Publish Date:Mar 27, 2025
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ కక్ష సాధింపు, ప్రత్యర్థి పార్టీల నేతలపై సోషల్ మీడియాలో బూతులతో విరుచుకుపడటమే పాలన అన్నట్లుగా సాగింది. చట్టాలకు తిలోదకాలిచ్చేసి ఇష్ఠారీతిగా చెలరేగిన వారందరూ ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో చట్టం ముందు నిలబడకతప్పని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదయ్యాయి. కొందరు అరెస్టయ్యారు. ఇంకొందరు బెయిలుపై ఉన్నారు. ఇంకా కొందరు ముందస్తు బెయిలు కోసం కోర్టులను ఆశ్రయించారు.
ఇంత జరిగినా వైసీపీ అధినేత జగన్ మారలేదు. ఆయన పార్టీ తీరు మారలేదు. గతంలో ప్రత్యర్థి పార్టీలపై అనుచిత భాషలో విరుచుకుపడిన వారికి జగన్ పదవులు, ప్రమోషన్లు ఇచ్చి ప్రోత్సహించారు. జగన్ అరాచక, అభివృద్ధి నిరోధక పాలనకు తోడు, ప్రత్యర్థి పార్టీల నేతలపై అనుచిత భాషా ప్రయోగం కూడా జగన్ పార్టీ ఘోర ఓటమికి కారణం అనడంలో సందేహం లేదు. అయితే జనం ఓటుతో బుద్ధి చెప్పినా, కనీసం విపక్ష హోదాకు కూడా జగన్ కి, జగన్ పార్టీకీ అర్హత లేదని తేల్చేసినా జగన్ తీరులో మార్పు రాలేదు. ఇప్పుడు కూడా భాష విషయంలో ఆయన ఇసుమంతైనా రాజీపడటం లేదు.
ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీలో పార్టీ పదవులు దక్కాలంటే ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగు దేశం కూటమి నేతలపై బూతులు, అనుచిత భాషలో విరుచుకుపడేవారికే పదవులు అని జగన్ తన చేతల ద్వారా నిరూపిస్తున్నారు. ఈ అనుచిత భాషా ప్రయోగంతో పాటు అవినీతి ఆరోపణలు కూడా ఉంటే అది అదనపు అర్హతగా భావిస్తున్నారు. తాజాగా వైసీపీ యూత్ వింగ్ కు కొత్తగా నియమితుడైన బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి ఉదంతమే ఇందుకు ఉదాహరణగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బైరెడ్డి సిద్దార్థరెడ్డి కోసం జగన్ పార్టీ యూత్ వింగ్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు సృష్టించారు. ఇంతకీ ఇంత హడావుడిగా బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డికి పదవి ఎందుకు కట్టబెట్టారంటే.. ఆయన అధికార కూటమిపై విమర్శలతో విరుచుకుపడటమే. అంతేనా మళ్లీ మేం అధికారంలోకి వస్తాం.. అప్పుడు ఇంతకింతా బదులు తీర్చుకుంటాం అంటూ వార్నింగ్ ఇవ్వడమే.
బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి మంగళవారం (మార్చి 25)న తెలుగుదేశం కూటమి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. బుధవారం (మార్చి 26) ఆయనకు పార్టీ యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి ఎగురుకుంటూ వచ్చేసింది. ఇంతకీ ఈ బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ గా పని చేశారు. ఆడుదాం ఆంధ్ర పేర పెద్ద ఎత్తున జరిగిన నిధుల దుర్వినియోగంలో అప్పటి టూరిజం, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజాతో పాటు సిద్ధార్ద్ రెడ్డిపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై ఆయన నేడో రేపో కేసులను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఉంది. ఇటువంటి వారికే వైసీపీలో పెద్ద పీట లభిస్తుంది. పదవుల విషయంలో అగ్రతాంబూలం దొరుకుతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-not-changer-even-after-humiliating-defeat-39-195090.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది