం మరింత ప్రజ్వరిల్లుతుందని భయపడుతున్నారా? అంటే పరిశీలకులు మాత్రం అవుననే సమాధానం ఇస్తున్నారు.

కేంద్రంతో అంటకాగి అప్పులు సంపాదించుకుని ఏదోలా నెట్టుకొస్తున్నా... అది మరింత కాలం కొనసాగే పరిస్థితి కనిపించడం లేదని పార్టీ శ్రేణులు సైతం అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. ఇక ప్రజా నిరసనల సెగలో మాడిపోతున్న ఎమ్మెల్యేలు, మంత్రులలో అత్యధికులు పార్టీ అధినేత తీరు పట్ల తమ వ్యతిరేకతను బాహాటంగా వెళ్లగక్కడానికి సంకోచించడం లేదు. పోనీ ప్లీనరీలోనైనా ప్రజా వ్యతిరేకతను తగ్గించడానికీ, తిరిగి ప్రజల అభిమానాన్ని చూరగొనడానికి ఏమైనా వ్యూహరచన లేదా కార్యాచరణపై చర్చ జరిగిందా అంటే అదీ లేదు. పైగా రాష్ట్రంలో 175కు 175 అసెంబ్లీ స్థానాలలో వైసీసీ విజయం కష్ట సాధ్యం కాదు.. సులభ సాధ్యమే అంటూ అధినేత పాత పాటే పాడటంతో వైసీపీ శ్రేణుల్లో ఈయన సీతయ్యే ఎవరి మాటా వినడంటూ పెదవి విరుస్తున్నారు. అమరావతి నుంచి ఆరంభిస్తే.. ఈ మూడేళ్లలో ఆయన మాట తప్పని అంశం లేదు. మడమ తిప్పనిసందర్భం లేదన్న విమర్శలు రాజకీయ వర్గాలలోనే కాదు సామాన్య జనంలోనూ వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలోని నిరుపేదలకు 25 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తామని ఎన్నికల ముందు గొప్పగా ఇచ్చిన హామీని తుంగలో తొక్కేశారు. రైతన్నలకు చెప్పిన ఉచిత బోర్లు మాట పూర్తిగా విస్మరించారు. మూడేళ్లుగా ఏపీలోని రోడ్ల దుస్థితిని పట్టించుకున్న పాపాన పోలేదు. అమ్మ ఒడికి కొర్రీలు, కోతలతో లబ్ధిదారుల విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ క్యాలెండర్‌ ఊసే లేదు. డీఎస్సీ హామీకి తిలోదకాలొదిలేశారు. ఆర్థిక అరాచకత్వాన్ని పరాకాష్టకుతీసుకుపోయారు.   ఇలా చెప్పుకుంటూ పోతే.. జగన్ మూడేళ్ల పాలన అంతా మాట తప్పడం, మడమ తిప్పడం వినా మరో ఘనత లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ పరిస్థితుల్లో  ఐదేళ్ల పదవీ కాలం పూర్తయ్యే వరకూ ఇదే విధానంలో కొనసాగితే  ఎన్నికలలో విజయం సులభ సాధ్యం కాదన్న అనుమానం అధినేతలోనే వ్యక్తం అవుతోందని పార్టీ శ్రేణులే అంటున్నాయి.

అందుకే ముందస్తుకే జగన్ మొగ్గు చూపుతున్నారంటున్నారు.  ప్లీనరీ సందర్భంగా వచ్చే ఎన్నికలలో విజయం గురించి జగన్ మాట్లాడడమే ఆయన ముందస్తుకే మొగ్గు చూపుతున్నారన్న సంగతి అవగతమైపోయిందని పరిశీలకులు అంటున్నారు. లేకుంటే ఎన్నికలకు మరో  రెండు సంవత్సరాలు సమయం ఉండగా అన్ని స్థానాలలోనూ విజయమే లక్ష్యం  అన్న ప్రకటన పార్టీ ప్లీనరీ వేదికగా చేయాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. అంతే కాకుండా ముందు ముందు పరిస్థితిని బేరీజు వేసుకుంటే ముందస్తే బెటరని జగన్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా సలహా ఇచ్చారని చెబుతున్నారు.  ఒక పక్కన ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని,  మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ముందస్తు ఎన్నికలకు తొందరపడటం జగన్ లో ఓటమిపై గూడుకట్టుకున్న భయానికి తార్కాణమన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.

ఒక వైపె పార్టీలో పెచ్చరిల్లుతున్న అసంతృప్తి, అసమ్మతి, మరో వైపు ప్రభుత్వంపై ప్రజలలో రోజు రోజుకూ పెరుగుతున్న వ్యతిరేకతతో జగన్ ఇవి మరింత పెరిగి పార్టీ పుట్టి ముంచేలోగానే.. ఏదో విధంగా సంక్షేమ కార్యక్రమాలను నెట్టుకువస్తున్న సమయంలోనే ముందస్తుకు వెళ్లి ఎలాగోలా వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలని భావిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  ‘గడప గడపకు మన ప్రభుత్వం’ సామాజిక న్యాయ భేరి పేర మంత్రుల బస్సు యాత్రలలో ఎదురైన ప్రజా వ్యతిరేకత అదే సమయంలో తెలుగుదేశం ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాలకు, పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న జిల్లాల పర్యటనలకు వస్తున్న స్పందనతో జగన్ ఈనఫ్ ఈజ్ ఇనఫ్.. మనపై వ్యతిరేకత మరింత పెరిగే లోగా, అలాగే తెలుగుదేవం పట్ల ప్రజాభిమానం మరింత ఎక్కువ కాకుండా ముందస్తుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

జగన్ ఉద్దేశానికి అనుగుణంగానే పీకే బృందం ఇప్పటికే జిల్లాల వారీగా నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలెట్టేసిందని చెబుతున్నారు.  సిటింగ్‌ వైసీపీ ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో ఉన్న స్పందన పసిగట్టేందుకే ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని  పీకే టీమ్‌ రూపొందించింటున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పటికే పలువురు సిటింగ్‌ ఎమ్మెల్యేలు ప్రజల నుంచి నిరసన సెగలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అలా జనం నుంచి వ్యతిరేకత వచ్చిన సిటింగ్‌ ల జాబితాను పీకే టీమ్‌ ఇప్పటికే రెడీ చేసిందని తెలుస్తోంది.    జనం నుంచి మరింత వ్యతిరేకత మూటకట్టుకోక ముందే.. ఓటమి భయం నుంచి గట్టేందుకు సీఎం జగన్‌ ముందస్తు ఎన్నికలకు ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు.

By
en-us Political News

  
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.