పవన్ పై జగన్ దూషణలకు కారణమదేనా?

Publish Date:Apr 17, 2024

Advertisement

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం (ఏప్రిల్ 17) స్వామివారిని 58 వేల690 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 744 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  స్వామి వారి హుండీ ఆదాయం 3 కోట్ల రెండు లక్షల రూపాయలు వచ్చింది.  ఇక గురువారం (ఏప్రిల్ 18)  ఉదయం స్వామివారి ఉచిత దర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి ఉచిత దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. అలాగే టైమ్ స్లాట్ దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్నారు. టైం స్లాట్ భక్తులకు శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. 

పవన్ పై జగన్ దూషణలకు కారణమదేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్  ప్రత్యర్థులపై కక్ష సాధింపు ధోరణిలోనే వ్యవహరిస్తారన్నది ఈ ఐదేళ్లుగా ఆయన తీరు చూసిన అందరికీ  అవగతమైంది. అయితే జనసేనాని పవన్ కల్యాణ్ పై జగన్ రెడ్డికి ప్రత్యేక కోపం ఉందని కూడా అర్ధమౌతోంది. కనీసం పవన్ కల్యాణ్ పేరు కూడా ఉచ్ఛరించకుండా దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని ప్రస్తావిస్తూ పవన్ పై వ్యక్తిగత దూషణలకు పాల్పడడాన్ని చూస్తునే ఉన్నాం. జగన్ మోహన్ రెడ్డికి జనసేనాని పవన్ కల్యాణ్ పట్ల అంతటి వ్యతిరేకత ఎందుకు. సాధారణంగా రాజకీయ నాయకులు పాటించాల్సిన కనీస సంయమనాన్ని కూడా పాటించకుండా పవన్ పై వ్యక్తిగత దూషణలకు సైతం తెగపడేంత ద్వేషభావం ఎందుకు?  అన్న ప్రశ్నకు పదేళ్ల వెనక్కు ఒక్కసారి వెళ్లాల్సి ఉంటుంది. ఔను నిజమే.. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికలలో అంటే 2014లో తన పార్టీ ఓటమికి అధికారానికి దూరం కావడానికి పవన్ కల్యాణే కారణమని జగన్ విశ్వసిస్తున్నారు. పవన్ కల్యాణ్ పొలిటికల్ ఎంట్రీ అప్పుడు లేకపోయి ఉన్నట్లైతే అప్పుడే వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండేదని జగన్ భావనగా ఆయనకు సన్నిహితంగా ఉండే వారు ఇప్పటికీ చెబుతున్నారు. 

అయితే వాస్తవానికి విభజనతో అన్నిందాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను గాడిన పెట్టే అనుభవం, దార్శనికత ఉన్న వ్యక్తిగా ఏపీ జనం చంద్రబాబును విశ్వసించారు కనుకనే ఆయన విజయం సాధించారన్నది విశ్లేషకులు మాట. విశ్లేషకుల మాట ఎలా ఉన్నా కేవలం పవన్ కల్యాణ్ అప్పట్లో తన పార్టీని ఎన్నికల బరిలో దించకుండా చంద్రబాబుకు మద్దతు పలకడం వల్లనే వైసీపీ పరాజయం పాలైందని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. 2019 ఎన్నికలలో పవన్ పోటీలోకి దిగారు. పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీ చేశారు. దీంతో ఆ ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ 2014 నాటి పొత్తులు పొడవడంతో ఓటమి తప్పదన్న భయంతోనే ఆయన పవన్ కల్యాణ్ పై ఇష్టారీతిన వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారనీ, దూషణలకు తెగబడుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పవన్ పేరు ప్రస్తావించడానికి కూడా జగన్ ఇష్టపడటం లేదనీ, ఎప్పడు పవన్ ప్రస్తావన వచ్చినా ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అనే సంబోధిస్తున్న సంగతి తెలిసిందే.  

సాధారణంగా రాజకీయ నాయకులు తమ విమర్శలలో ప్రత్యర్ధుల వ్యక్తిగత విషయాలను ప్రస్తావించకుండా నియంత్రణ పాటిస్తారు. మర్యాద రేఖ దాటకుండానే విమర్శలు చేస్తారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం అటువంటి నియంత్రణ అనేదే లేకుండా పవన్ కల్యాణ్ వివాహాలపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తుంటారు. 
అయితే ఇటీవల ఓ రెండు నెలల కిందట జనసేనాని తనకు  జగన్ నాలుగో భార్యా అంటూ ఘాటుగా రిటార్డ్ ఇవ్వడంతో వైసీపీ అధినేత కొంచం వెనక్కు తగ్గారు. ఈ రెండు నెలలుగా పవన్ కల్యాణ్ వివాహాలపై ఎటువంటి కామెంట్లూ చేయకుండా నియంత్రణ పాటించారు. అయితే మనమంతా సిద్ధంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మళ్లీ నియంత్రణ కోల్పోయి జగుప్పాకరమైన భాషలో పవన్ వివాహాలపై వ్యాఖ్యలు చేశారు. దీంతో పరిశీలకులు గోదావరి జిల్లా వేదికగా జగన్ పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తమదైన విశ్లేషణలు చేస్తున్నారు. 

గోదావరి జిల్లాలలో కాపు సామాజికవర్గం, బీసీ సామాజిక వర్గాల మధ్య స్వతహాగా ఉండే వైరాన్ని దృష్టిలో ఉంచుకుని బీసీలను దగ్గర చేసుకునే వ్యూహంతో జగన్  ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారంటున్నారు.  అయితే పవన్ పై అనుచిత, దిగజారుడు వ్యాఖ్యలు  జగన్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వవని చెబుతున్నారు. తెలుగుదేశం కూటమిలో భాగస్వామిగా ఉన్న జగన్ కు  ఇటు కాపుల మద్దతు, అటు బీసీల మద్దతూ కూడా ఉందనీ, ఆ కారణంగా జగన్ వ్యాఖ్యల కారణంగా వైసీపీకే నష్టం వాటిల్లుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
వామ్మో... రోజులు మరీ దారుణంగా మారిపోతున్నాయి. ఇటీవల కర్నాటకలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.
శుభకార్యాలకు ముహూర్తాలు లేవని పండితులు తేల్చారు. ఈ మూడు నెలలు వైశాఖ, జ్యేష్ట, ఆషాడ మాసాలు కావడంతో ముహుర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. దీంతో పెళ్లిళ్లతో పాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్టాపనలు, శంకుస్థాపనల వంటి కార్యాలకు విరామం వచ్చింది.
టీడీపీ సంక్షేమ ప‌థ‌కాల ముందు జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాలు వెల‌వెల పోతున్నాయి. గ‌తంలో జ‌గ‌న్‌కు ఓటు వేసిన వారంతా ఇప్పుడు కూట‌మి మేనిఫెస్టో కే జై అంటున్నారు. ముఖ్యంగా పెన్షన్లు రూ.4 వేలకు పెంపు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం మొత్తం ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రాన్నే మార్చివేసింది.
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ‘జనగళం’ పేరుతో విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రతి హామీ పద్ధతిగా వుంది. చంద్రబాబు విజన్‌ని ప్రతిఫలించేలా వుంది.
ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో ఒక ఏకే-47 రైఫిల్, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో డీఆర్ జీ, ఎస్టీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి
కూటమి ఉమ్మడి మేనిఫెస్టో మంగళవారం విడుదల చేసింది. ఇప్పటికే అధికార వైసీసీ నవరత్నాలు ప్లస్ అంటూ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో కూటమి మేనిఫెస్టోతో జగన్ మేనిఫెస్టోను పోలుస్తూ జనం చర్చించుకుంటున్నారు. జగన్ కొత్తగా ఇచ్చేదేమీ లేకపోగా, నవరత్నాలుప్లస్ అని గత ఎన్నికలలో విఫల హామీలకే కొద్ది పాటి నగదును చేర్చి ప్రకటించారన్న పెదవి విరుపు వైసీపీ వర్గాల నుంచే వ్యక్తం అవుతోంది.
గాజుగ్లాసు గుర్తు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలో ఉంది. గాజు గ్లాసు గుర్తును జనసేనకు రిజర్వ్ చేసిన ఎన్నికల సంఘం ఆ పార్టీ పోటీ చేయని స్థానాలలో మాత్రం ఆ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని కూటమిగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.
60 వేల కోట్ల రూపాయ‌ల‌తో మూసీ సుందరీకరణ ప్రాజెక్టును మొదలుపెట్టడానికి రేవంత్ స‌ర్కార్ సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే మూసీలో ప్రతిరోజూ నీటి ప్రవాహం ఉండాలి. అందు కోసం గజ్వేల్ నియోజకవర్గంలోని కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా 15 టీఎంసీల తాగునీటిని హైదరాబాద్​కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో 10 టీఎంసీల నీరు తాగునీటి అవసరాలకు సంపూర్ణంగా తీర్చడంతోపాటు , 5 టీఎంసీల నీటిని మురికికూపంగా మారిన మూసీనది ప్రక్షాళనకు ఉపయోగించబోతున్నారు
అది మే నెల 7వ తేదీ... 2014 సంవత్సరం. పులివెందులలో వాతావరణం సందడిగా వుంది. ఆరోజు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది.
విజయవాడలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదండగా మరణించారు.
ఏలూరు లోక్ సభ నియోజకవర్గంలోనూ, ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ తెలుగుదేశం కూటమి దూసుకుపోతున్నది. ఏలూరు లోక్ సభ స్థానంతో పాటు ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మంట్లన్నిటిలోనూ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
జిల్లాలో ఆ కుటుంబంలో నిట్టనిలువుగా వచ్చిన చీలిక కారణంగా.. ఇప్పటి వరకూ ఎన్నడూ చూడని దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. వైఎస్ కుటుంబీకులకు ఎదురు నిలిచి మాట్లాడే పరిస్థితే ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు ఆ కుటుంబానికి చెందిన వారితో ఎదురుపడి మాట్లాడటమే కాదు, నిలబెట్టి ప్రశ్నిస్తున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.