జగన్ గెలుపు అసంభవం.. వై నాట్ 175 ఆకాశానికి నిచ్చెనే!

Publish Date:Dec 29, 2023

Advertisement

వచ్చే ఎన్నికలలో ఏపీలో అధికార పార్టీ వైసీపీకి ఘోర ఓటమి తప్పదు. ఈ విషయాన్ని  సర్వే సంస్థలే కాదు, పరిశీలకులు, చివరికి వైసీసీ వర్గాలు కూడా తేల్చేశాయి. వైసీపీ ఎన్నికల వ్యూహాలను అందించే ఐ ప్యాక్ కూడా ఇదే విషయాన్ని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నిర్మొహమాటంగా చెప్పేసినట్లు తెలుస్తున్నది. ఇది కాక ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా సీఎంకు అదే నిర్ధారించినట్లు సొంత పార్టీ నేతలే  చెబుతున్నారు. ఇవన్నీ తెలిసే జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పు పల్లవి అందుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే, జగన్ చేసే తప్పులు, ఒంటెద్దు పోకడలపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీట్లు మార్చినా ఈసారి వైసీపీ ఓడిపోవడం తధ్యమని సొంత పార్టీ నేతలే గట్టిగా భావిస్తున్నారు. ఆమాటకొస్తే అసలు ప్రజలలో అసంతృప్తి ఎమ్మెల్యేల మీద కాదు.. ప్రభుత్వం మీద, సీఎం జగన్ మోహన్ రెడ్డి మీదనే  అంటున్నారు. జగన్ పై ప్రజలలో పీకల వరకు అసంతృప్తి నెలకొందని వైసీపీ వర్గాలు బాహాటంగానే మాట్లాడుకుంటున్నాయి.  నాలుగున్నరేళ్లుగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలే కొంపముంచాయని, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేల స్థానాల మార్పుతో మరో ఘోరమైన తప్పిదం చేస్తున్నారని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  

జగన్ తన వైఫల్యాలను మా మీదకి నెట్టి టికెట్ లేకుండా చేస్తున్నారని టికెట్ దక్కని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లేకపోయినా.. అసలు సీఎం తమను పట్టించుకోకపోయినా ఇన్నాళ్లూ తమ తమ నియోజకవర్గాలలో పార్టీని కాపాడుకుంటూ వచ్చామని, ఇప్పుడు అకస్మాత్తుగా తమను మరో నియోజకవర్గానికి  తరిమేస్తే ఎలా నెట్టుకురావాలని  స్థానాలను మార్చిన ఎమ్మెల్యేలు లబోదిబోమంటున్నారు. జగన్ మీద ఎంతో ఆశతో, నమ్మకంతో ప్రజలు ఒక ఛాన్స్ ఇస్తూ మెజారిటీ సీట్లలో గెలిపిస్తే జగన్ మాత్రం అందరి నమ్మకాన్ని వమ్ము చేశారనీ,  అదే నమ్మకంతో నాలుగేళ్లుగా వైసీపీ కోసం పనిచేసిన ఎమ్మెల్యేలను ఇప్పుడు నిర్ధాక్షణ్యంగా పక్కకి పెట్టేసి తమ నమ్మకాన్ని కూడా ఒమ్ము చేశారని సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు.  ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు నేతలు మాత్రం వాస్తవాన్ని దాచిపెట్టి ఇంకా ప్రజలను, కార్యకర్తలను, నేతలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. రోజా, అమర్నాథ్ లాంటి కొందరు నేతలు ఇప్పటికీ 175కి 175 సీట్లు గ్యారెంటీ అంటూ పలకడం ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న చందంగా ఉందని అంటున్నారు.

ప్రజలు తమని గొప్పగా చూసుకుంటారని వైసీపీని గెలిపించి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఒక్క సాధారణ ప్రజలే కాదు.. సమాజంలో అన్ని వర్గాలు జగన్ మోహన్ రెడ్డిపై ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపించారు. అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులు, విద్యుత్ కార్మికులు, రైతులు, విద్యార్థులు, మహిళలు ఇలా అందరూ జగన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీళ్ళందరికీ జగన్ చాలా చాలా హామీలు ఇచ్చారు. కానీ అవి నెరవేర్చడంలో  మాత్రం ఘోరంగా విఫలం అయ్యారు. ఇప్పటికే   వివిధ వర్గాలు ఆందోళన బాట పట్టాయి. తమ హామీలు, డిమాండ్లు నెరవేర్చాలని సమ్మె సైరన్ మోగిస్తున్నాయి. మహిళలు, రైతులు, విద్యార్థులు లాంటి వివిధ వర్గాలు ఓటు అనే ఆయుధంతో జగన్ కు బుద్ది చెప్పాలని తహతహలాడుతూ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు.   అప్పులు చేసి పప్పు బెల్లాలు పంచడం పాలన కాదని  జగన్ కు అర్ధమయ్యేలా చెప్పి ఓటమిని గిఫ్ట్ గా ఇవ్వడానికి రెడీ అయిపోయారు.  

నిజానికి జగన్   వైఫల్యం ప్రతి విషయంలోనూ తేట తెల్లం అవుతున్నది. రాజధాని లేదు, ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, అభివృద్ధి లేదు, కనీసం రోడ్లు కూడా సరిగా లేవు. బడుల విలీనం అంటూ విద్యాశాఖను సర్వనాశనం చేశారు. ఆంగ్ల మాధ్యమం పేరిట విద్యార్థుల జీవితాలను నాశనం చేశారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించి భవనాలను ఆధునీకరించాల్సి ఉండగా ఇవేమీ లేకుండా మొండిగా విధానాలను తీసుకొచ్చారు. తన ఆర్భాటం, తన ప్రచారం  కోసం, తన రాజకీయ లబ్ధి కోసం   ఒక భాషకి కూడా కులాన్ని అంటగట్టిన మేధావి జగన్. చంద్రబాబు ముద్ర చెరిపేయడం కోసం అమరావతిపై విషప్రచారం చేసిన జగన్.. మూడు రాజధానుల పేరిట ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేశారు. ఇసుక విధానంతో కార్మికులను రోడ్డున పడేశారు. రివర్స్ టెండరింగ్ తో కాంట్రాక్టర్లు ఆర్థికంగా చితికిపోగా.. ప్రాజెక్టులు ఎక్కడివక్కడే శిధిలమవుతున్నాయి.  ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు తల్లిదండ్రుల అకౌంట్లో వేయడంతో అవి విద్యాసంస్థలకు జమకాక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక పరిస్థితి ఏర్పడింది. నిరుద్యోగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్రామాల నుండి నగరాల వరకూ జగన్ చేసిన మేలు కానీ, ప్రయోజనం కానీ ఒక్కటి కూడా కనిపించడం లేదు.  దీంతో జగన్ గెలుపు అసాధ్యం అసంభవం అని పరిశీలకులు తేల్చేస్తున్నారు.

-జ్వాల

By
en-us Political News

  
ఈ ఆందోళన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్‌ల నుండి నేరుగా రోడ్లపైకి వస్తున్న ఈ జెన్-జీ ఉద్యమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.