Publish Date:Jul 28, 2023
జగన్ ప్రభుత్వ విధానాలన్నీ నేరపూరితమైనవే.. రాజ్యాంగ ఉల్లంఘనలే. కార్పొరేషన్ల పేరిట ప్రభుత్వం తీసుకున్న రుణాలన్నీ నిభందనలకు విరుద్ధమే. జగన్ ముఖ్యమంత్రిగా అనుసరించిన విధానాలను వ్యాపారులెవరైనా చేసి ఉంటే వారు జైలుకెళ్లి ఉండేవారు. ఇందుకు గాను వారికి పదేళ్లకు తక్కువకాకుండా శిక్ష పడేది. ఈ మాటలు అన్నది ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు . జగన్ ప్రభుత్వం రుణాల పేరిట చేస్తున్నదంతా పెద్ద మోసం అంటూ వివరించారు. రచ్చబండలో భాగంగా మీడియా సమావేశంలో రఘురామకృష్ణంరాజు ఏపీ సీఎం జగన్ ను ఆర్థిక అక్రమార్కుడిగా అభివర్ణించారు. జగన్ రాజ్యాంగంలోని 266/1, 293/3 అధికరణలను అతిక్రమించారని అన్నారు. భవిష్యత్ ఆదాయంపై ఇప్పుడే ఈ స్థాయిలో భారీ అప్పులు చేస్తే భవిష్యత్ తరాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేస్తున్న అప్పులపై తాను గతంలోనే ప్రధానమంత్రికి, ఆర్థిక శాఖ మంత్రి కి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి లేఖలు రాసినట్లు చెప్పిన రఘురామకృష్ణం రాజు దురదృష్ట వశాత్తూ కేంద్రం తన లేఖలను పట్టించుకోలేదన్నారు. దీంతో తాను కోర్టును ఆశ్రయించాననీ, అయితే కోర్టుకు వెళ్లడంలో జాప్యం జరిగిందంటూ కేసు కొట్టేసిందని వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ పేరిట గతంలో 38.142 వేల కోట్ల రూపాయల అప్పులను చేసిన రాష్ట్ర ప్రభుత్వం, తన పిటిషన్ ను కోర్టు కొట్టివేసిన 48 గంటల వ్యవధిలో మరో 12 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకునేందుకు రెడీ అయ్యిందన్నారు.
ఎక్సైజ్ టాక్స్ పేరిట కొత్త టాక్స్ వేసి మరీ ఏపీ ఎస్ డి సి పేరిట జగన్ సర్కార్ పాతిక వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్నదన్నారు. జగన్ విధానాల కారణంగా వచ్చే ఎన్నికలలో ఆయన ప్రభుత్వం దిగిపోయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వానికి మద్యం ధరలను తగ్గించే అవకాశం ఉండదని రఘురామకృష్ణం రాజు అన్నారు.
బటన్ నొక్కి సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్న జగన్ వాస్తవానికి చేస్తున్నది దోపిడీ మాత్రమేనని విమర్శించారు. భవిష్యత్తులో మద్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది లేదు. ప్రజలకు సంక్షేమ పథకాల పేరిట జగన్మోహన్ రెడ్డి నగదు ఇచ్చేదీ లేదన్నది జనం గ్రహించాలని చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-policies-are-violation-of-the-constitution-39-159129.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.