జగన్ వినాయకుడ్ని ఏం కోరుకునుంటారు?

Publish Date:Aug 28, 2025

Advertisement

జగన్  హిందూ మత విశ్వాసాలను నమ్మరన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన క్రిష్టియన్ సంప్రదాయాలకు విరుద్ధంగా మరో మారు హిందూ దేవతలకు పూజలు నిర్వహించారు. ఇప్పటికే ఆయన తాను సీఎంగా ఉండగా వెంకన్న సెట్ వేసి.. అక్కడ భక్తి రాహిత్యంతో కూడిన పూజల కారణంగా ఓడిపోయారని అంటారు పలువురు పాస్టర్లు. ఎందుకంటే ఎవరైతే  ఏసు ప్రభువును నమ్ముతారో వారు మరొక మతానికి చెందిన దేవుళ్లు, దేవతలకు పూజలు నిర్వహించరాదని అంటారు వీరు. 

కానీ జగన్ తనపై ఉన్న క్రిష్టియన్ సీఎం అన్న ముద్ర చెరుపుకోడానికి చాలా ప్రయత్నాలే చేశారు. ఫైనల్ టచ్ ఇద్దామని వెంకన్న సెట్ వేసి మరీ స్వామి వార్ని భారీఎత్తున కాకా పట్టేద్దామని గట్టిగా ట్రై చేశారు. కానీ తన సతీమణి భారతీరెడ్డి తిరుమలలో ఏర్పాటు చేసిన తన సైన్యం ఎఫెక్టూ.. దీంతో పాటు ప్రసాదం న్యాప్ కిన్ కి చుట్టిన పాప ఫలితమూ.. అది కాస్తా బెడిసి కొట్టి స్వామివారు నాతో పెట్టుకుంటే పంగనామాలే అన్న కోణంలో.. పదకొండు సీట్లు ఇచ్చారని అంటారు   శ్రీవారి భక్తులు.

ఇప్పుడు చూస్తే వినాయక చవితి సందర్భంగా మరోమారు హిందూ భక్తావతారం ఎత్తారు జగన్. ఈ సందర్భంగా స్వామివారిని ఏదో కోరుకుంటున్నట్టు కనిపించింది. ఆ మర్మరింగ్ కి మీనింగేంటా? అదే ఏం కోరుకుని ఉంటారా? అన్నదానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది.  అదెలంటిదంటే.. ‘గతంలో వైయస్ కుమారుడిగా ఒకే ఒక్క ఛాన్స్ అన్నాను. జనం ఇచ్చారు. వారిని నిండా ముంచాను. ఇప్పుడు చూస్తే నన్ను కనీసం ప్రతిపక్షానికి కూడా దిక్కులేకుండా చేశారు. ఇప్పుడందరూ నన్ను సాధారణ ఎమ్మెల్యే.. సాధారణ ఎమ్మెల్యే.. అని దెప్పి పొడుస్తున్నారు. నువ్వే ఎలాగోలా, ఏదో ఒకటి చేసి మరో మారు నన్ను ముఖ్యమంత్రి చేయి వినాయకా’ అంటూ ఆయన మొక్కినట్టు.. అందుకు వినాయకుడు కూడా వైల్డ్ గానే రియాక్టయినట్టూ భావిస్తున్నారు.

చాలయ్యా జగనూ.. చాలు! జనం సొమ్ము నువ్వు పప్పు బెల్లాల్లా పంచి.. రాష్ట్రాన్ని దివాలా తీయించింది చాలు. ఇకనైనా ఆ అమరావతిని ఎదగనీ. ఆ మాటకొస్తే ముందు నువ్వు నీ వాళ్లు నాలాంటి దేవతలు కొలువైన అమరావతిని వేశ్యల రాజధాని అంటూ దుష్ప్రచారం చేయించింది ఇక చాలు. దేవతలు అని అక్కడ ఉన్నా కూడా.. నువ్వు దాన్ని వేశ్యలంటూ నీ మీడియా ద్వారా చేయించిన రభస కైలాసం వరకూ రాలేదనుకున్నావా? నాకు మా కరస్పాండెంట్ నారదడు చెప్పారు. ఆపై నా మూషికం కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేసింది. ఈ సారి భూలోకం వెళ్లినపుడు మీరు జగన్ కి అట్టే వరాలు ఇవ్వకండి స్వామి.. అతడేం మీ భక్తుడు కాడు. అంతా నాటకం.. హిందూ ఓటర్లను బుట్టలో పడేసే యత్నం. పూజారులు ఏదైనా ప్రసాదం ఇచ్చినా జగన్ ఉండచుట్టి పక్కన పడేస్తారు. ఎందుకంటే ఎవరైతే హిందూ దేవతల ప్రసాదం తింటారో వారు ఆయా దేవుళ్ల భక్తులవుతారన్న నమ్మకాలున్నాయ్. వాటి ప్రకారం వారెట్టి పరిస్థితుల్లోనూ మన ప్రసాదాలను   ముట్టరు. కాబట్టి అట్టే ఆ దొంగ భక్తిని చూసి మురిసిపోకండి స్వామీ అని నాతో చెప్పే పంపింది. మా అమ్మ పార్వతమ్మ కూడా ఇదే చెప్పింది.

కారణమేంటంటే.. నేను ఏమీ లేని పిండి బొమ్మ నుంచి నిన్ను పుట్టించాను. అక్కడ బాబు కూడా ఏమీ లేని ఆ ప్రాంతాన్ని సుసంపన్నం చేయడానికి ఒక రాజధాని పుట్టించాలని చూస్తున్నాడు. దాన్ని దేవతల రాజధాని అని కూడా అంటారు. నేను చేసే పిండి బొమ్మను ఎవరైనా ధ్వంసం చేయాలని చూస్తే నాకెలా ఆగ్రహం కలుగుతుందో.. అక్కడి ప్రజలకు కూడా సరిగ్గా అలాగే కోపం వస్తుంది. కాబట్టి దయచేసి నువ్వు నా కుమారుడిగా జగన్ని మాత్రం అస్సలు కనికరించవద్దు. ఎందుకంటే అతడు ఇంకా మారలేదు….ఒక రాజధానిని పట్టుకుని అతడి మనుషులు చేపలు పట్టడానికి కూడా పనికిరాదనడం, పులస చేపలు ఇక్కడ దొరకొచ్చని వెటకారం చేయడం.. అక్కడి జనాల్లో కోపం తెప్పిస్తోంది.. ఎవరైతే జన వాక్యం పట్టకుండా అనుచిత వ్యాఖ్యానాలు వినిపిస్తారో వారిని మనం అస్సలు క్షమించరాదు.. కాబట్టి బీ అవేర్ ఆఫ్ ఇట్ బేటా! అంటూ మా అమ్మ కూడా చెప్పింది. ఇక మా నాన్న సంగతి సరే సరి. ఆయన మల్లికార్జునుడిగా కొలువైన  శ్రీశైలం వేదికగా అన్యమతస్తులను మీ హయాంలో ఎలా ప్రోత్సహించారో.. ఆయన భక్తుల మనోభావాలకు ఎలాంటి కష్టం కలిగించారో ఒక సారి గుర్తు చేశారు. కాబట్టి నీ కోర్కెలు నేను తీర్చితే- జనం కోర్కెలకు గోరీ కట్టడమేనని ఆ వినాయకుడు కూడా జగన్ కి స్పష్టం చేసినట్టు తెలుస్తోందన్న కామెంట్లు వినవస్తున్నాయ్.

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.