జగన్ పట్టిన కుందేలుకి మూడే..!

Publish Date:Sep 25, 2025

Advertisement

జ‌గ‌న్ చిన్న‌పిల్లాడో లేక, తానొచ్చిన ఫ్యాక్ష‌న్ కుటుంబ‌మే అలాంటిదో తెలీదు కానీ.. , ఆయ‌న అనుకున్న‌ది అనుకున్న‌ట్టు జ‌రిగిపోవాలి. అందుకు నిబంధనలు,  పాటింపులేం ఉండ‌క్క‌ర్లేదు. ఏదైనా అంతే..  తిరుమ‌ల డిక్ల‌రేస‌న్ నుంచి మొదలు పెడితే.. అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష హోదా వ‌ర‌కూ స‌రిగ్గా ఇలాగే క‌నిపిస్తుంది జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలి. జ‌గ‌న్ కి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని తేల్చి చెప్పారు స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు. జ‌గ‌న్ కి ఆ హోదా ఇవ్వ‌డానికి త‌న‌కు రూల్స్ బుక్ లో ఎలాంటి  క్లాజు క‌నిపించ‌డం లేద‌న్నారాయ‌న‌. అయితే సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ, ఢిల్లీకి సంబంధించి ఒక ఉదాహ‌ర‌ణ గుర్తు చేశారు. అప్ప‌ట్లో అంటే 2015 ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ క్లీన్ స్వీప్ చేసిందీ.. ఆ టైంలో బీజేపీకి వ‌చ్చింది కేవ‌లం మూడు సీట్లే.. కానీ ఢిల్లీ స్పీక‌ర్.. బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తాను ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా అంగీక‌రించార‌న్న వార్త తెర‌పైకి తెచ్చారు. 

ఇదిలా ఉంటే మ‌రో వార్త ఏంటంటే.. తాము స‌భ‌లోకి వ‌స్తాము. కానీ మాట్లాడ్డానికి కావ‌ల్సినంత స‌మ‌యం ఇవ్వాల‌ని కోరుతున్నారు జ‌గ‌న్ అని. రాకుండానే టైం ఇవ్వ‌ర‌న్న గ్యారంటీ ఏంటి? వ‌స్తే క‌దా తెలిసేది?  ఇదెలా ఉందంటే జ‌గ‌న్ టెన్త్ త‌ప్పిన పిల్ల‌లు ఆ కాసిన్ని మార్కులేసి మ‌మ్మ‌ల్ని  పాస్ చేసేయ‌వ‌చ్చు క‌దా? అని అడిగిన‌ట్టుంద‌ని అంటారు కొంద‌రు. ఇంకా లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే కొంద‌రు చెప్పేదాన్నిబ‌ట్టి చూస్తే అస‌లు జ‌గ‌న్ కి ఉన్న ఆ ఎమ్మెల్యే ప‌ద‌వి కూడా ఊడిపోయేలా ఉంది. భార‌త రాజ్యాంగం ఆర్టిక‌ల్ 190(4) ప్ర‌కారం.. అర‌వై రోజుల పాటు వ‌రుస‌గా ఎవ‌రైనా స‌భ్యుడు రాకుంటే.. ఆ సీటు ఖాళీగా ప్ర‌క‌టించ‌వ‌చ్చు.

ఇప్పుడు జ‌గ‌న్ కు ముందు గొయ్య‌- వెన‌క నుయ్య‌గా ఉంద‌ట ప‌రిస్థితి. ఎంత మాత్రం ఆయ‌న హ్యాపీగా లేరు. ఒక స‌మ‌యంలో జ‌గ‌న్ త‌న ఎమ్మెల్యే సీటుకు రిజైన్ చేసీ ఎంపీగా పోటీ చేయాల‌ని చూస్తున్న‌ట్టు స‌మాచారం. అలాగైనా త‌న‌కీ త‌ల‌వంపులు త‌ప్పుతాయ‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌గా తెలుస్తోంది. మిగిలిన వారి చేత కూడా రిజైన్ చేయించి.. ఉప ఎన్నిక‌ల‌కు పోవాల‌న్న‌ది జ‌గ‌న్ ఎత్తుగ‌డ‌. మ‌రి వారిలో అంద‌రూ ఓడిపోతే పరిస్థితేంట‌న్న‌ది ఎవ్వ‌రికీ అంతు చిక్క‌డం లేదు.  ఎందుకంటే అ చివ‌రికి పులివెందుల‌లో త‌న స్థానంలో పోటీ చేసే అవినాష్ కూడా ఓడిపోతే.. త‌ర్వాత జ‌గ‌న్ పార్టీ   ఉనికే ప్ర‌శ్నార్ధ‌కం కాగ‌ల‌ద‌న్న మాట వినిపిస్తోంది రాజ‌కీయ వ‌ర్గాల్లో.

By
en-us Political News

  
అధికార బదిలీ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని అంటున్నారు. అధిష్టానం సూచనల మేరకు రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఆ వెంటనే నూతన సీఎం ఎంపిక ప్రక్రియ లాంఛనంగా ముగుస్తుందని అంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా, తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి తీరుతాం అని మహానాడు వేదికగా లోకేష్ ప్రకటించారు.
ఈ రెండు రోజుల వేడుకలో వివిధ అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది.
ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను ఎక్స్ టెండ్ చేసుకున్నారు. గురువారం( మే 28) ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు ఆయన హాజరుకావలసి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటకకు చెందిన అగ్ర నాయకుల మధ్య సుమారు ఏడు గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా పూర్తి మద్దతు ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.