పరామర్శ పేర రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాట..మారని జగన్ తీరు!

Publish Date:Jan 10, 2025

Advertisement

 

తిరుమ‌లలో తొక్కిస‌లాట ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేసేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విశ్వ ప్ర‌య‌త్నాలు చేశారు. సొంత మీడియా ద్వారా, త‌న సోష‌ల్ మీడియా బ్యాచ్ ద్వారా అస‌త్య‌ ప్ర‌చారం చేస్తూ హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించ‌డంతో పాటు.. ప్ర‌జ‌లు లాగి లెంప‌కాయ కొట్టినా తన బుద్ధి మార‌లేదనీ.. మార‌దని మ‌రోసారి నిరూపించుకున్నారు. జ‌గ‌న్ అహంకారానికి తోడు వైసీపీ నేత‌ల వెకిలి చేష్ట‌లతో తిరుప‌తి ఘ‌ట‌న‌లో బాధితుల ప‌రామ‌ర్శించే స‌మ‌యంలో వారు ప్ర‌వ‌ర్తించిన తీరు ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హాన్నికలిగించింది.

కొంద‌రు అధికారుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా దుర‌దృష్ట‌వ‌శాత్తూ తిరుప‌తి తొక్కిసలాట ఘ‌ట‌నలో ఆరుగురు మృతి చెంద‌టం బాధాక‌ర‌మైన విష‌య‌మే. అయితే, ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే  టీటీడీ, తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయ్యాయి. గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టారు. వారికి మెరుగైన వైద్యం అందించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ తిరుప‌తి వెళ్లి క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించారు. ఘ‌ట‌న‌పై చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యారు. టీటీడీ స‌భ్యులు, అధికారుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కొంద‌రు అధికారుల‌ స‌స్పెండ్  చేశారు. తిరుపతి ఎస్పీ, జేఈవోలను ట్రాన్స్ ఫర్ చేశారు. విచారణ అనంతరం మరి కొందరిపై కూడా వేటు పడే అవకాశాలున్నాయి. మృతుల కుటుంబ స‌భ్యుల‌కు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించ‌డంతోపాటు.. వారికి కుటుంబాల్లోని ఒక‌రికి టీటీడీలో ఉద్యోగం  ఇస్తామ‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్పందించిన తీరుప‌ట్ల భ‌క్తులు, రాష్ట్ర ప్ర‌జానీకం హ‌ర్షం వ్య‌క్తం చేసింది. అయితే, జ‌గ‌న్ మాత్రం తిరుప‌తి ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేసేందుకు నానా ప్రయత్నాలూ చేసి అడ్డంగా దొరికిపోయారు. 

ఏదైనా విషాద ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు బాధితుల‌ను ప‌రామ‌ర్శించే స‌మ‌యంలో అధికారుల సూచ‌న‌లు పాటించాలి. హంగూ ఆర్భాటం లేకుండా బాధితుల‌ను ప‌రామ‌ర్శించి అస‌లేం జ‌రిగింద‌నే విష‌యాల‌ను తెలుసుకోవాలి. కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రూటే స‌ప‌రేటు. ఊహించ‌ని ఘ‌ట‌న‌లో బాధితులుగా మారి గాయాల‌తో ఇబ్బందులు ప‌డుతూ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న వారి వ‌ద్ద‌కు వెళ్లి జ‌గ‌న్‌  హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించారు. ఘ‌ట‌న జ‌రిగిన మ‌రుస‌టి రోజు ఉద‌యం నుంచే బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు తిరుప‌తికి జ‌గ‌న్ వ‌స్తున్నారంటూ విస్తృత ప్ర‌చారం చేశారు. స్థానిక వైసీపీ క్యాడ‌ర్ భారీ సంఖ్య‌లో త‌ర‌లిరావాలంటూ సందేశాలు పంపించారు. దీనికితోడు అధికారులు ఇచ్చిన స‌మ‌యం కంటే జ‌గ‌న్ ఆల‌స్యంగా తిరుప‌తి చేరుకున్నారు. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డే ఉన్నారు. కాస్త వేచి ఉండాల‌ని అధికారులు సూచించినా జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు వారిని లెక్క‌చేయ‌కుండా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వ‌ద్ద‌కు వెళ్లారు. జ‌గ‌న్ తోపాటు దాదాపు ప‌ది మంది వైసీపీ నేత‌లు ఆస్ప‌త్రి సిబ్బంది వారించినా లెక్క‌చేయకుండా తొసుకుంటూ లోప‌లికి వెళ్లారు. ఈ క్ర‌మంలో కొంద‌రి సెలైన్ బాటిల్స్ కూడా ప‌క్క‌కు తోసేశారు. ఐసీయూలోకిసైతం తోసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. బాధితుల‌ను ప‌రామ‌ర్శ పేరుతో జ‌గ‌న్, ఆయ‌న బ్యాచ్ చిన్న‌పాటి రాజ‌కీయ యాత్ర చేశారు. 

జ‌గ‌న్ రెడ్డి రాజ‌కీయం ఎంత నీచాతినీచంగా ఉంటుందో ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో ఏపీ ప్ర‌జ‌లంద‌రూ చూశారు. త‌ల్లిని, చెల్లినిసైతం పార్టీని నుంచి గెంటేసి, వారికి రావాల్సిన ఆస్తినిసైతం ఇవ్వ‌కుండా ముప్పుతిప్ప‌లు పెట్టాడు. అంత‌టితో ఆగ‌కుండా సోష‌ల్ మీడియాలో త‌ల్లి, చెల్లిపై విష‌ప్ర‌చారం చేయించారు. సొంత బాబాయ్ హ‌త్య విష‌యంలోనూ హంత‌కులుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారికి మద్దతుగా నిలిచారు. వారిని త‌న ప‌క్క‌నే తిప్పుకున్నారు. రాజ‌కీయాల‌కోసం ఎంత‌కైనా దిగ‌జారిపోయే జ‌గ‌న్ రెడ్డికి గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష హోదాకూడా ఇవ్వ‌కుండా ప్ర‌జ‌లు గ‌ట్టి బుద్ధిచెప్పారు. అయినా ఆయ‌న బుద్ధి మార‌లేదు. తిరుప‌తి ఘ‌ట‌న‌లో క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించే విష‌యంలోనూ జ‌గ‌న్ తనకు రాజకీయ లబ్ధి వినా మరేం పట్టదనీ, ప్రజలూ, వారి బాధల గురించి పట్టింపే లేదనీ మరో సారు రుజువు చేసుకున్నారు.  జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌కు వెళ్లేందుకు కొద్ది నిమిషాల ముందే ఒక‌రిద్ద‌రు వైసీపీ నేత‌లు 18మంది బాధితుల‌కు తెల్ల క‌వ‌ర్లు ఇచ్చారు. జ‌గ‌న్ వ‌స్తున్నారు,  ఆయ‌న వ‌చ్చిన స‌మ‌యంలో చంద్ర‌బాబు కార‌ణంగానే తిరుప‌తి ఘ‌ట‌న జ‌రిగింద‌ని చెప్పాలంటూ సూచించారు. బాధితుల‌కు తెల్ల క‌వ‌ర్లు ఇచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావ‌డంతో వెలుగులోకి వ‌చ్చాయి. మ‌రోవైపు.. జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీపై విమ‌ర్శ‌లు చేయ‌డానికే ప్రాధాన్య‌త‌నిచ్చాడు. 

తిరుప‌తి ఘ‌ట‌న‌లో మృతిచెందిన వారి కుటుంబాల‌కు, క్ష‌త‌గాత్రుల‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. టీటీడీ బోర్డులోని కొంద‌రు స‌భ్యులు త‌మ‌వంతుగా స‌హాయం అంద‌జేసేందుకు ముందుకొచ్చారు. ఐదు సంవ‌త్స‌రాలు ముఖ్య‌మంత్రిగా చేసిన జ‌గ‌న్ రెడ్డికి నిజంగా ఘ‌ట‌న ప‌ట్ల బాధ‌క‌లిగి ఉంటే   మృతుల కుటుంబాల‌కు తన వంతుగా సాయం ప్రకటించి ఉండాలి.  కానీ అలాంటిదేమీ చేయ‌కుండా కేవ‌లం ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేసేందుకు మాత్ర‌మే జ‌గ‌న్‌ ప్ర‌య‌త్నించారు. బాధితుల ప‌రామ‌ర్శ స‌మ‌యంలో జ‌గ‌న్‌, వైసీపీ నేత‌ల తీరును టీవీల ద్వారా వీక్షించిన ప్ర‌జ‌లు.. జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌కు వెళ్లావా.. రాజ‌కీయ యాత్ర‌కు వెళ్లావా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

By
en-us Political News

  
అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో రంగంలోకి దిగాలని స్టాలిన్ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈస్ట్ తిరుచ్చి నుంచి టీవీకే అధినేత విజయ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంది. దీంతో విజయ్ తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు.
తాను సమాజంలో ఉన్న అసమానతలకు, కుల వివక్షకు మాత్రమే వ్యతిరేకమన్నారు.  దేవాలయాల పూజా విధానాలపై కానీ, ప్రజల మత స్వేచ్ఛపై కానీ ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పారు. 
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడిగా, తెలుగుదేశం పార్టీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే నాయకుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారు. సాధారణంగా అవకాశం ఉన్నా లేకున్నా టీడీపీపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకునే భూమన.. ఆ పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్‌ను ఎక్కి ప్రయాణించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఆయనను అరెస్ట్ చేయకుండా ముందస్తు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తదుపరి విచారణలో ఈ పిటిషన్‌పై తుది తీర్పును వెల్లడిస్తామని పేర్కొన్న హైకోర్టు విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి రెండు రోజుల పాటు వర్చువల్
భారతీయ రాజకీయాల్లో సాధారణంగా కనిపించే శత్రుత్వాలు,
ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతంలో సుమారు 15 వేల‌ నుంచి 20 వేల‌ మంది వ‌ర‌కూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఒక‌ అంచనా. అయితే ఈ ప‌రిశ్ర‌మ ఇక్క‌డ స్థాపించ‌డంపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
కాంగ్రెస్ హైకమాండ్ కు, మరీ ముఖ్యంగా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన వీహెచ్ రాజ్యసభకు మూడు పర్యాయాలు ఎంపికయ్యారు. అయితే 2016 తర్వాత ఇంత వరకూ ఆయనకు పార్టీ పరంగా ఎటువంటి పదవీ దక్కలేదు.
కేరళం ప్ర‌జ‌ల‌కు దశాబ్దాలుగా సేవ చేస్తూ, విలువలతో కూడిన‌ రాజకీయాలు చేసే సతీశన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపని రేవంత్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అధికార బాధ్యతలు అప్పగించారని అన్నారు.
ఎల్‌డీఎఫ్ హయాంలో వి.డి.సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. క్లిష్ట సమయలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి తీసుకు రావడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు. కేరళం కాంగ్రెస్ కేడర్‌లో కూడా ఇదే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం సీఎంగా సతీశన్ ను ఎంపిక చేసింది.
సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల పర్యటనల సమయంలో భద్రతా కారణాల రీత్యా పెద్ద సంఖ్యలో వాహనాలు కాన్వాయ్‌లో ఉంటాయి. అయితే.. దీనివల్ల భారీగా ఇంధన వ్యయం అవ్వడమే కాకుండా.. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని భావించిన సీఎం, డిప్యూటీ సీఎం.. ఖజానాపై అనవసర భారం పడకూడదనే ఉద్దేశంతో, భద్రతకు విఘాతం కలగకుండానే వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు.
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.