ఉత్తుత్తి సాయం.. ఊకదంపుడు ప్రసంగం.. జగన్ రూటే సెపరేటు!

Publish Date:Oct 25, 2024

Advertisement

పరామర్శలు, ఓదార్పులలో వైసీపీ అధినేత, మాజా ముఖ్యమంత్రి జగన్ మాస్టర్స్ డిగ్రీ చేసి ఉంటారు. ఆయన ప్రతి పరామర్శ, ప్రతి ఓదార్పు రాజకీయ ప్రయోజనంతోనే ముడిపడి ఉంటుంది. అసలు జగన్ రాజకీయ ప్రస్ధానం ఇలాంటి పరామర్శలతోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత  కాంగ్రస్ నుంచి బయటకు వచ్చి వైసీపీ పార్టీని ఏర్పాటు చేసిన జగన్.. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి అంటూ ఓదార్పు యాత్ర చేపట్టారు. అది సుదీర్ఘంగా సాగింది. రోజులు, వారాలు, నెలలు కాదు ఏళ్ల తరబడి సాగింది. 

సాధారణంగా ఎవరయినా చనిపోతే వారి ఆత్మీయులు వెంటనే వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామ ర్శించి ఓదార్చి వస్తారు. కానీ మనిషి పోయిన ఏళ్ల తరువాత వెళ్లి పరామర్శ చేసి వస్తే ఏమనాలి. అసలు ఎవరు ఎవరిని పరామర్శిస్తున్నారన్న కన్ఫ్యూజన్ ఏర్పడేలా జగన్ ఓదార్పు యాత్ర సాగింది. ఎన్నికలలో మైలేజ్ కోసమే అన్నట్లుగా ఆయన అప్పట్లో చేపట్టిన ఓదార్పు యాత్రలు ఫలితాన్ని ఇవ్వలేదు. 2014 ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు. అది వేరే సంగతి. ఇప్పుడు జగన్ మళ్లీ ఓదార్పు లేదా పరామర్శ యాత్రలు చేస్తున్నారు. 2024 ఎన్నికలలో వైసీపీ ఘోరంగా పరాజయం పాలైంది. కనీసం విపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కలేదు. ఇప్పుడు అధికారం లేకపోవడంతో జగన్ మళ్లీ ఓదార్పు యాత్రలపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఎక్కడ ఎవరు ఏ కారణంతో చనిపోయినా జగన్ వెంటనే అక్కడ వాలిపోతున్నారు. నెత్తిన చేతులు పెట్టి, అలింగనం చేసుకుని మృతుల కుటుంబీకులను ఓదారుస్తున్నారు. పనిలో పనిగా అధికార తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలూ గుప్పించేస్తున్నారు. 

అలాగే గతానికి భిన్నంగా తన ఓదార్పు సందర్భంగా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నారు. అయితే ఆయన ప్రకటన అయితే చేస్తున్నారు కానీ.. ఆ సాయం తక్షణం అందించడం లేదు. సాధారణంగా ఎవరైనా ఓదార్పు, పరామర్శకు వచ్చిన సమయంలో బాధిత కుటుంబానికి చేయదలచుకున్న సాయం చేసి వస్తారు. అయితే జగన్ రూటే సెపరేటు.. ఆయన ఘనంగా ప్రకటన అయితే చేస్తారు.. అయితే ఆ ఆర్థిక సాయం ఎప్పుడు అందుతుంది అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఉండదు. 

ఎనన్నికలలో పరాజయం తరువాత తాడేపల్లి ప్యాలెస్ ను వదిలి ఎక్కువగా బెంగళూరులోనే మకాం ఉంటున్న జగన్ మోహన్ రెడ్డి ఏపీకి ఓదార్పుపర్యటనలకు మాత్రమే వస్తున్నారు.  ఇటీవల గుంటూరులో మరణించిన మహిళ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సందర్భంగా ఆ కుటుంబానికి పది లక్షల రూపాయల మాటసాయం ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్కు మాత్రం అందించలేదు. అలాగే అ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఏపీలో 77 మంది అత్యాచారానికి గురయ్యారనీ, వారందరికీ పది లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాననీ కూడా ప్రకటించేశారు. అయితే ఆ ఆర్థిక సాయం ఎప్పుడు ఎక్కడ ఎలా ఇస్తారో మాత్రం చెప్పలేదు.  విజయనగరం జిల్లాలో డయేరియా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల సాయం ప్రకటించేశారు. అంతకు ముందు విజయవాడ వరద బాధితుల కోసం కోటి రూపాయలు ప్రకటించారు. ఇలా ఆయన సాయం ప్రకటనలకే పరిమితమైంది కానీ బాధితులకు అందిన దాఖలాలు కనిపించడం లేదు.  నిజానికి ఇచ్చే ఉద్దేశం ఉంటే ప్రకటనతో పాటే సాయం కూడా అందజేయాలి. కానీ జగన్  ఎప్పుడూ అలా చేయలేదు.  ఆయన ఓదార్పు పరామర్శ అంతా ఉత్తుత్తి సాయం ప్రకటనలు.. ఊకదంపుడు ప్రసంగాలతోనే సరిపోతుంది.  

By
en-us Political News

  
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది. గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు, అభివృద్ధి , సుపరిపాలన, సంక్షేమం, సాధికారత విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది. అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సేవల వివరాలను అందించనుంది.
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.